కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప అరెస్ట్‌-స్వ‌ప్నకు అబ‌ద్ధం చెప్పిన కాశీ-గుడిలో ద‌శ‌ర‌థ బాధ‌-సుమిత్ర‌ను చూసిన కార్తీక్‌

కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 29 ఎపిసోడ్ లో గుడిలో అర్చన చేయిస్తాడు దశరథ. మరోవైపు దీప మీద కంప్లయింట్ ఇచ్చానని అరెస్ట్ చేయిస్తుంది జ్యోత్స్న. జాబ్ లేదనే విషయం చెప్పకుండా కవర్ చేస్తాడు కాశీ. భార్య విషయంలో తప్పు చేశానని దశరథ ఫీల్ అవుతాడు. 

Published on: Oct 29, 2025, 07:26:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 29 ఎపిసోడ్ లో గుడిలో దశరథను చూసి సుమిత్ర దాక్కుంటుంది. ఆమె తలలోని పూలు కిందపడిపోతే దశరథ తీసుకుంటాడు. ఈ రోజు నా పెళ్లి రోజు. నా భార్య నాతో రాలేదు. ఇద్దరి పేరున అర్చన చేయండని దశరథ అంటాడు. సుమిత్ర, దశరథ అని కార్తీక్ పేర్లు చెప్తాడు. ఇంతకుముందే ఇదే పేరుతో అర్చన చేయించారని పూజారి చెప్తాడు. సుమిత్ర అయి ఉంటుందని దశరథ అంటాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

తప్పించుకోలేవు దీప

దీప అత్తను త్వరగా తీసుకొస్తే బాగుండని కార్తీక్ అనుకుంటాడు. మనుషులు వద్దనుకున్నప్పుడు ఈ మనిషి కోసం పూజలెందుకు అని సుమిత్ర అనుకుంటుంది. సుమిత్ర అక్కడ పెట్టిన కుంకుమను బొట్టుగా పెట్టుకుంటాడు దశరథ. దశరథ వెళ్లిపోయాక ఆ పూలను కళ్లకు అద్దుకుని జడలో పెట్టుకుంటుంది సుమిత్ర. మరోవైపు ఇల్లు మొత్తం వెతికాను మమ్మీ లేదని జ్యోత్స్నకు కోపం వస్తుంది. తప్పించుకోలేవు దీప, మమ్మీ ఎక్కడుందో చెప్పకపోతే పరిణామాలు వేరేగా ఉంటాయంటుంది.

చేయి లేపిన జ్యో

దీప, జ్యోత్స్న ఒకరికొకరు వార్నింగ్ లు ఇచ్చుకుంటారు. జ్యోత్స్న చేయి లేపగానే నా కోడలి ఒంటి మీద చేయి పడిందంటే కాళ్లు లేవనే సంగతి కూడా మర్చిపోతానని కాంచన ఫైర్ అవుతుంది. నాకు మేనకోడలి కంటే కోడలే ఎక్కువ. అత్త అనే గౌరవం ఉంటే నా ఇంటికి పోలీసులతో వచ్చేదానివే కాదని కాంచన అంటుంది. దీపను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడానికే వచ్చా. మా మమ్మీని దీప కిడ్నాప్ చేసింది. ఈ ఇంట్లోనే దాచింది. అందుకు సాక్ష్యం సుమిత్రమ్మ అని నీతో అన్న మాటేనని జ్యో అంటుంది.

దీప మీద కంప్లయింట్

దీప నువ్వు కార్తీక్ కు ఫోన్ చేయ్ అని కాంచన చెప్తుంది. కానీ కార్లో ఫోన్ పెట్టిన కార్తీక్ లిఫ్ట్ చేయడు. ఎస్ఐ గారు ఈ దీప మా మమ్మీని కిడ్నాప్ చేసింది. అరెస్ట్ చేయండి. నేను కంప్లయింట్ చేశా. దీప మీద నాకు అనుమానం ఉంది. ఎస్ఐ మా మమ్మీని గన్ తో షూట్ చేసింది ఈ దీప. మా మమ్మీకి దీపకు పడదని జ్యోత్స్న అంటుంది. కంప్లయింట్ తీసుకున్న తర్వాత ముందు ఇంటరాగేషన్ చేయాల్సిందేనని ఎస్ఐ అంటాడు. ఇది నా ఇల్లు కాబట్టి నన్ను అరెస్ట్ చేయండని కాంచన అంటుంది. దీప మీద కంప్లయింట్ చేశానని అంటుంది జ్యో.

నేను కూడా వస్తా. ఇది శివన్నారాయణ మనవరాలు. నేను కూతురిని. దానికే అంత పొగరుంటే నాకెంత ఉండాలని కాంచన అంటుంది. బావ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని దీప అనుకుంటుంది.

కవర్ చేసిన కాశీ

కాశీని నిజం చెప్పమని అడుగుతుంది స్వప్న. నువ్వు ఏం తప్పు చేశావ్? కొత్తగా ప్రవర్తించిన ప్రతిసారి తప్పు చేస్తున్నావ్? ఒకసారి బయట వ్యక్తి కాలర్ పట్టుకున్నాడు. జ్యోత్స్నతో సీక్రెట్ గా మాట్లాడావు. ఇప్పుడు మా నాన్న కాళ్లు పట్టుకున్నావు. తప్పు చేసి నిజం ఇంట్లో చెప్పొద్దన్నట్టే ఉంది. ఎందుకు కాళ్లు పట్టుకున్నావని స్వప్న అంటుంది. ప్రాజెక్ట్ కు మంచి అప్లాజ్ వచ్చింది. అందుకే సెంటిమెంట్ గా ఆశీర్వాదం తీసుకున్నా. ప్రమోషన్ వచ్చాక సర్ ప్రైజ్ చేద్దామనుకున్నా అని కవర్ చేస్తాడు కాశీ.

దశరథ ఎమోషనల్

మీ అత్తయ్యకు నాకు పెళ్లయిన దగ్గరి నుంచి ప్రతి సంవత్సరం ఈ గుడికి వచ్చేవాళ్లం. కనీసం ఈ ఆలోచనైనా తనను ఈ గుడికి తీసుకొస్తుందనే ఆశతో వచ్చానని దశరథ అంటాడు. అత్త వస్తుందని చెప్తాడు కార్తీక్. తప్పు చేసిన వాళ్లను క్షమించే అవకాశం ఉన్నా మౌనంగా శిక్షించడమే మూర్ఖత్వం. మీ అత్త విషయంలో మూర్ఖుడిలాగే ప్రవర్తించా. మా నాన్న చెబుతున్నా వినలేదు. పంతానికి పోయి బంధాన్ని తెంచుకున్నానని దశరథ అంటాడు.

ఆరిపోయిన జ్యోతి

మనల్ని ప్రేమించిన వాళ్లు దూరం కారు. ఆ బంధం విడిపోనివ్వదు. దీప మీద కోపంతో అత్త తాళి తీసింది తప్ప నువ్వంటే గౌరవం లేక కాదు. ఆ తప్పు క్షమించలేకపోయావని కార్తీక్ అంటాడు. నేను బాధపడేది నన్ను అర్థం చేసుకోలేదని. నాకు తన మీద కోపం వచ్చింది. తన భర్తను నేను. ప్రేమను తీసుకుంటుంది కానీ కోపాన్ని తీసుకోదా? అని జంట ప్రమిదల గురించి చెప్తాడు దశరథ. అప్పుడే ఓ జ్యోతి ఆరిపోతుంది. మీ అత్త క్షేమంగా ఉందా లేదా అని దశరథ ఆందోళన చెందుతాడు.

మీ అత్తయ్యకు ఏమైనా అయితే మాత్రం నేను బతకలేను. నా ఇంటి దీపం వెలగాలి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ. అది చూసి సుమిత్ర కూడా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ఓ జ్యోతి జ్వాలతో మరో జ్యోతి వెలుగుతుంది. ఆ దీపాన్ని చూసి నాలాంటి వాడు బుద్ధి తెచ్చుకోవాలి. భార్య దూరమైతే ఎంత కాలం బాధ మోయగలుగుతావా? అని దేవుడు పరీక్ష పెట్టాడు. ఇక ఓపిక లేదని దశరథ అంటాడు. ఓపికగా చూడాలి మామయ్య. అత్త గుడికి వచ్చి, నీ ముందు నిలబడి మాట్లాడొచ్చేమో అని కార్తీక్ అంటాడు.

మీ అత్త ముఖం చూసే అర్హత కూడా లేదు. తప్పు చేసిన మనిషిలా తల దించుకోవడం తప్పా అని దశరథ అంటాడు. అప్పుడే సుమిత్రను చూస్తాడు కార్తీక్. ఇక్కడితో కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More