కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ ఇంట్లో సుమిత్ర- ఎవరికి చెప్పొద్దన్న దీప- శివ నారాయణకు బలమిచ్చిన కార్తీక్ మాటలు

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 18 ఎపిసోడ్‌లో తన ఇంట్లో సుమిత్రను చూసి కార్తీక్ షాక్ అవుతాడు. దీప జరిగింది అంతా చెబుతుంది. కానీ, అమ్మ గురించి ఎవరికి చెప్పొద్దు అని కార్తీక్‌తో అంటుంది. జ్యోత్స్న కాల్ చేస్తే నా మాటలు తాత వింటున్నాడని తెలుసు. అత్త క్షేమంగానే ఉందని కార్తీక్ అంటాడు. అంతా సంతోషిస్తారు.

Published on: Oct 18, 2025 8:47 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. అత్త నీకు ఎక్కడ కనిపించింది. ఇక్కడికి ఎలా వచ్చింది అని దీపను అడుగుతాడు కార్తీక్. బయటకు కార్తీక్‌ను తీసుకెళ్లి జరిగింది అంతా చెబుతుంది. తాత, మామ వాళ్లు తెగ బాధపడుతున్నారు. వెంటనే కాల్ చేసి అత్త సేఫ్‌గా ఉందని చెప్పాలి అని కార్తీక్ అంటే వద్దని దీప అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 18వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 18వ తేది ఎపిసోడ్

ప్రాణాలు తీసుకుంటుంది

ఆ ఇంటికి తీసుకెళ్లిన, వాళ్లు వచ్చిన తన ప్రాణాలు తీసుకుంటుంది అని సుమిత్ర చెప్పిందని చెబుతుంది. అయినా చెబుతాను అని కార్తీక్ అంటే.. అసలు ఇక్కడికి వచ్చినట్లు కూడా అమ్మకు తెలియదు. స్పృహ వచ్చాకా ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. నేను చచ్చేదాక అమ్మ క్షమించదు. అమ్మ, నాన్న మధ్య ఏం జరిగిందో తెలియదు అని దీప అంటుంది.

అత్త స్పృహలోకి వచ్చేవరకు ఎవరికి చెప్పకూడదు. కానీ, నా భయంతో తాత గురించే. మళ్లీ ఆయన ఒత్తిడికి గురవుతే ప్రమాదం అన్నారు అని కార్తీక్ అంటాడు. మరోవైపు రాత్రి శివ నారాయణ దగ్గుతాడు. దశరథ్ కంగారుపడతాడు. సుమిత్ర గురించి శివ నారాయణ అడిగితే తెలియదు అని దశరథ్ అంటాడు. నా ప్రేమ నీ కోడలికి అర్థం కాలేదు. వెళ్లిపోయిందని. అంత తేలిగ్గా బంధాన్ని తెంపేసుకుని పోవడం ఏంటని దశరథ్ ఫీల్ అవుతాడు.

జ్యోత్స్న పోలీస్ కంప్లైంట్ గురించి మాట్లాడితే దశరథ్ వద్దంటాడు. కార్తీక్, దీప వెతుకుతున్నారుగా. ఎదురుచూడటం తప్పా ఏం చేయలేం అని శివ నారాయణ అంటాడు. మరోవైపు కాంచనతో శ్రీధర్ వస్తాడు. శ్రీధర్‌ను బయటే ఆపి పంపించాలి అని కార్తీక్, దీప బయటకొస్తారు. సుమిత్రను తీసుకొచ్చి మా నాన్న నిలబెట్టుకుంటావా అని కాంచన అంటే మరోవైపు బావ తన మాట నిలబెట్టుకోలేడు అని జ్యోత్స్న అంటుంది.

సుమిత్రను చూసిన కాంచన

చిన్నమ్మ, చెల్లి కంగారుపడుతుంటారు. నువ్వు ఇంటికెళ్లి అని శ్రీధర్‌ అంటాడు కార్తీక్. ఈ రాత్రికి సుమిత్ర రాకుంటే నాకు తెలిసినవాళ్లతో వెతికిస్తాను అని శ్రీధర్ అంటే కార్తీక్ వద్దంటాడు. తనే వచ్చేస్తుంది అని కార్తీక్ అంటాడు. శ్రీధర్ వెళ్లిపోతాడు. తండ్రి, అన్న గురించి బాధపడుతుంది కాంచన. సుమిత్ర, దశరథ్ మధ్య జరిగింది తనకు తెలుసు అని, సుమిత్రమ్మతో మాట్లాడాను, చూశాను అని సుమిత్రను కాంచనకు చూపిస్తుంది దీప.

వదినకేమైంది అని కాంచన అడుగుతుంది. దాంతో దీప చెబుతుంది. మరోవైపు సుమిత్రతో మాట్లాడు దశరథ అని చెబుతూనే ఉన్నాను. వెన్నాడా నా మాట. జ్యోత్స్న మాటలతో గొడవలు పెంచిందే తప్పా తగ్గించలేదు. ఈ అనర్థాలన్నింటికి కారణం జ్యోత్స్నే. మీ అమ్మ వెళ్లిపోతుంటే ఆపకుండా ఆపావా అని జ్యోత్స్నను నిలదీస్తాడు. ఇంతలో కార్తీక్‌కు జ్యోత్స్న కాల్ చేసి మా అమ్మ కనిపించిందా అని అడుగుతుంది.

తాతకు ఎలా ఉందని కార్తీక్ అంటాడు. అమ్మ కనిపించిదా అని జ్యో అడిగితే.. నా మాటలు తాత వింటున్నాడని తెలుసు. అందరికి చెప్పేది ఒక్కటే అత్త క్షేమంగా ఉంది అని కార్తీక్ అనేసరికి అంతా సంతోషిస్తారు. మా అమ్మ కనిపించిందా అని జ్యో అడిగితే.. అత్త ఎక్కడున్న క్షేమంగా ఉంటుందని చెబుతున్నా. ఇంటికి తిరిగి వస్తుంది అని కార్తీక్ కాల్ కట్ చేస్తాడు.

కార్తీక్ మాటలతో

వాడు అంత కచ్చితంగా చెబుతున్నాడు అంటే సుమిత్రకు ఏం కాదు. పారిజాతం వెళ్లి ట్యాబ్లెట్స్ తీసుకురా. నేను ఇలా ఉంటే కోడలు బాధపడుతుంది. తను వచ్చేలోపు ఆరోగ్యంగా ఉండాలి అని శివ నారాయణ ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు. బావ ఇంత నమ్మకంగా చెబుతున్నాడు అంటే నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా అని జ్యోత్స్న డౌట్ పడుతుంది.

మరోవైపు అత్త గురించి నిజం దాచడం కష్టంగా ఉందని కార్తీక్ అంటే.. ఎలాగైనా అమ్మను కాపాడుకోవాలి. రేపు నువ్వే వెళ్లు నేను రాను అని దీప అంటుంది. సరే అని కార్తీక్ అంటాడు. మరోవైపు సుమిత్ర వెళ్లిపోవడం గురించి ఇంట్లో చెబుతాడు శ్రీధర్. దీనంతటికి కారణం దీపనే అంటాడు శ్రీధర్. దశరథ్, సుమిత్ర గొడవ, శివ నారాయణ పడిపోవడం అంతా చెబుతాడు శ్రీధర్.

మనం కూడా వెతుకుదాం అని కాశీ, దాసు వెళ్లిపోతారు. మనం కూడా వెతుకుదామని స్వప్న అంటే.. ఎక్కడ వెతుకుతారు. సుమిత్ర ఇక్కడికే వస్తే. నేను వెళ్లి వెతుకుతా. మీరు ఎవరికి కాల్ చేసి విసిగించకండి అని శ్రీధర్ వెళ్లిపోతాడు. ఆ జ్యోత్స్నే ఏదోటి చేసి ఉంటుంది అని స్వప్న డౌట్ పడుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.