కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపతో ఫలించని జ్యోత్స్న బేరాలు- కార్తీక్ వెన్నుపోటు- సీఈఓగా ప్రకటన- బావ, మరదలి మాటల యుద్ధం
కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 7 ఎపిసోడ్‌లో కూతురు పెళ్లి చూడాలని సుమిత్ర చెప్పడంతో పారిజాతం యుద్ధ నీతి చెబుతుంది. దాంతో దీప దగ్గరకు వెళ్లి జ్యోత్స్న బేరాలు ఆడుతుంది. ఆఫీస్ దగ్గర కార్తీక్‌తో మాట్లాడిన జ్యోత్స్న నానా మాటలు అంటుంది. వాటికి ఘాటుగా కార్తీక్ బదులిస్తాడు. బావ, మరదలు మాటల యుద్ధం చేస్తారు.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్నను సీఈఓ చేయడంపై సుమిత్ర అభిప్రాయాన్ని అడుగుతారు. నా కూతురుని పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నాను అని చెప్పి అందరికి షాక్ ఇస్తుంది సుమిత్ర. అదే నా కల. నా కూతురుకు పెళ్లి చేసి ఒక అందమైన జీవితాన్ని కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతకుమించి నేను ఏం కోరుకోవట్లేదు అని సుమిత్ర అంటుంది.

ట్విస్ట్‌కు దిమ్మ తిరిగిందని
అత్త ఇచ్చిన ట్విస్ట్‌కు దిమ్మ తిరిగిందని దీపతో అంటాడు కార్తీక్. కాసేపట్లో ఆఫీస్‌కు వెళ్లాలి రెడీగా ఉండు అని శివ నారాయణ చెప్పేసి వెళ్లిపోతాడు. పెద్ద మేడమ్‌కు స్ట్రాంగ్‌గా కాఫీ పెట్టమని దీపకు చెబుతాడు కార్తీక్. బావ సీఈఓ అయిపోతే దీప ముందు ఓడిపోయినట్లే అని జ్యోత్స్న అంటుంది. అయితే దీపను పట్టుకో. ఇదే యుద్ధ నీతి. పురాణాల్లో కూడా ఇదే రాసి ఉంది. మనకి సపోర్ట్ చేయడని తెలిసిన మనిషిని సాయం అడగాలి. అప్పుడు తప్పించుకోడానికి చూస్తాడు. అప్పుడు లాక్ చేయాలి అని పారు అంటుంది.
దీప ఏం చేస్తది అని జ్యో అడిగితే.. కార్తీక్ గాడిని నీకు సపోర్ట్ చేసేలా చేస్తుంది. కార్తీక్ గాడు నీకు సపోర్ట్ చేస్తే మీ తాత నీకు సపోర్ట్ చేస్తాడు అని పారిజాతం అంటుంది. దాంతో దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్లి సాయం కావాలంటుంది. మీరు అన్ని గుండెలు అదిరిపోయేటివే అడుగుతావ్. ముందు మాటివ్వలేను అని దీప అంటుంది. మన బావ గురించే అడిగేదని జ్యోత్స్న అంటుంది.
నాకు మాత్రమే బావ. నీకు పిలిచే అర్హతే లేదు అని దీప అంటుంది. నా మేనత్త కొడుకు. నాకెందుకు లేదని జ్యోత్స్న అంటుంది. అందుకేనా డ్రైవర్‌ను చేశారు అని దీప అంటుంది. బావ డ్రైవర్ నుంచి ఓనర్ అవుతాడు అని జ్యో అంటుంది. మీకిచ్చి పెళ్లి చేయమంటారా ఏంటీ అని దీప పంచ్ వేస్తుంది.
40 ముక్కలు చేసిన
నీకు వెటకారం ఎక్కువ అవుతుందని తెలుస్తోంది. కానీ, సీఈఓ అయ్యేందుకు బావ నాకు సపోర్ట్ చేస్తే అంతా వింటారు. నువ్వు చెబితే బావ వింటాడు. నాకు ఊరికే వద్దు. బావ నాకు సపోర్ట్ చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను. నన్ను సీఈఓగా అనౌన్స్ చేయగానే అగ్రిమెంట్‍ను నాలుగు ముక్కలు చేస్తాను అని జ్యో అంటుంది. 40 ముక్కలు చేసిన నా మాట బావ వినడు అని దీప అంటుంది.
నువ్వు ఈ ఇంటికి రావడాని కారణం నేనే. నా వల్లే నీకు బావ దక్కాడు. నా రుణం తీర్చుకుంటున్నాను అనుకో అని జ్యో అంటే.. మీ రుణం నేనే తీర్చుకుంటా. అది నా పర్సనల్ అకౌంట్ అని దీప అంటుంది. నేను చెప్పినవన్నీ తీరుస్తానంటున్నానుగా అని దీప చేయి పట్టుకుని ప్రామిస్ చేస్తుంది జ్యో. ఎవరి సపోర్ట్ లేదని ఏడుస్తున్నట్లు నటిస్తుంది జ్యోత్స్న.
మీరు వెళ్లండి నేను ఆలోచిస్తా అని దీప అంటుంది. దాంతో థ్యాంక్స్ చెప్పి సంతోషంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. నేను ఏం చేయాలో నాకు తెలుసు. ఇది నీకు మీ నానమ్మ ఇచ్చిన సలహా. ముందు ఆవిడకు బుద్ధి చెబితే సెట్ అవుతుందని దీప అనుకుంటుంది. దీపకు ఆఫర్ ఇచ్చింది పారుకు చెబుతుంది జ్యో. ఇది వర్కౌట్ అవ్వదనిపిస్తుందని పారిజాతం అంటుంది.
ఒక్కసారి మూడు ముళ్లు పడితే
ఇవన్నీ మానేసి పెళ్లి చేసుకో అని పారిజాతం అంటుంది. పెళ్లి పెళ్లి అని చంపుతున్నారు. ఒక్కసారి మూడు ముళ్లు పడితే నచ్చకున్న కలిసి బతకాల్సిందే. సీఈఓ అయితే బావే నా భర్త అది ఎలాగో చెబుతా అని జ్యోత్స్న అంటుంది. ముందు ఆఫీస్‌కు బయలుదేరు. ఈలోపు బ్రహ్మాండమైన ఐడియా ఇస్తాను అని పారిజాతం అంటుంది. ఆఫీస్‌కు అంతా వెళ్తారు.
కార్తీక్‌తో జ్యోత్స్న మాట్లాడుతుంది. అనుకుంది సాధించాలంటే రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి నాలా స్ట్రిక్ట్‌గా జెన్యూన్‌గా ఫైట్ చేయడం, రెండోది నీలా బ్యాక్ స్టాబ్ చేయడం అంటే వెన్నుపోటు పొడవడం. నా మనుషులనే నాకు కాకుండా చేశావ్. ఏకైక వారసురాలిని అయిన అధికారం లేకుండా చేశావ్. బోర్డ్ మీటింగ్ పెట్టింది సీఈఓను చేయడానికి. ఇదంతా నువ్వు దీప కోసం చేస్తున్నావ్ అని జ్యోత్స్న అంటుంది.
అంటే ఇప్పుడు నేను పగ సాధిస్తున్నాను అంటున్నావా అని కార్తీక్ అంటాడు. అవును అన్ని తాను చేసిన పనులను కార్తీక్ చేయించినట్లుగా చెబుతుంది జ్యోత్స్న. నీ చేతకాని తనాన్ని వేరేవాళ్లపై రుద్దకు అని కార్తీక్ అంటాడు. మీలా ఇంతలా దిగజారలేదు అని జ్యోత్స్న అంటుంది.
నాతో బేరాలు ఆడావ్
ఆ మాట అనడానికి నీకు నోరెలా వస్తుంది. నిన్ను సీఈఓగా బోర్డ్ మెంబర్స్ వద్దన్నారు. నీకు సిగ్గుంటే ఆరోజే రిజైన్ చేసేదానివి. కానీ, నాతో బేరాలు ఆడావ్. నిజాలు మాట్లాడుతుంటే మండుతుందా. నిజానికి దిగజారిపోయింది నువ్వు. నా భార్యతో వంట గదిలో బేరాలు ఆడటం నేను చూశాను. దీన్నే దిగజారడం అంటారు అని కార్తీక్ అంటాడు.
దాంతో అవాక్కయిన జ్యో లోపల ఏదైనా తేడా జరగాలి మీ అందరిని అని జ్యోత్స్న అంటుంటే.. ఏం చేయలేవ్.. ఏం చేయలేవ్. లోపల ఏం జరుగుతుందో అని భయపడి చేస్తున్నావ్. తల ఎగిరేసిన వాళ్లముందు తలదించుకోవాల్సి వస్తుందని భయపడి చేస్తున్నావ్. నేను రాను. పిలుపు వస్తే ఆగను అని కార్తీక్ అంటాడు. లోపలికి జ్యోత్స్న వెళ్తుంది.
జ్యోత్స్న గారు సీఈఓగా ఉంటే మేము ఈ సంస్థలో ఉండలేం సర్ అని బోర్డ్ మెంబర్ భరణి అంటాడు. నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని జ్యోత్స్న అడుగుతుంది. ఏమంటారు అని శివ నారాయణ అంటే భరణి సారీ అంటాడు. దశరథ్ కూడా వద్దంటాడు.
సీఈఓగా కార్తీక్
మరి కొత్త సీఈఓ ఎవరు అని జ్యోత్స్న అడిగితే.. కార్తీక్‌ను పిలవమని శివ నారాయణ చెబుతాడు. బావను సీఈఓగా చేయకుండా ఎలా ఆపాలి అని అనుకుంటుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.














