బ్రహ్మముడి నవంబర్ 7 ఎపిసోడ్: మారిపోయిన రాహుల్, క్షమించని స్వప్న- కుయిలిని చంపిన భర్త రంజిత్- రాహుల్ చంపినట్లు వీడియో

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 7 ఎపిసోడ్‌లో కుయిలి నిజ స్వరూపం ఏంటే చెప్పి రాజ్, కావ్య, గోల్డ్ బాబు వెళ్లిపోతారు. వాళ్లు వేసిన ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. అది కుయిలి భర్త రంజిత్ వెంటాడు. రాహుల్, కుయిలికి గొడవ జరుగుతుంది. కుయిలిని రాహుల్ కొడతాడు. అది రంజిత్ వీడియో తీస్తాడు. రాహుల్‌ను స్వప్న క్షమించదు.

Published on: Nov 07, 2025 7:29 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కుయిలి నిజ స్వరూపాన్ని రాజ్, కావ్య బయటపెడతారు. ఇప్పటికైనా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకుంటే మంచిది. ఇంటికొస్తే నీకే బెటర్ అని చెప్పిన రాజ్, కావ్య వెళ్లిపోతారు. వాళ్లతోపాటు గోల్డ్ బాబు కూడా వచ్చేస్తాడు. మొత్తానికి రాహుల్‌కు క్లారిటీ వచ్చిందని, నాటకం సక్సెస్ అయిందని ముగ్గురు సంబరపడతారు.

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 7 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 7 ఎపిసోడ్

రాజ్ డ్రామా విన్న రంజిత్

వాళ్ల మాటలను కుయిలి భర్త రంజిత్ వింటుంటాడు. రాజ్, కావ్య గెటప్‌లు తీసేస్తారు. రాత్రంతా కుయిలి పక్కన పడుకున్నాని రాహుల్ అనుకున్నాడు. వాడి పక్కనే పడుకున్న అని తెలిస్తే ఏమైపోతాడో అని గోల్డ్ బాబు అంటాడు. కుయిలి మళ్లీ ఏదైనా మాన్యుపులేట్ చేస్తుందేమో అని కావ్య అనుమానిస్తుంది. కుయిలి దగ్గర డబ్బు లేదని నిరూపించాం కదా రాహుల్ చస్తే ఉండడు. డబ్బు లేదని తెలిస్తే చాలు ఏ బందాన్ని అయినా పక్కన పడేస్తాడు అని రాజ్ అంటాడు.

ఇక్కడే ఉంటే లేనిపోని అనుమానాలు వస్తాయి. వెళ్లిపోదాం అని గోల్డ్ బాబు అంటాడు. దాంతో అంతా వెళ్లిపోతారు. అంటే వీరంతా రాహుల్ కోసం నాటకం ఆడారా. కుయిలి పరిస్థితి ఎలా ఉందో అని రంజిత్ అనుకుంటాడు. మరోవైపు కుయిలిని రాహుల్ కొడతాడు. చేసిన మోసానికి తిడతాడు. నువ్వు బజారు దానికన్న హీనం అంటాడు. నా డబ్బు కోసం ఆశపడ్డా నిన్ను ఏమనలిరా అని కుయిలి రివర్స్ అవుతుంది.

నీ మొగుడు పక్కన ఉన్న నన్ను ఎంటర్‌టైన్ చేశావే. నీకు ఇంకో పేరు పెట్టాలి అని రాహుల్ అంటే, పెళ్లయి, కూతురు కూడా ఉన్నా నాకోసం వచ్చిన నిన్ను ఏమనాలి అని కుయిలి అంటుంది. అవును, నిన్ను ట్రాప్ చేసి నీ ఆస్తి కొల్లగొట్టాలని అనుకున్నాను. నీకంటే బెటర్‌గా గోల్డ్ బాబు దొరికాడు. వాన్ని పడగొట్టాను. అయితే ఏంట్రా ఏం చేయగలవు. నీలాంటి వాళ్లు నా చేతుల్లో చాలా మంది అవుట్ అయ్యారు అని కుయిలి పొగరుగా అంటుంది.

వీడియో తీసిన రంజిత్

ఆ మాటలను రంజిత్ వింటుంటాడు. అదంతా వీడియో తీస్తాడు. నా కళ్లు బాగా తెరిపించావ్. నిన్ను నమ్మినందుకు నాకు మంచి శాస్తే చేశావ్. అరిచిన తిట్టిన నా పెళ్లాం దేవతే అని రాహుల్ అంటాడు. అబ్బో పెళ్లాం ఇప్పుడు గుర్తొచ్చిందా. అది కూడా నిన్ను మోసం చేసే పెళ్లి చేసుకుందిగా అని కుయిలి అంటుంది. దాంతో కోపంతో కుయిలిని ఒక్కటి కొడతాడు రాహుల్.

ఆ దెబ్బకు కింద పడిపోతుంది కుయిలి. ఇంకోసారి నా పెళ్లాం గురించి అంటే చంపేస్తాను అని రాహుల్ వెళ్లిపోతాడు. అదంతా రంజిత్ వీడియో తీస్తాడు. కుయిలి కాస్తా కదులుతుంది. మరోవైపు వాళ్లు ఆడిన నాటకం గురించి రాజ్, కావ్య చెబుతారు. అంతా నవ్వుతారు. రుద్రాణి కూడా మెచ్చుకుంటుంది. ఎప్పటికీ రుణపడి ఉంటానంటుంది. ఇంతకీ రాహుల్ గాడు ఎక్కడ అని ఇందిరాదేవి అంటుంది.

రాహుల్ దిగాలుగా ఇంటికి వస్తాడు. గుమ్మం దగ్గరే ఆగితే రాజ్ లోపలికి రమ్మంటాడు. రాహుల్ అడుగుపెడుతుంటే స్వప్న వద్దంటుంది. నీకు తప్పులు అలవాటు అయిపోయాయి. కానీ, నీతో కాపురం నాకు బరువైందని, నువ్వు పుట్టిందే తప్పులు చేయడానికి. నాకు సహనం చచ్చింది. అందుకే నీతో కాపురం చేయలేను, భర్తగా అంగీకరించలేను అని స్వప్న అంటుంది.

కళ్లు తెరుచుకున్నాయి

ఇప్పుడు ఈ పట్టుదల ఎందుకు అని కావ్య నచ్చజెబుతుంది. ఈ పూట గడవడానికి ఇది కూడా నాటకమే అని స్వప్న అంటుంది. నా కళ్లు తెరుచుకుని నా కాళ్ల ముందు పడ్డాను. నేను పూర్తిగా మారిపోయాను. నన్ను క్షమించు అని పశ్చాత్తాప పడతాడు రాహుల్. ప్రేమిస్తున్నప్పుడు ఇలాగే చెప్పావ్. కూతురు పుట్టాక కూడా మారలేదు. ఇలాంటి వాడు నా బిడ్డకు తండ్రి అని చెప్పలేను అని స్వప్న అంటుంది.

నీ ముందు నిస్సహాయంగా మారిన మనిషిలా నిలబడ్డాను. ఒక్క అవకాశం ఇవ్వు స్వప్న అని బతిమిలాడుకుంటాడు రాహుల్. ఒక్క ఛాన్స్ ఇవ్వమని రాజ్, కావ్య నచ్చజెబుతారు. ఇకపై నీకు నచ్చని పని చేయను. అలా చేస్తే నువ్వు ఏ శిక్ష వేస్తే దానికి సిద్ధం. ఈ ఒక్కసారి క్షమించు అని రాహుల్ వేడుకుంటాడు. రాహుల్ మారిపోయాడు. పూర్తిగా నీవాడు అయ్యాడు అని అపర్ణ అంటుంది.

రేయ్ ఇకనైన భార్యే జీవితంగా బతుకు లేకుంటే పుట్టగతులు ఉండవు అని రుద్రాణి అంటుంది. బాగా ఆలోచించిన స్వప్న ఇదే నీకు చివరి అవకాశం అని స్వప్న చెప్పి వెళ్లిపోతుంది. రాహుల్ లోపలికి వెళ్తాడు. తర్వాత రాహుల్‌ను రుద్రాణి కొడతుంది. ఇంకా మారవా. ఇలాగే లేకి పనులు చేస్తావా. అందరితో తిట్టించుకుంటావా అని తిడుతుంది.

కొంపను కూల్చి

అందరు నన్ను మనిషిగా గుర్తించారు అది చాలు. ఇలా అవుతుంది అనుకోలేదు. అంత మన మంచికే జరిగింది అని రాహుల్ అంటాడు. కుయిలి చేసింది చెబుతుంది రుద్రాణి. నమ్మిన వాళ్లమే మోసం చేయగలంరా. ఈ నమ్మకంతోనే ఈ కొంపను కూల్చి నీకు దోచి పెట్టాలనుకున్నాను అని రుద్రాణి అంటుంది. ఇంత జరిగినా కూడా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్ మామ్ అని రాహుల్ అంటాడు.

ఈ ఇంటికి వారసుడిని చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నీకు మళ్లీ ఓ అవకాశం ఇచ్చారు. దీన్ని పరిపూర్ణంగా వాడుకోవాలి అని రుద్రాణి చెబుతుంటే మామ్ నీకేమైనా మతిపోయిందా అని రాహుల్ అంటాడు. ఏయ్.. నేను చెప్పింది వింటూ నన్ను ఫాలో అవ్వు అని రుద్రాణి చెప్పేసి వెళ్లిపోతుంది.

తర్వాత కుయిలిని రాహుల్ చంపాడని, తను చనిపోయిందని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రాహుల్ చంపినట్లు వీడియో సాక్ష్యం ఉన్నట్లు చెబుతారు. నిజానికి కుయిలిని తన భర్త రంజిత్ చంపాడని తెలుస్తోంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.