కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప ఫుడ్ కోర్ట్ ఐడియా, అందరిముందు బయటపెట్టిన శ్రీధర్- కాశీకి జాబ్ లేదని తెలుసుకున్న స్వప్న

కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 15 ఎపిసోడ్‌లో కార్తీక్‌తో దీప జ్యోత్స్న ఫుడ్ కోర్ట్ ఐడియా గురించి చెబుతుంది. ఆ మాటలు ఫోన్‌లో శ్రీధర్ వింటాడు. శివ నారాయణ ఇంట్లో అందరి ముందు దీప ఐడియాను బయటపెడతాడు. దానికి ఇంతా దీపను మెచ్చుకుంటారు. కాశీ ఫ్రెండ్‌తో భర్తకు జాబ్ లేదని, నటిస్తున్నాడని స్వప్నకు తెలుస్తుంది.

Published on: Nov 15, 2025, 07:54:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కాంచను ఉదయం గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతాడు శ్రీధర్. దాంతో కోపంగా కాల్ చేసి మీ భార్యకు చెప్పొచ్చుగా అని అంటుంది. ఇంతలో కార్తీక్ వస్తే రాంగ్ నెంబర్ అని చెబుతుంది కాంచన. కార్తీక్‌కు మల్లెపూలు ఇచ్చి వెళ్లిపోతుంది. ఫోన్ ఆన్‌లోనే ఉంటుంది. శ్రీధర్ మాటలు వింటుంటాడు.

కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 15వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 15వ తేది ఎపిసోడ్

దీప ఫుడ్ కోర్ట్ ఐడియా

దీపకు మల్లెపూలు పెడతాడు కార్తీక్. ఇంతలో ఇడ్లీ వడ దోశ అని ఒకతను అమ్ముతూ వస్తాడు. అది విని పాత రోజులు గుర్తు చేసుకుంటుంది. బావ నాకు ఒక ఐడియా ఇచ్చింది. ఇడ్లీ బండ్లు అమ్మినట్లుగా జ్యోత్స్న రెస్టారెంట్‌ పేరుతో ఫుడ్ ట్రక్‌లు పెట్టి అపార్ట్‌మెంట్ల దగ్గర, భారీగా జనం ఉన్న దగ్గర అమ్మితే బాగుంటుంది. పది రూపాయల ఖర్చు తగ్గిస్తే చాలు అపార్ట్‌మెంట్ వాళ్లు ఆర్డర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని దీప చెబుతుంది.

ఐడియా బాగుంది. కానీ, అది తీసుకోవాల్సింది మాస్టారు అని కార్తీక్ అంటాడు. తప్పకుండా మావయ్యకు నచ్చుతుందని దీప అంటుంది. అబ్బా అంత కాన్ఫిడెన్సా. చూద్దాం అని శ్రీధర్ కాల్ కట్ చేస్తాడు. మరోవైపు స్వప్న ఐరన్ చేస్తుంటే విష్ణు అనే ఫ్రెండ్ కాల్ చేస్తాడు. పదే పదే చేయడంతో బాత్రూమ్‌లో ఉన్నట్లు చెబుతామని కాల్ లిఫ్ట్ చేస్తుంది స్వప్న.

కాల్ లిఫ్ట్ చేయగానే కాశీ ఫ్రెండ్ విష్ణు ఏదోటి వాగి మనకు జాబ్ లేదుగా. ఏదో ఇంట్లో ఇద్దరం మ్యానేజ్ చేస్తున్నాం అంతే. అర్జంట్‌గా జాబ్ వెతుక్కోవాలిరా అని అంటాడు. దాంతో స్వప్న కాల్ కట్ చేస్తుంది. కాశీ వస్తే ఇప్పుడు ఎక్కడికి అని అడుగుతుంది. జాబ్ కోసం అని చెప్పలేను అని సైలెంట్ అయిపోతాడు. ఇంతలో విష్ణు కాల్ చేస్తే కాశీ మాట్లాడి వచ్చాకా మాట్లాడుకుందాం అంటాడు.

సీఈఓకు కంపెనీ కారు

స్వప్న చాటుగా వింటుంది. మరోవైపు ఇంట్లో అందరి జాతకాలు చూడాలని, గురువు గారికి కాల్ చేసినట్లు పారిజాతంతో చెబుతాడు శివ నారాయణ. ఇంతలో దీప, కార్తీక్, శ్రీధర్ ముగ్గురు వస్తారు. సీఈఓకి కంపెనీ కారు ఇస్తుందని దశరథ్ అంటే.. నాకొద్దు. కంపెనీ లాభాల్లోకి వచ్చాకా తీసుకుంటాను అని శ్రీధర్ అంటాడు. అందుకు గ్రౌండ్ వర్క్ చేయాలని జ్యోత్స్న అంటుంది.

మరి మీ దగ్గర ఐడియా ఉందా అని దీప అడుగుతుంది. అది వంట చేసినంత ఈజీ కాదు. క్రియేటివ్ బ్రెయిన్ ఉండాలని జ్యోత్స్న అంటుంది. అది మనకు లేదంటావ్ అని కార్తీక్ పంచ్ ఇస్తాడు. రేయ్ మీ నాన్న సీఈఓ అయ్యాడుగా. ఆయన్ను చెప్పమను అని పారిజాతం అంటుంది. సవాల్ విసురుతున్నారా అత్తయ్య గారు. సరే కాచుకోండి అని దీప చెప్పిన ఐడియానే చెబుతాడు శ్రీధర్.

ఫుడ్ కోర్ట్ ఐడియా బాగుంది. కానీ, ఎలా ఇంప్లిమెంట్ చేయడమో పూర్తిగా చెప్పు. మనమెందుకు పెట్టాలని శివ నారాయణ అంటాడు. ఇది మన ఐడియా కదా. మావయ్యకు ఎలా తెలిసింది అని కార్తీక్, దీప అనుకుంటారు. అంతా ఐడియా బాగుందంటారు. కానీ, ఈ ఐడియా నాది కాదు. దీపది అని శ్రీధర్ ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అంతా షాక్ అవుతారు. ఈ ఐడియా నాకంటే తను చెబితేనే బాగుంటుంది అని శ్రీధర్ అంటాడు.

దీపకు ప్రశంసలు

మీరు మాట్లాడింది నేను విన్నానులే. ఇంటి దగ్గర కూడా వీళ్లు రెస్టారెంట్ డెవలప్‌మెంట్ కోసమే ఆలోచించారు అని శ్రీధర్ చెబుతాడు. తర్వాత కార్తీక్ ఐడియాను పూర్తిగా వివరిస్తాడు. దానికి అంతా చప్పట్లు కొడతారు. శివ నారాయణ పొగిడితే.. అది దక్కాల్సింది దీపకు అని కార్తీక్ అంటాడు. ఈ తెలివితేటలు చూసే నిన్ను సీఈఓగా చేయాలనుకున్నాడు అని అంటాడు.

లేపి తన్నిచ్చుకోవడం అంటే ఇదే అని జ్యోతో మెల్లిగా అంటుంది పారు. ఏంటీ పారు అంటావ్ అని కార్తీక్ అంటే.. ఐడియా బాగుందిరా అని పారు అంటుంది. ఇంతకుముందు ఎవరో ఐడియా అంటే వంట చేసినంత ఈజీ కాదన్నారు. వారికి చెప్పు ఈ ఐడియా ఇచ్చింది వంట చేసేవారే అని కార్తీక్ సెటైర్ వేస్తాడు. అంతా దీపను మెచ్చుకుంటారు.

ఐడియాను ఇంప్లిమెంట్ చేయండి అని శివ నారాయణ అంటాడు. శ్రీధర్ ఆఫీస్‌కు వెళ్లిపోతాడు. అంతా వెళ్లిపోతారు. కార్తీక్‌ను పక్కన కూర్చొబెట్టుకుని కాంచన గురించి అడుగుతాడు. అమ్మ హ్యాపీ కాల్ చేసి విషెస్ చేసింది అంతే అని కార్తీక్ అంటాడు. గురువు గారెని రమ్మన్నాను. అందరి జాతకాలతో పాటు మీవి చూపిస్తాను. అందరూ కలిస్తే చూడాలని ఉందని శివ నారాయణ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More