కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అందరి కళ్లు తెరిపించిన సుమిత్ర- ఏడిపించిన కావేరి- కాంచనకు జ్యోత్స్న సారీ చెప్పాలన్న శ్రీధర్
కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 1 ఎపిసోడ్‌లో మీ అమ్మ గురించి బాధపడినట్లు నటించే అని జ్యోత్స్నకు సలహా ఇస్తుంది పారు. కింద డ్రామా చేస్తాను రా అని ప్లే చేస్తుంది పారిజాతం. కానీ, అది వర్కౌట్ కాదు. కావేరి వాళ్లకు సుమిత్ర వచ్చిన విషయం తెలిసి సంతోషిస్తారు. కాంచన గురించి చెబుతు ఏడిపించేస్తుంది కావేరి.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పారిజాతం సపోర్ట్ చేయకపోవడం గురించి జ్యోత్స్న అలుగుతుంది. నాకు ముందే చెబితే ఏదోటి చేసేదాన్ని. పోలీసులు తీసుకెళ్తావా. రోజు రోజుకీ దిగజారిపోతున్నావ్. పద్ధతి మార్చుకుంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు. మంచిదానిలా నటించు. ఇంటికి వారసురాలివి కావాలంటే మంచిదానిలా నటించు అని పారిజాతం సలహా ఇస్తుంది.

అమ్మను పట్టుకుని ఏడు
మీ అమ్మ వచ్చిందంటే మనసు మార్చుకుంది. మీ అమ్మనాన్న కలిసిపోయారు. నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మ ఇంకా గమనించలేదు. మీ అమ్మ లేకపోవడం వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో తెలిసినట్లు చేస్తే నువ్ చేసిన పని కొట్టుకుపోతుంది. వచ్చి మీ అమ్మను పట్టుకుని ఏడు అని పారిజాతం అంటుంది. నా వల్ల కాదంటుంది జ్యోత్స్న. నేను చిన్న డ్రామా ఆడుతాను. దా అని పారిజాతం జ్యోని తీసుకెళ్తుంది.
సుమిత్ర వచ్చినట్లు స్వప్నకు మెసేజ్ పెడతాడు కార్తీక్. ఆ విషయం తెలిసి కాశీ సంతోషిస్తాడు. మనం కూడా వెళ్తాం అని కాశీ అంటే.. అంత అవసరం లేదు. మీకు ఏదో వర్క్ ఉందన్నారుగా చూసుకోండి అని కావేరి అంటుంది. దాంతో కాశీ వెళ్లి వర్క్ చేసుకుంటాడు. ఎందుకు వద్దన్నావ్. నాన్నతోపాటు అంతా అక్కడే ఉన్నారు. సెలబ్రేషన్ జరుగుతుంది అని స్వప్న అంటుంది.
నాన్నను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు అజ్ఞాతంలోనే బతుకుతున్నావ్. నాన్న కూడా ఆ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనకు ఇవ్వలేదు అని స్వప్న అంటుంది. చాలా చెత్త ప్రశ్న అడిగావ్. అన్ని తెలిసి అడుగుతున్నావ్. సరే చెబుతాను. మీ నాన్నకు కొడుకు ఉన్నాడని తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను. కాంచన అక్కకు నేను ఎవరో తెలిసాకా తన భర్తను ఇచ్చేసింది. ఎన్నో మాటలు పడింది. అవమానాలు పడింది అని కావేరి అంటుంది.
ఏడిపించేసిన కావేరి
ఎప్పటికీ మీ పెద్దమ్మే ఫస్ట్ ప్రయారిటీ. ఆయన ఇవ్వకపోయినా నేను ఇస్తాను. నాకు ఓ ఆశ ఉంది. అక్క కుటుంబంతో పాటు నాకు నిలబడే చోటు ఇస్తే చాలు. కానీ, నేను నిలబడితే అక్క గౌరవం పోతుంది అని కావేరి ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. చాలా బాగా చెప్పావమ్మా అని హగ్ చేసుకుంటుంది స్వప్న. అదంతా కాశీ వింటాడు. మన మధ్య లేకున్నా వాళ్లు మనవాళ్లే. వాళ్లు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉన్నట్లే అని కాశీ అంటాడు.
మరోవైపు జ్యోత్స్న చాలా బాధపడిందని పారిజాతం డ్రామా స్టార్ట్ చేస్తుంది. కార్తీక్ బ్రేకులు వేస్తాడు. కేసులు పెడితేనే ప్రేమేమో అని శ్రీధర్ పంచ్‌లు వేస్తాడు. నా బాధ ఎవరికి అర్థం కాకపోయినా పర్లేదు. అమ్మకు అర్థమైతే చాలు అని జ్యోత్స్న అంటుంది. అసలు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావ్. కార్తీక్‌ను, బావను ఎలా కలిశావ్ అని శ్రధర్ అడుగుతాడు.
నిజం చెప్పాలంటే నేను చచ్చిపోదామని ఇంటి నుంచి బయలుదేరాను. నేను బతకడానికి ఇంకేదేమైనా కారణం ఉందా అని ఆలోచించాను అని జరిగింది అంతా చెబుతుంది సుమిత్ర. దీప లేకుంటే నా శవం కనిపించేది. దీప లేకపోతే ఎమైపోయేదాన్నో అని సుమిత్ర అంటుంది. అందుకేనా ఆరోజు నన్ను ఇంటి నుంచి బయటకు పంపించావ్ అని శ్రీధర్ అంటాడు.
ఇది మోసం కాదా
వా దీప.. చూశావా తాత ఇంట్లోనే పెట్టుకుని వెతుకుతున్నట్లు నాటకం ఆడాడు. స్పృహలో లేని నా తల్లిని ఇంట్లో పెట్టుకున్నారు. దాన్ని ఏమంటారు మోసం కాదా. బయట కిడ్నాప్ అనే అంటారు. అందుకే పోలీసులను తీసుకెళ్లాను అని జ్యోత్స్న అంటుంది. నిన్ను ఎవరు తీసుకెళ్లమన్నారు. కిడ్నాప్ అయినట్లు నేను చెప్పానా. నేనే మీకు చెప్పొద్దని మాట తీసుకున్నాను అని సుమిత్ర చెబుతుంది.
నా గురించి చెబితే నా శవం కళ్ల చూస్తారు అని దీపను బెదిరించాను. పాపం దీప అన్ని మౌనంగా భరించింది. తను మంచి పని చేసిన కూడా మీ ముంది తప్పు చేసిన వ్యక్తిల తలదించుకోడానికి కారణం నేను. ఏదైనా ఉంటే నన్ను అనండి అని సుమిత్ర నిజం చెప్పి అందరి కళ్లు తెరిపిస్తుంది.
ఇప్పుడు అర్థమైందా మేన కోడలా. నా భార్యకు క్షమాపణ చెప్పు. మాములుగా అయితే అరెస్ట్ చేయించాలి. కానీ మా మావయ్య, బావ మొహం చూసుకుని ఊరుకుంటున్నాను అని శ్రీధర్ అంటాడు. సారీలు అవి ఎందుకులే మాస్టారు అని వద్దంటాడు. సుమిత్ర, దీప ఇద్దరికి రుణం ఉంది అని ఒకరినొకరు కాపాడుకున్నది. మళ్లీ వాళ్లిద్దరు కలిసిపోయారు అని చెబుతాడు కార్తీక్.
వెడ్డింగ్ సెలబ్రేషన్స్
ఏంట్రా కలిసిపోయేది. వాళ్లు నిజం చెప్పకపొవడంతో వీళ్లంతా ఎంత కంగారుపడ్డారో తెలుసా. అది చూసి నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని పారు అంటుంది. ఏం అలా ఉండకుంటే బాగుండదనా అని కార్తీక్ అంటాడు. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నా కోడలు, కొడుకుని కలిపింది కార్తీక్, దీపనే అని శివ నారాయణ అంటాడు. ఇద్దరు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతాడు.
అత్తమామలకు పెళ్లి రోజు శుభకాంక్షలు చెప్పాలి. దానికి పెద్ద ప్లాన్ చేశాను అని కార్తీక్ అంటాడు. కాసేపటికి కేక్ అరెంజ్ చేసి సెలబ్రేట్ చేస్తాడు కార్తీక్. ఇదంతా అత్త మీద ప్రేమ అని దశరథ్ అంటాడు. చిన్నతనంలో సుమిత్ర చూసుకున్నది చెప్పిన కార్తీక్ కన్నతల్లినే బిడ్డ మర్చిపోయేంత ప్రేమ పంచిన అమ్మ లాంటి అత్తకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.














