కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కొత్త సీఈఓగా దీప- జ్యోత్స్నకు మైండ్ బ్లాక్- ఆపేందుకు ఆఫీస్‌కు సుమిత్ర- తెగించిన పారిజాతం

కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 8 ఎపిసోడ్‌లో కార్తీక్‌ను శివ నారాయణ పిలిస్తే అంతా కొత్త సీఈఓ అనుకుంటారు. కానీ, జ్యోత్స్న అగ్రిమెంట్ పేరు చెప్పి కార్తీక్ మాట్లాడకుండా చేస్తుంది. కొత్త సీఈఓ కోసం చూస్తుండగా క్యారేజీతో ఆఫీస్‌కు దీప వస్తుంది. కొత్త సీఈఓ దీప అని జ్యోకి మైండ్ బ్లాక్ అవుతుంది.

Published on: Nov 08, 2025 7:45 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీప కిచెన్‌లో ఏం చేస్తుందో అని పారిజాతం తొంగి చూస్తుంది. కానీ, అది దీప కూడా చూస్తుంది. వంటింట్లోకి పారు రాగానే ఎదురుగా ఉంటుంది. దాంతో భయపడుతుంది పారిజాతం. పారిజాతంతో దీప ఆడుకుంటుంది. ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వవే. వరుసగా వాయించేస్తున్నావ్ అని అంటుంది పారు.

కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 8వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 8వ తేది ఎపిసోడ్

పారుకు దీప కౌంటర్స్

కార్తీక్ గాడే నెక్ట్స్ సీఈఓ అట. బయట టాక్. జ్యోత్స్న వచ్చి బతిమిలాడుకుందే అని పారిజాతం అంటుంది. ప్రతిదానికి కౌంటర్ వేస్తుంది దీప. వెనుకటికి నిలబడటానికి చోటు ఇస్తే పడుకోడానికి చోటు అడిగిందట అని పారు అంటే ఇప్పుడు ఎవరిని ఎవరు అడుగుతున్నారు అని దీప అంటుంది. అమ్మో ఎంత మాట అన్నావే. జ్యోత్స్న అడగడంతో నేను లోకువ అయ్యాను. నా మనవరాలికి అన్యాయం జరగనివ్వను. కార్తీక్ గాడు సీఈఓ ఎలా అవుతాడో చూస్తాను అని వెళ్లిపోతుంది.

కార్తీక్‌ను పిలిచిన శివ నారాయణ కూర్చోమంటాడు. కొత్త సీఈఓగా కార్తీక్‌ను ప్రకటించేయండి అని భరణి అంటాడు. ఆ మాట ఛైర్మన్ చెప్పాలి అని జ్యోత్స్న అంటుంది. అదే నా మనసులో మాట అయితే అని శివ నారాయణ అంటాడు. అయితే నా మనసులో మాట కూడా వినండి. సీఈఓకు కావాల్సిన అర్హత ఉందా అని జ్యోత్స్న అంటుంది. దానికి కార్తీక్ గారి అర్హత గురించి మీరు మాట్లాడుతున్నారా అని భరణి నవ్వుతాడు.

చదువు ఒక్కటే కాదు అని జ్యోత్స్న అంటుంది. గతంలో కంపెనీని సక్సెస్‌గా నడిపిన వ్యక్తి గురించా నువ్వు చెప్పెది అని దశరథ్ అంటాడు. మిస్టర్ కార్తీక్‌కు సీఈఓగా చేసే అర్హత లేదు. దానికి కారణం మా ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్. అగ్రిమెంట్ ప్రకారం నా నిర్ణయానికి వ్యతిరేకంగా తాను ఏం చేయడానికి వీల్లేదు అని జ్యోత్స్న అంటుంది. నీ వ్యక్తిగత అగ్రిమెంట్‌లు ఇక్కడ పనిచేయవు. నేను కార్తీక్‌ను సీఈఓగా ప్రపోజ్ చేయగలను అని శివ నారాయణ అంటాడు.

కార్తీక్‌కు బెదిరింపు

అదే మాట కార్తీక్‌ను చెప్పమను. నన్ను దాటి నిర్ణయం తీసుకునే అధికారం మీకు లేదని చెప్పండి అని జ్యోత్స్న అంటుంది. ఇలా కార్తీక్‌ను బెదిరిస్తుంటే మనమంతా మాట్లాడాలి కదా అని బోర్డ్ మెంబర్స్ అంతా జ్యోకి రివర్స్ అవుతారు. జ్యో మాత్రం కార్తీక్‌ను నిర్ణయం చెప్పమంటుంది. నేను ఇదివరకే ఓ నిర్ణయం తీసుకున్నాను. దాని పర్యవసానాలు ఎలా ఉన్నా సరే అని కార్తీక్ అంటాడు.

బావ తెగించాడు. అగ్రిమెంట్ దాటాడో ఏం చేయాలో నాకు తెలుసు అని జ్యో మనసులో అనుకుంటుంది. జ్యోకి రాసిచ్చిన అగ్రిమెంట్‌లో ప్రతి పదానికి నేను కట్టుబడి ఉన్నాను. నేను సీఈఓగా ఉండాలనుకోవట్లేదు అని కార్తీక్ షాక్ ఇస్తాడు. నన్ను క్షమించండి అని కార్తీక్ అంటాడు. మీరు లేకుంటే కంపెనీ భవిష్యత్తు ఏం కావాలి. జ్యోత్స్న మీద హోప్స్ లేవు అని భరణి అంటాడు.

మీరంతా సైలెంట్‌గా ఉంటే నేను ఒకటి చెబుతా. ఇలాంటి సమస్య ఒకటి వస్తుందని ముందే నాకు తెలుసు. కార్తీక్ సీఈఓ అని ఎవరన్నారు. ముందు మీరే అన్నారు. మీరే కొత్త ఇష్యూ తీసుకొచ్చారు. అందుకే కొత్త సీఈఓను మేము వేరే వ్యక్తిని అనుకున్నాం. దీనివల్ల అందరి మనసులో ఏముందో తెలిసింది. కార్తీక్ ఏమైంది అని శివ నారాయణ అంటాడు.

కొత్త సీఈఓగా దీప

కొత్త సీఈఓగా ఆల్రెడీ ఎంట్రీ అయ్యే ఉంటారు అని కార్తీక్ అంటుండంగా.. దీప క్యారేజీతో అడుగుపెడుతుంది. కొత్త సీఈఓ గురించి పొగుడుతాడు. బావ అంటూ దీప ఎంట్రీ ఇస్తుంది. నా భార్య వచ్చేసిందని కార్తీక్ అంటాడు. కొత్త సీఈఓ దీప అని షాక్ అవుతుంది జ్యోత్స్న. లంచ్ పూర్తి చేశాకా కొత్త సీఈఓ గురించి మాట్లాడుకుందామని శివ నారాయణ అంటాడు.

బావ నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు కదా అని పారిజాతంకు కాల్ చేసి జ్యోత్స్స రెస్టారెంట్స్‌కు కాబోయే కొత్త సీఈఓ బావ కాదు దీప. ట్విస్ట్ ఎలా ఉంది అని జ్యో అంటుంది. బ్రెయిన్ డెడ్ అయిందని పారు అంటుంది. దాన్ని ఆపడానికి పవర్‌ఫుల్ అస్త్రం ఉంది. మీ అమ్మ. నేను మీ అమ్మను తీసుకొని వస్తాను. నేను ఏదో ఒకటి చేస్తాను అని పారిజాతం అంటుంది.

తర్వాత సుమిత్రను పిలిచి దీప కొత్త సీఈఓ అంట అని చెబుతుంది సుమిత్ర. ఏం జరిగినా నేను, నా భర్త మామయ్య నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సుమిత్ర అంటుంది. నువ్వు నాతోపాటు వచ్చి ఆపు. అక్కడ ఆపాల్సిన ఘోరాలు చాలా ఉన్నాయి. నీ కూతురు భవిష్యత్తు మారాలంటే మనం వెళ్లాల్సిందే పారిజాతం అంటుంది. సరే చీర మార్చుకుని వస్తా అని సుమిత్ర అంటుంది.

దీపను బతకనివ్వను

శివ నారాయణ కొత్త సీఈఓ దీప అని ప్రకటిస్తే దాన్ని బతకనివ్వను. నేను కూడా అన్నింటికి తెగించే ఉన్నాను అని కత్తి పట్టుకుంటుంది పారిజాతం. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.