కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్‌పై డౌట్- దీప ఇంటికెళ్లిన జ్యోత్స్న- పెద్ద ఝలక్ ఇచ్చిన శౌర్య- దీప, కాంచన టెన్షన్

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 21 ఎపిసోడ్‌లో సుమిత్ర క్షేమంగా ఉందని చెప్పి బావ హింట్ ఇచ్చాడని పారుతూ జ్యోత్స్న అంటుంది. అనుమానంతో దీప ఇంటికెళ్లిన జ్యోత్స్న శౌర్యను అమ్మమ్మ ఇంటికొచ్చిందా అని అడుగుతుంది. దానికి వచ్చిందని శౌర్య చెబుతుంది. దాంతో దీప, కాంచన, అనసూయ టెన్షన్ పడుతుంటారు.

Published on: Oct 21, 2025, 09:25:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్రకు దీప టిఫిన్ తినిపించి టాబ్లెట్ ఇచ్చి వేయిస్తుంది. తర్వాత సుమిత్ర పడుకుంటుంది. దీప మురిసిపోతుంది. మరోవైపు కుటుంబానికి నువ్వు సగం దూరమైపోయావ్ ఇప్పుడు ఏదోటి మాట్లాడి పూర్తిగా దూరం కావొద్దని జ్యోత్స్నను హెచ్చరిస్తుంది పారిజాతం.

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 21వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 21వ తేది ఎపిసోడ్

అనుమానం వచ్చింది

మీ అందరికీ బుర్రలు సరిగా పనిచేస్తున్నాయా? ఇంట్లో ఇదంతా జరగడానికి కారణమైన దీపని ఏం చేయాలో అది చేయాలని జ్యోత్స్న మండిపడుతుంది. నేను మమ్మీ ఇంట్లోంచి వెళ్లడం నేను చూశాను. కానీ, నాకు అది ఉపయోగమా. ఇప్పటికే డాడ్‌కు అనుమానం వచ్చిందని జ్యో అంటే.. ఎలా అని పారు అంటుంది. దాసును చంపబోయానని ఎలా చెప్పను అని జ్యో అనుకుంటుంది.

నేను ఈ ఇంటి వారసురాలిని కాదేమోనని అని జ్యోత్స్న అంటే.. దశరథ్‌కు ఆ డౌట్ వచ్చే ఛాన్స్ లేదని పారిజాతం అంటుంది. సుమిత్ర రాకపోతే నిన్ను, నన్ను గెంటుతారు అని పారిజాతం అంటుంది. మమ్మీ దొరికింది. కనిపించింది. బావ చెప్పాడు. మమ్మీ కనిపించకపోతే బావ, దీప అంత కూల్‌గా ఉండరు. బావ నిజం చెప్పకుండా క్లూ ఇచ్చాడు. దీప ఇంట్లో ఉండి తీరుబడిగా టిఫిన్స్ పంపించదు. రోడ్డు మీద పడి వెతుకుతుంది అని జ్యోత్స్న అంటుంది.

నేను వెళ్లి మా మమ్మీని తీసుకొస్తాను. ఎక్కడుందో నాకు తెలుసు అని జ్యో బయలుదేరుతుంది. దీనికి సుమిత్ర ఎక్కడుందో తెలుసా అని కన్‌ఫ్యూజ్ అవుతుంది. అక్కడ మా అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో అని కాంచన అంటుంది. ఇంతలో జ్యోత్స్న రావడం కాంచన, దీప చూస్తారు. జ్యోత్స్నకు అనుమానం వచ్చినట్లుంది. అందుకే వచ్చేసిందని కాంచన అంటుంది.

ఇంట్లో ఎవరెవరు ఉన్నారు

శౌర్యను ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని జ్యో అడుగుతుంది. దీప వచ్చి అడ్డుపడుతుంది. నేను మా మమ్మీని వెతకడం కోసం వచ్చాను అని జ్యోత్స్న అంటుంది. సాయంగా రమ్మంటారా అని దీప అంటుంది. నీలో నాకు ఈ నిజాయితీ చాలా నచ్చుతుంది దీప. నేను ఒకటి అడుగుతాను చెప్పు. మాములుగా అడిగితే అంతా చెబుతారు. ఎంతో తెలివైన శౌర్య ఇక్కడే ఉందిగా అడుగుతాను అని జ్యోత్స్న అంటుంది.

మీ అమ్మమ్మ ఇంట్లో ఉందా అని జ్యోత్స్న అంటుంది. ఉంది అని శౌర్య చెబుతుంది. వెరీ గుడ్ పిల్లలు ఎప్పుడు అబద్ధం చెప్పరు. ఇప్పుడు అర్థమైందా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో అని జ్యోత్స్న అంటుంది. తర్వాత అమ్మమ్మ ఎప్పుడు వచ్చిందని జ్యో అడిగితే.. నిన్నే వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉందని శౌర్య అంటుంది. నన్ను అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్తావా అని జ్యో అంటే.. పదా అని చేయి పట్టుకుని తీసుకెళ్తుంది శౌర్య.

మొదటిసారి దీప నాకు భలే దొరికింది అని జ్యోత్స్న అనుకుంటుంది. అమ్మమ్మకి హాయ్ చెప్పు అని దీప తల్లి ఫొటోను చూపిస్తుంది శౌర్య. నేను చెప్పింది ఈ అమ్మమ్మ గురించే అని శౌర్య జ్యోకు పెద్ద ఝలక్ ఇస్తుంది. దాంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. కట్ చేస్తే.. సుమిత్ర గురించి ఎవరికి చెప్పొద్దు అని దీప చెబుతుంది. అదే మంచిదైందని దీప అనుకుంటుంది.

సుమిత్ర గదిలోకి వెళ్లిన జ్యో

ఈవిడ ఎవరు అని జ్యో అడిగితే.. మా అమ్మ అని దీప అంటుంది. అసలు మా మీద నీ అనుమానం ఏంటే అని జ్యోత్స్నపై అరుస్తుంది. మా అమ్మ ఇక్కడ ఉంటే వేరేలా ఉండేది. లేదుగా అని జ్యోత్స్న వెళ్లిపోతుంటే సుమిత్ర దగ్గుతుంది. ఆ దగ్గు ఏంటీ. నాకు వినిపించిన దగ్గు ఎవరు దగ్గారో చూసి వస్తాను అని లోపలికి వెళ్తుంది జ్యోత్స్న. కానీ, అక్కడ ఎవరుండరు.

గది అంతా చూసిన జ్యోత్స్న లోపల ఎవరు లేరు అని చెబుతుంది. మా మమ్మీ గురించి తెలిస్తే నాకు చెప్పండి అని జ్యోత్స్న వెళ్లిపోతుంది. దీప వాళ్లు గదిలోకి వెళ్లి చూస్తే సుమిత్ర కిందపడిపోయి ఉంటుంది. దీప లేపి ట్యాబ్లెట్ వేస్తుంది. వదినను ఇలా చూస్తే భయమేస్తుంది. వదిన ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. తన కళ్లలో బాధ లేదు. కన్నీళ్లు లేవు. ఏదోటి మాట్లాడుతుంది అని కాంచన భయపడుతుంది.

బావ వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుదామని దీప అంటుంది. జ్యోత్స్న అనుమానంతో వచ్చింది. మళ్లీ రాదని గ్యారేంటీ ఏంటీ. ఎంతకాలం అని దాస్తామని అనసూయ అంటుంది. బావ వచ్చాకే ఆలోచిద్దామని దీప అంటుంది. మరోవైపు సుమిత్ర గురించి ఆలోచించిన దశరథ్ తానే వెతుకుతానని, భార్యతోనే అడుగుపెడతానని అంటాడు. నువ్వు ఎంత వెతికినా అత్త దొరకదు అని కార్తీక్ అంటాడు.

కార్తీక్‌ను అడిగిన దశరథ్

ఎందుకు దొరకదు. ఎక్కడున్న క్షేమంగా ఉంటుందన్నావ్ అని జ్యోత్స్న అంటుంది. మాటలేగా ఎన్నైనా చెబుతాడు. దొరకదు అంటే.. సుమిత్ర మీద ఆశలు వదిలేసుకోవాలా అని పారిజాతం అంటుంది. పారు మాట్లాడిచ్చే అవకాశం ఇస్తే చెబుతారు అని కార్తీక్ అంటాడు. రేయ్ కార్తీక్ నేను అడుగుతున్నా. ఆ మాట ఎందుకు అన్నావ్ అని దశరథ్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు లైఫ్‌స్టైల్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More