బ్రహ్మముడి నవంబర్ 12 ఎపిసోడ్: కావ్యకు చీర కట్టిన రాజ్.. మామయ్యలను అడ్డంగా ఇరికించిన కళావతి.. అత్తకు స్వప్న వార్నింగ్

బ్రహ్ముముడి సీరియల్ బుధవారం (నవంబర్ 12) ఎపిసోడ్ లో రాజ్‌తో తాను చేయించుకోబోయే కోరికల జాబితా చెబుతుంది కావ్య. అంతేకాదు రాజ్ ద్వారా తన మామయ్యను అడ్డంగా ఇరికిస్తుంది. అటు అత్త రుద్రాణికి స్వప్న చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

Published on: Nov 12, 2025 7:04 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 876వ ఎపిసోడ్ చాలా సరదాగా సాగిపోయింది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం సంతోషంగా కనిపిస్తుంది. అయితే ఇంటి కోడలు చేసిన పనికి మామలకు కొత్త కష్టం వస్తుంది. అటు పూర్తిగా మారిపోయిన రాహుల్ ను మరోసారి రుద్రాణి మార్చడానికి ప్రయత్నించగా.. స్వప్న ఆమెకు గట్టి వార్నింగ్ ఇస్తుంది.

బ్రహ్మముడి నవంబర్ 12 ఎపిసోడ్: కావ్యకు చీర కట్టిన రాజ్.. మామయ్యలను అడ్డంగా ఇరికించిన కళావతి.. అత్తకు స్వప్న వార్నింగ్
బ్రహ్మముడి నవంబర్ 12 ఎపిసోడ్: కావ్యకు చీర కట్టిన రాజ్.. మామయ్యలను అడ్డంగా ఇరికించిన కళావతి.. అత్తకు స్వప్న వార్నింగ్

రాజ్‌తో ఆడుకున్న ఇంట్లో వాళ్లు

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్ కిచెన్ లో కావ్య కోసం రాజ్ చేసే చికెన్ మంచూరియాతో మొదలవుతుంది. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా ఇంట్లో వాళ్లు పట్టుకుంటారు. కన్నతల్లికి తలనొప్పి ఉందంటే తల తిప్పుకొని వెళ్తావు.. నాన్నమ్మను నేను నాకు నడుము నొప్పిగా ఉందంటే పట్టించుకోవు.. ఆఫీసు పని అంటే బిజీ అంటావు..

కానీ నీ భార్యకు మాత్రం చికెన్ మంచూరియా, అది కూడా అర్ధరాత్రి చేసి పెడతావా అంటూ అపర్ణ, ఇందిరాదేవి, ప్రకాశం, ధాన్యలక్ష్మి.. రాజ్‌తో ఆడుకుంటారు. కావ్య వాళ్లను మరింత రెచ్చగొడుతుంది. వాళ్లకు దండం పెట్టి రాజ్ వెళ్లిపోయిన తర్వాత రేపు నీ సంగతి చెబుతామని వాళ్లు డిసైడవుతారు.

రాజ్‌ను కాపాడి, మామయ్యలను ఇరికించిన కావ్య

మరుసటి రోజు హాల్లోకి వచ్చిన రాజ్ తో అక్కడే ఉన్న ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్, ప్రకాశం, ధాన్యలక్ష్మి ఆడుకుంటారు. ఒకరు ఫిల్టర్ కాఫీ అని, మరొకరు అల్లం చాయ్ అని, ఇంకొకరు గ్రీన్ టీ అంటూ ఆర్డర్ ఇస్తారు. నేనెందుకు ఇవన్నీ చేయాలని రాజ్ అంటే.. నీ పెళ్లానికి చికెన్ చేశావు కదా అంటూ మరో దెప్పి పొడుస్తారు. వాళ్ల నుంచి ఎలా తప్పించుకోవాలా అని రాజ్ ఆలోచిస్తుంటే.. కావ్య వస్తుంది. వాళ్లు అడిగినవన్నీ తీసుకొచ్చి రాజ్ ను కాపాడుతుంది. వంట ఒక్కటే కాదు.. రాజ్ తన మరిన్ని కోరికలు కూడా తీర్చనున్నాడని అంటుంది.

అయినా మా ఆయనకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి నాకోసం చికెన్ చేశాడు.. మీమీద మీ ఆయనలకు ప్రేమ లేదేమో.. లేదంటే వాళ్లూ చేసి పెట్టేవారని మామయ్యలను అడ్డంగా ఇరికిస్తుంది కావ్య. దీంతో అపర్ణ, ధాన్యం కలిసి తమ భర్తల వైపు అదోలా చూస్తారు. మా మీద ప్రేమ ఉంటే వంట చేసి పెట్టండని అంటారు. దీంతో సరే అంటూ ఇద్దరు అన్నదమ్ములు కిచెన్ లోకి వెళ్తారు.

భార్యల కోసం సుభాష్, ప్రకాశం వంట

భార్యల కోసం సుభాష్, ప్రకాశం వంట చేయాలని డిసైడవుతారు. ముందు ఉప్మ చేయాలనుకుంటారు. ఇంతకీ రవ్వతో చేస్తారా, పిండితో చేస్తారా అని సుభాష్ అడిగి.. రెండూ కలిపి చేద్దాంలే అంటాడు. ప్రకాశం పక్కనే ఉండి సుభాష్ అడిగిన ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాడు. సుభాష్ ఉప్మ చేస్తుంటాడు. అయితే ఉప్పు బదులు అతడు పంచదార ఇస్తాడు. అంతేకాదు పచ్చి మిర్చి బదులు కారంపొడితో సుభాష్ ఉప్మ చేస్తాడు. తర్వాత భార్యల కోసం ప్లేట్లలో పెట్టి తీసుకెళ్తారు.

అది ఎర్రటి రంగులో ఉండటం చూసి అపర్ణ షాక్ తింటుంది. కారంపొడితో చేశాం కాబట్టి అలా ఉంది.. ఏం ఫర్లేదు తినండని సుభాష్ అభయమిస్తాడు. దానిని నోట్లో పెట్టుకోగానే అపర్ణ, ధాన్యం ఇద్దరూ వాంతులు చేసుకుంటారు. ఉప్పు బదులు చక్కెర వేశారని, ఆ రంగు చూసినప్పుడే జాగ్రత్త పడాల్సిందని తమ భర్తలను తిడతారు. ఇందిరా దేవి మాత్రం తన కొడుకులపై నమ్మకం లేక తన ఉప్మ తానే చేసుకొని తినడంతో అపర్ణ, ధాన్యానికి మరింత మండుతుంది.

పూర్తిగా మారిపోయిన రాహుల్.. తల్లినీ ఎదిరించి..

మరోవైపు రాహుల్ కు తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. మరో డీల్ ఉందని ఆఫర్ ఇస్తాడు. నేరుగా ఇంటికే వచ్చేస్తాడు. రాహుల్ తాను చేయనని అంటున్నా అతడు వినకుండా ఫోన్ పెట్టేస్తాడు. దీంతో రాహుల్ కంగారుగా బయటకు వెళ్తాడు. అది చూసిన స్వప్న కూడా అతన్ని వెంబడిస్తుంది.

బయటకు వెళ్లిన తర్వాత తన ఫ్రెండ్ ను రాహుల్ తిడతాడు. ఇలాంటి డీల్స్ తాను మానేశానని చెప్పాను కదా అంటాడు. అక్రమంగా 10 కిలోల గోల్డ్ వస్తోందని, దానిని నీ కంపెనీకి మళ్లిస్తే రూ.20 లక్షలు వస్తాయని చెప్పినా రాహుల్ మాత్రం నో చెబుతాడు. అది విని స్వప్న సంతోషించగా.. రుద్రాణి కంగారుపడుతుంది. ఏం చేస్తున్నావో నీకు తెలుసా అంటూ అతన్ని తిడుతుంది.

తాను పూర్తిగా మారిపోయానని రాహుల్ అంటున్నా.. రుద్రాణి అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. అది విని స్వప్న ఆమె దగ్గరికి వచ్చి క్లాస్ పీకుతుంది. ఇన్నాళ్లూ నీమాట విని రాహుల్ పూర్తిగా పాడైపోయాడని, ఇప్పుడు మారానని అంటున్నా ఎందుకు మళ్లీ చెడగొట్టాలని చూస్తున్నావని రుద్రాణిని తిడుతుంది. తనదారికి అడ్డు రావద్దని, వస్తే బుల్డోజర్ లో తొక్కుకుంటూ వెళ్తానని స్వప్న అనడంతో రుద్రాణి కంగు తింటుంది.

మరోవైపు రాజ్ తో కావ్య తన నెక్ట్స్ కోరిక ఏంటో చెబుతుంది. బయటకు వెళ్లడానికి చీర నువ్వే కట్టాలని అంటుంది. సరే అంటూ రాజ్ చీర కడుతుండగా.. ఇద్దరూ మాంచి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతారు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.