కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:దశరథ సొంత కూతుర్ని తీసుకొస్తానని పారు-శౌర్యతో నిజం చెప్పించిన శివన్నారాయణ-తాత ఫైర్
కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 24 ఎపిసోడ్ లో కాంచన ఇంటికి వెళ్లిన శివన్నారాయణకు సుమిత్ర కనిపిస్తుంది. కానీ శౌర్యకు చాక్లెట్ ఇస్తూ అసలు విషయాన్ని బయటకు లాగుతాడు. కార్తీక్, కాంచన, దీపపై ఫైర్ అవుతాడు శివన్నారాయణ. మరోవైపు దశరథ సొంత కూతురిని తీసుకొస్తానని పారు అంటుంది.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్ లో నిజంగా సుమిత్ర దొరుకుతుందంటావా? అని కార్తీక్ ను అడుగుతాడు శివన్నారాయణ. దొరుకుతుందని దీప అంటుంది. ఇన్ని రోజులు నా మనవడు ఇలాగే చెప్పాడు, ఇప్పుడు నువ్వు చెప్పు. మనసు ముక్కలైన మనిషికి బంధాలు గుర్తుకురావు. వాళ్లు మనకు దగ్గర్లో ఉన్నా కనిపించరు. కనిపించాలని అనుకోరని శివన్నారాయణ అంటాడు.

సుమిత్ర కనిపించిందని
అత్తను తీసుకొస్తానని మాటిచ్చా కదా అని కంగారు పడతాడు కార్తీక్. అవున్రా ఇంట్లో ఉండే ఇబ్బంది ఉండేది కాదని శివన్నారాయణ అంటాడు. సుమిత్ర నాకు కనిపించింది. ఇక్కడే కనిపించింది. మీ అందరి ప్రేమలో నాకు సుమిత్ర కనిపించిందని శివన్నారాయణ అంటాడు. వచ్చిన పని అయిపోయింది. చూడాలని వచ్చా, చూశా. మీ అమ్మను చూడాలనుకున్నా. మీ అమ్మకు నేనంటే ఎంతో ప్రేమ. అందుకే ఓ సారి చూడాలనిపించింది. నా దశరథ నాకు కనిపించడం లేదని శివన్నారాయణ బాధపడతాడు.
సొంత తాత కాదు
గ్రానీ తాత ఎక్కడ? కోడలు పోయిందనే బాధతో ఈయన కూడా వెళ్లిపోయి ఉంటాడని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. ఏంటే నీకు పూటకోసారి రెండు వాతలు పడితే కానీ తిన్నగా మాటలు రావనుకుంటా. మీ తాత పోయారన్నావు కదా అందుకు తిడుతున్నానని పారు అంటుంది. సొంత తాత కాదు కదా అని జ్యో అంటుంది. దాసు చెప్పకపోయి ఉంటే నిజం తెలిసేది కాదు, అప్పుడు సొంత తాతే కదా. అప్పుడు సొంత అమ్మే కదా. పెంచిన వాళ్ల మీద ప్రేమ అయినా ఉండాలి కదా అని అంటుంది పారు.
బిడ్డలను మారుస్తా
చిన్నప్పుడు నిన్ను మార్చి తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఆ తప్పు ఇప్పుడు సరిచేసుకుంటే అని పారు అనేసరికి జ్యోత్స్న కంగారు పడుతుంది. అప్పుడు బిడ్డలను మార్చినట్లే ఇప్పుడు మారుస్తాను. నిన్ను నీ తండ్రి దగ్గర పెట్టి, దశరథ కూతుర్ని తీసుకొస్తానని పారు అనేసరికి జ్యో షాక్ అవుతుంది.
నువ్వు మనిషివే. తాత, తండ్రి, అమ్మ చెట్టుకొకరు పుట్టకొకరు పోతుంటే బాధ అనిపించడం లేదా? ఒక్కసారి కూడా నువ్వు ఏడవడం లేదు? సొంత తమ్ముడికి కష్టం వస్తే పట్టించుకోలేదని పారు ప్రశ్నిస్తుంది. నీ ప్రేమ చూడాలని ఉందని పారు అడిగితే, నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపో అని అంటుంది జ్యో.
శౌర్య నిజం
సింహాలను ఓడించే యోధులు కూడా కన్నపిల్లల ముందు చిన్నపిల్లలైపోతారు. ఆ ఎమోషన్ అలాంటిది. నా కొడుకు గురించి బాధపడుతున్నా. సుమిత్ర ఎక్కడుందో నీకు తెలుసని నా అనుమానం అని శివన్నారాయణ అంటాడు. నాకు తెలిస్తే అత్తను ఇంటికి తీసుకొచ్చేవాణ్ని కదా అని కార్తీక్ కంగారు పడతాడు. అప్పుడే శౌర్య వస్తుంది. నిన్న జ్యో వచ్చింది కదా దాగుడు మూతలు ఆడటానికి. అమ్మమ్మతో అని చెప్తూ సగంలో ఆగిపోతుంది శౌర్య.
చెప్పకూడదు అని శౌర్య అంటుంది. అప్పుడు చాక్లెట్లు ఇస్తూ ఇది ఎవరికి అంటూ అడుగుతాడు శివన్నారాయణ. అప్పుడు అమ్మమ్మ అని చెప్పేస్తుంది శౌర్య. ఈ చాక్లెట్ తీసుకుని అమ్మమ్మకు ఇవ్వు అని చెప్తాడు శివన్నారాయణ. ఇప్పుడు చెప్పరా సుమిత్ర ఎక్కడుంది? అని కార్తీక్ మీదకు చేయి ఎత్తుతాడు శివన్నారాయణ. సుమిత్ర ఏమైపోయిందో తెలియక నా కొడుకు మతి స్తిమితం కోల్పోయిన వ్యక్తిలా బాధపడుతున్నాడు. అయినా ఎందుకు చెప్పలేదు? ఇన్ని మోసాలు ఎందుకు? అని అడుగుతాడు శివన్నారాయణ.
ఎందుకు మోసం చేస్తారు?
అదంతా చూసిన దీప కూడా బయటకు వస్తుంది. నమ్మిన ప్రతిసారి ఎందుకు మోసం చేస్తారు? కర్టెన్ వెనుక మంచం మీద ఉన్న మనిషిని చూడలేదనుకున్నారా? నేను, నా కొడుకు చచ్చేంత వరకు నా కోడలిని మీ ఇంట్లోనే ఉంచాలనుకున్నారా? ఒకవేళ నా ప్రాణం పోతే మీరే కారణం అవుతారు. మీతో పాటు నా కూతురు కూడా నన్ను ఎందుకు మోసం చేసిందో తెలియాలి. ఈ రోజు తేల్చుకోవడమో, తెంచుకోవడమో ఏదో ఒకటి జరుగుతుందని శివన్నారాయణ ఫైర్ అవుతాడు.
కాంచన చెప్తున్నా శివన్నారాయణ వినడు. మీ అందరినీ వెలి వేశా. కానీ మీ మంచితనం చూసి దగ్గరకు చేర్చుకున్నా. కానీ మోసం చేశారు. ఇప్పుడే నా కోడలిని ఇంటికి తీసుకెళ్తా. మళ్లీ మీ ముఖాన్ని చూడను. నా ఊపిరిని నీ చేతులతో తీసేంత వరకూ నువ్వు నిద్రపోవు అని కాంచనపై కోప్పడతాడు శివన్నారాయణ. ఎవరిని సాధించాలని వదినను మీ ఇంట్లో దాచి పెట్టావు? అందరు కలిసే నాటకం ఆడారు. కానీ శౌర్య మాటలతో దొరికేశారని శివన్నారాయణ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












