బ్రహ్మముడి ప్రోమో: డాక్టర్‌తో నాటకం ఆడించిన కావ్య- నిజం బయటపెట్టిన రాజ్- కావ్య ఎగ్జిట్ ప్లాన్- ప్రాణాలతో చెలగాటం!
బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రిపోర్ట్స్ చూసిన డాక్టర్ కావ్యకు ఏం కాదని, బేబీని క్యారీ చేయొచ్చని చెబుతుంది. దాంతో ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. రాజ్ మాత్రం డల్‌గా ఉంటే కావ్య అడుగుతుంది. డాక్టర్‌తో అబద్ధం ఎందుకు చెప్పించావని రాజ్ నిలదీస్తాడు. కావ్య షాక్ అవుతుంది. ఎగ్జిట్ ప్లాన్ ఉందంటుంది.
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కావ్య కళ్లు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ కొన్ని టెస్టులు చేస్తానంటుంది. కావ్యకు స్పృహ వచ్చేలోపే అబార్షన్ చేయించాయలని ఇందిరాదేవి ఐడియా ఇస్తుంది. కానీ, దానికి రుద్రాణి అడ్డు పడుతుంది.

తల్లికి తెలియకుండానా
రుద్రాణిని పట్టించుకోకుండా డాక్టర్‌తో కావ్య అబార్షన్ గురించి మాట్లాడుతాడు రాజ్. కానీ, డాక్టర్ ఒప్పుకోదు. తల్లికి తెలియకుండా అబార్షన్ చేయడం క్రైమ్ అంటూ వాదిస్తుంది డాక్టర్. ఇంతలో రిపోర్ట్స్ వచ్చాయని నర్స్ వచ్చి చెబుతుంది. దాంతో కావ్య బెడ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్స్ చూస్తుంది డాక్టర్. రిపోర్ట్స్ చూసిన డాక్టర్ బయటకు వచ్చి అందరికి గుడ్ న్యూస్ అని సంతోషంగా చెబుతుంది.
మీరు కావ్య గారి ప్రాణాలు పోతాయని భయపడేగా అబార్షన్ చేయిద్దామనుకుంటున్నారు. ఇక ఆ అవసరం లేదు. కావ్య గారి గర్భసంచి చిన్నది కావడంతో ఐదు నెలలు నిండితే బేబీని క్యారీ చేయలేదు. కానీ, ఇప్పుడు గర్భసంచిలో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. కాబట్టి బిడ్డను కంటే కావ్యకు ఏం కాదు అని డాక్టర్ చెబుతుంది. దాంతో ఇంటిల్లిపాది సంతోషిస్తారు.
డాక్టర్ మాటలు నమ్మని రాజ్
రుద్రాణి ఫీల్ అవుతుంది. కానీ, రాజ్ నమ్మడు. మీరు చెప్పేది నిజమా అని అడుగుతాడు రాజ్. పేషంట్ ప్రాణాల మీదకు వచ్చే పని డాక్టర్స్ చేయరు. అబద్ధం చెప్పరు అని ఆ లేడి డాక్టర్ అంటుంది. దాంతో సంతోషంగా అంత ఇంటికి వెళ్లిపోతారు. అప్పటివరకు ఇంట్లో చోటు చేసుకున్న విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఇకనుంచి అదంతా పక్కన పెట్టమని కావ్య అంటుంది.
ఇన్నాళ్లు ఏడుపులు, పెడబొబ్బలు చూసి విసిగిపోయాను. ఇకనుంచి అవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉందామని కావ్య అంటుంది. దానికి ఇకపై ఆనందానికి చిరునామా మన ఇల్లే అవుతుందమ్మా అని సీతారామయ్య అంటాడు. అంతా సంతోషంగా నవ్వుతూ ఉంటారు. రుద్రాణి మాత్రం తాను అనుకుంది జరగలేదని ఫీల్ అవుతుంది. రాజ్ కూడా డల్‌గా కూర్చుని ఉంటాడు.
ఎందుకు అబద్ధం చెప్పించావ్
అంతా సంతోషంగా ఉంటే డల్‌గా ఉన్నావేంట్రా అని రాజ్‌ను అడుగుతారు. రాజ్ ఏం చెప్పడు. ఏం లేదని వెళ్లిపోతాడు. రాజ్ వెనుకే కావ్య వెళ్తుంది. మీరు అనుకున్నట్లుగానే ఇంటికి వారసుడు పుట్టబోతున్నాడు. నా ప్రాణాలకు ఏం కాదని డాక్టర్ చెప్పిందిగా. అంతా మంచే జరిగిందిగా ఎందుకు అలా డల్‌గా ఉన్నారు అని కావ్య రాజ్‌ను అంటుంది.
మీరు కోరుకున్నట్లు నేను, బిడ్డ ఇద్దరం క్షేమంగా ఉంటామని తెలిసిందిగా. ఇకా ఏదో పోగొట్టుకున్నవాడిలా అలానే చూస్తున్నారు అని కావ్య అంటుంది. అబద్ధం ఎందుకు చెప్పించావ్ కళావతి. డాక్టర్‌తో అలా ఎందుకు చెప్పించావ్ అని రాజ్ అడుగుతాడు. దానికి ఒక్కసారిగా కావ్య అదిరిపడుతుంది. షాక్ అయిపోతుంది. నేను అబద్ధం చెప్పించడం ఏంటండి అని తడబడుతూ అడుగుతుంది కావ్య.
కావ్య ఎగ్జిట్ ప్లాన్
నువ్వు డాక్టర్‌తో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను అని రాజ్ చెబుతాడు. దాంతో షాక్‌లో నుంచి తేరుకున్న కావ్య అవునండి డాక్టర్‌తో అబద్ధం చెప్పించి నాటకం ఆడించాను. అదంత మన ఇంట్లోవాళ్ల కోసం. నేను ఎక్కడ చనిపోతానో అని అంతా బాధపడుతున్నారు. నేను చనిపోతానన్న నిజం చెప్పి ఇంట్లో అందరిని ఏడిపించాలా అని కావ్య అంటుంది.
మరి నీ గురించి ఏం ఆలోచించావ్ అని రాజ్ ఏడుస్తూ అడుగుతాడు. నేను ఎగ్జిట్ ప్లాన్ ఆలోచించాను అని కావ్య అంటుంది. ఎగ్జిట్ ప్లానా అని రాజ్ అయోమయంగా అడుగుతాడు. ఎగ్జిట్ ప్లాన్ అంటే కావ్య చనిపోవడం గురించి చెబుతుందని తెలుస్తోంది. బిడ్డ కోసం తన ప్రాణాలతో కావ్య చెలగాట ఆడుతుందని రాజ్ అనుకుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


