కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: శివన్నారాయణ మాస్టర్ ప్లాన్-ఏంట్రా మామయ్య అని కాశీపై శ్రీధర్ ఫైర్-కార్తీక్, దీప రొమాన్స్
కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 27వ తేదీ ఎపిసోడ్ లో సుమిత్ర మీద దశరథ ప్రేమను బయటకు తీసేందుకు శివన్నారాయణ రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. అన్ని అనార్థాలకూ కారణం నువ్వేనని తాతతో అంటాడు కార్తీక్. జాబ్ డ్రామా ఆడుతున్న కాశీపై శ్రీధర్ ఫైర్ అవుతాడు. మరోవైపు శౌర్యకు చెల్లినివ్వాలని దీపతో చెప్తాడు కార్తీక్.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 27వ తేదీ ఎపిసోడ్ లో ఈ రోజు నువ్వు కొత్త తాతను చూడబోతున్నావని కార్తీక్ తో అంటాడు శివన్నారాయణ. ఫోన్లో సుమిత్ర ఫొటో చూస్తూ బాధపడతాడు దశరథ. ఫొటో చూస్తే కాదు వెతకాలి అని పారు అంటుంది. మమ్మీని నేను వెతికి తీసుకొస్తానని జ్యో అనగానే, అవసరం లేదని శివన్నారాయణ ఎంట్రీ ఇస్తాడు. ఎవరూ వెతకాల్సిన అవసరం లేదంటాడు.

శివన్నారాయణ సీరియస్
పేపర్లో సుమిత్ర కోసం ప్రకటన వేయిస్తానని దశరథ అంటాడు. అవసరం లేదు, ఆమె తప్పిపోలేదు వెళ్లిపోయింది. సుమిత్ర వెళ్లిపోయిందని ఎందుకు బాధపడుతున్నావు? సుమిత్ర వెళ్లకుండా ఉంటే మాట్లాడేవాడివా? తిట్టకుండా ఉండేవాడివా? తిడితే వెళ్లిపోవాలా? నీ మీద గౌరవం లేని నీ భార్య గురించి నువ్వు ఎందుకురా ఆలోచిస్తావు? అని శివన్నారాయణ సీరియస్ గా మాట్లాడతాడు. వద్దనుకొని వెళ్లిపోయిన భార్య గురించి దశరథ ఎందుకు బాధపడాలి? తన కోసం వెతకాల్సిన అవసరం లేదని శివన్నారాయణ అంటాడు.
ఫీల్ అయిన దశరథ
తాత నీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని కార్తీక్ మెల్లగా మాట్లాడతాడు. సుమిత్రపై దశరథకు ఉన్న ప్రేమను బయటకు తీయడమని శివన్నారాయణ అంటాడు. అసలు సుమిత్ర ఏమైపోయిందో ఏమో అని అనగానే, నాన్న సుమిత్ర జాగ్రత్తగా ఉంటుందనే ధైర్యాన్ని చంపేయకని బాధపడతాడు దశరథ. నా మాట విని కోడలితో మాట్లాడావా? నువ్వు పొమ్మన్నావు తను వెళ్లిపోయిందంటాడు శివన్నారాయణ. తప్పు నాదే అందుకే బాధపడుతున్నా. క్షమాపణ చెప్పాలి. మరోసారి తనను బాధపెట్టనని చెప్పాలని దశరథ ఫీల్ అవుతాడు.
జ్యో అనుమానం
రేపు మీ పెళ్లి రోజంట కదా. సుమిత్ర ఎలాగో లేదు కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టిఫిన్లు మన రెస్టారెంట్ నుంచి తెప్పించు కార్తీక్. ఎవరి కోసమో మనం ఎందుకు పస్తులుండాలి. అందుకే అంటారు ఏదైనా దూరమైతేనే కానీ దాని విలువ తెలియదని. దశరథ ఈ సారి నీ విలువ సుమిత్రకు తెలుస్తుందిలేనని శివన్నారాయణ వెళ్లిపోతాడు. తాత ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు గ్రానీ? తాత, బావ ఎక్కడకు వెళ్లారు? మమ్మీని కలిశారంటావా గ్రానీ అని పారును జ్యోత్స్న అడుగుతుంది.
శ్రీధర్ ఫైర్
కాశీ జాబ్ చేస్తున్నానని నటించడం తెలుసుకున్న శ్రీధర్ ఫైర్ అవుతాడు. ఓ ఫొటో చూసి స్ట్రెస్ అవుతున్నా అల్లుడు అని రోడ్డు మీద కబుర్లు చెబుతున్న కాశీ ఫొటో చూపిస్తాడు శ్రీధర్. ఆఫీస్ టైమ్ లో రోడ్డు పక్కన ఫ్రెండ్ తో బాతాకానీ మాట్లాడుతున్నప్పటి ఫొటో. నువ్వు ఏ కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పావో అక్కడికి వెళ్లి అడిగితే కాశీ పేరుతో ఎంప్లాయ్ లేరన్నారని శ్రీధర్ అంటాడు. మామయ్య గారు అని కాశీ అంటే, ఏంట్రా మామయ్య అని శ్రీధర్ సీరియస్ అవుతాడు. ఇంతలో స్వప్న వచ్చి కాశీని స్నానం చేసి రమ్మని పంపిస్తుంది. స్వప్నకు ఓ విషయం చెప్పాలని శ్రీధర్ అంటే, వద్దంటూ కాశీ రిక్వెస్ట్ చేస్తాడు.
తప్పంతా తాతదే
కన్నీళ్లు మంచివిరా. మనసుకు పట్టిన మలినాన్ని క్లీన్ చేస్తాయి. ఏనాడూ భర్తకు ఎదురు చెప్పని కోడలు వదిలేసి వెళ్లిపోయిందంటే దశరథ అన్న మాటలకు ఎంత నరకం అనుభవించాలి. సొంత వాళ్లు మాటలంటే పట్టించుకుంటామని కార్తీక్ తో శివన్నారాయణ అంటాడు. ఈ అనార్థాలన్నింటికీ కారణం నువ్వే. మా నాన్న అమ్మను మోసం చేశాడు. నువ్వేం న్యాయం చేశావ్? పుట్టినిల్లు దూరమైందని అమ్మ ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిచావా? ఎంతసేపు నీ కుటుంబం. వేరే ప్రపంచం లేదని అనుకుంటున్నావని కార్తీక్ చెప్తాడు.
కానీ మామయ్యకు చెల్లి అంటే ప్రాణం. మళ్లీ కుటుంబాలను కలిపేందుకు ఓ ఛాన్స్ దొరికింది. కానీ అత్త లేనిపోని అనుమానాలతో దాన్ని చెడగొట్టింది. జ్యోత్స్న మంటతో అత్త ఇంటి నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. మామయ్య తప్పు చేసింది నీవల్లే. ఇప్పుడు అత్తను, మామయ్యను కలిపేందుకు ప్లాన్ చేయాలని తాతతో కార్తీక్ అంటాడు. రేపు పెళ్లిరోజు కదా కలిపేందుకు ఇదే మంచి రోజని శివన్నారాయణ బదులిస్తాడు.
చెల్లి కోసం ప్లాన్
బొమ్మకు పేరు పెట్టమంటే చెల్లి అని పిలవమంటుంది అమ్మ అని నాన్నకు చెప్తుంది శౌర్య. నాకు చెల్లిని ఎప్పుడు తీసుకొస్తారు? నాకు చెల్లి అంటే ఇష్టం. నాకు చెల్లె కావాలి. నాన్న నాకు చెల్లి ఎప్పుడొస్తుంది? అని అడుగుతుంది శౌర్య. నెక్ట్స్ ఇయర్ వస్తుందని కార్తీక్ చెప్తాడు. బొమ్మను చెల్లి అని పిలుస్తూ అమ్మానాన్న అని దీప, కార్తీక్ ను పరిచయం చేస్తుంది శౌర్య.
ఏడాదిలో చెల్లిని ఇస్తాననే మాటమీద నిలబడతానని కార్తీక్ అంటే పో బావ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావని దీప అంటుంది. శౌర్యకు చిట్టి చెల్లినిచ్చే బాధ్యత మనదేనని కార్తీక్ అంటాడు. తాతయ్యకు నిజం తెలిశాక ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉందోనని దీప అడుగుతుంది. అత్తను, మామను కలపడం కోసం తాత ఓ ప్లాన్ చేశారు. దాన్ని ఎలా వర్కౌట్ చేయాలో తెలియడం లేదు. రేపు అత్త, మామల పెళ్లిరోజని కార్తీక్ అంటాడు. రేపు వాళ్లను ఎలాగైనా కలపాలని దీప అంటుంది.
దీప ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలంటే ముందు అత్తయ్య, మామయ్యను కలపాలి. తాత ఏం ప్లాన్ చెప్తాడో ఏంటో అని కార్తీక్ అనుకుంటాడు. దీంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.














