కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: రౌడీల నుంచి సుమిత్రను కాపాడిన దీప- నా అమ్మవి అని దీప నిజం- శవాన్ని చూస్తావన్న సుమిత్ర
కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 17 ఎపిసోడ్ లో సుమిత్ర ఆచూకీ దొరుకుతుంది. సుమిత్రను దీప కనిపెడుతుంది. రౌడీల నుంచి తల్లిని కాపాడుకుంటుంది. కానీ సుమిత్ర తలకు గాయమవుతుంది. మరోవైపు నాన్న, అన్నయ్యకు అన్నం తినిపిస్తూ కాంచన ఎమోషనల్ అవుతుంది.
కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 17వ తేదీ ఎపిసోడ్ లో బీపీ ఎక్కువై కింద పడిపోయిన శివన్నారాయణ కళ్లు తెరిచి సుమిత్ర ఏది? అని అడుగుతాడు. మమ్మీ కనిపించలేదని జ్యోత్స్న చెప్తుంది. సుమిత్ర వదిన ఉంది నాన్న. ఎవరికో ఎక్కడో కనిపించిందంటా. కార్తీక్ వెళ్లి అత్తను తీసుకురా అని కాంచన అంటుంది. త్వరగా తీసుకు రారా అని కార్తీక్ తో శివన్నారాయణ అంటాడు. నా కొడుకు, కోడలు కలిసి ఈ ఇంటికి కచ్చితంగా మామూలు పరిస్థితులు తీసుకొస్తారని నాన్నతో కాంచన చెప్తుంది.

రౌడీలను కొట్టిన దీప
ఒంటరిగా కూర్చున్న సుమిత్ర తన భర్త మాటలను తలుచుకుని బాధ పడుతుంది. అప్పుడే ఇద్దరు రౌడీలు వచ్చి ఒంటి మీద ఉన్న నగలను ఇచ్చేయ్ లేదంటే చంపేస్తామని కత్తి చూపిస్తారు. నగలు తీసి ఇస్తుంది సుమిత్ర. మెడలో తాళి కూడా ఇవ్వమంటారు. ఇది మంగళసూత్రం ఇవ్వనని సుమిత్ర అంటే.. లాక్కోవడానికి రౌడీ ట్రై చేస్తాడు. అప్పుడే వచ్చిన దీప వెనకాల నుంచి తలపై కర్రతో కొడుతుంది. ఆడవాళ్లు బంగారం వేసుకుని బయట తిరగాలంటేనే బయపడేలా చేశారు కదరా అని రౌడీలను కొడుతుంది దీప.
తినిపించిన కాంచన
తిను నాన్న అని కాంచన అడుగుతుంది. సుమిత్ర ఇంకా రాలేదా? అని మళ్లీ అడుగుతాడు శివన్నారాయణ. నిజం చెప్తే ఏం చనిపోనమ్మా. సుమిత్ర కనిపించలేదు కదూ అని అంటాడు. వదినను కార్తీక్, దీప తీసుకొస్తారు. ముందు అన్నం తిను నాన్న. చిన్నప్పుడు నాకు, అన్నయ్యకు తినిపించావు కదా. ఇప్పుడు నువ్వు చంటి పిల్లాడివి ప్లీజ్ నాన్న తిను అని తినిపిస్తుంది కాంచన. నీ మేనల్లుడి మీద నమ్మకం ఉంటే తిను అని దశరథకు కూడా అన్నం తినిపిస్తుంది. కాంచనకు తినిపిస్తాడు దశరథ.
నువ్వే కారణం
ఎమోషనల్ అయిన పారిజాతం బయటకు వెళ్లి ఏడుస్తుంది. సింపతీ కోసం ఏడుస్తున్నావా? అని వెళ్లి జ్యోత్స్న అడుగుతుంది. నేను మనిషినే నీలా మరబొమ్మను కాదు. అక్కడ లేవలేని స్థితిలో ఉన్నది నా భర్త. నేను స్వార్థపరురాలినే కానీ ఒక ఆడదానిలా ఆలోచిస్తే భర్త లేకపోతే రంగురంగుల దుస్తులు, ఆభరణాలు ఏవీ ఉండవు. తాళి కూడా ఉండదు. ఆడదానికి అయిదో తనాన్ని ఇచ్చేది భర్తేనే.
నా కొడుకు కూతురిని ఈ ఇంటి వారసురాలు చేయాలనుకున్నా. అది నా భర్త మీద పగతో కానీ చంపాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ రోజు నా భర్త ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా? దీనికి కారణం నువ్వు. సుమిత్రను నువ్వు ఆపి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. నీలో మానవత్వం పూర్తిగా చచ్చిపోయింది. నేను నీలా ఉండలేకపోతున్నా. సుమిత్ర త్వరగా రావాలని నేనూ కోరుకుంటున్నానని పారు అంటుంది. ఎవరు మారిన నేను మారను పారు అని అనుకుంటుంది జ్యోత్స్న.
నా శవాన్ని చూస్తావ్
నేను రాను అని దీపతో మొండిగా చెప్తూనే ఉంటుంది. మీకు ఓ కుటుంబం ఉంది. మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. మీ ఆలోచనల్లో మార్పు వచ్చింది. అసలు మీరేనా అనిపిస్తుందని దీప అంటుంది. నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పించుకోవాల్సిన అవసరం లేదని సుమిత్ర అంటుంది. మీరు ఇంటికి రావాలని దీప అంటే, అది చెప్పడానికి నువ్వెవరూ అని అడుగుతుంది సుమిత్ర.
ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, నేను కనిపించానని ఇంట్లో చెప్పినా నేను చచ్చినంతా ఒట్టే. నన్ను మళ్లీ ఆ ఇంటికి తీసుకెళ్తే నా శవాన్ని చూస్తావని సుమిత్ర అంటుంది. ఇలా మాట్లాడకండి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయని దీప చెప్తుంది. నేను అన్నీ చూసి, అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని అంటుంది సుమిత్ర. అది మంచి నిర్ణయం కాదని దీప అంటే, అది చెప్పడానికి నువ్వెవరూ అని సుమిత్ర మళ్లీ అడుగుతుంది.
తలకు గాయం
కార్తీక్, నా భర్త, కూతురికి నాతో బంధం ఉంది కాబట్టి వెతుకుతున్నారంటే అర్థముంది. కానీ ఏ బంధం ఉందని నువ్వు నా కోసం బాధపడాలి? నా కోసం ఎందుకు కన్నీళ్లు పెట్టుకోవాలి? అసలు నీకు, నాకు ఏంటీ బంధం? నేను నీకు ఏమౌతానని అని సుమిత్ర అడుగుతుంది. నువ్వు నా అమ్మవి అని దీప చెప్తుంది. అప్పుడే ఆ రౌడీ వచ్చి కర్రతో కొట్టబోతుంటే దీపను నెట్టేసిన సుమిత్ర తలకు దెబ్బ తగులుతుంది. సుమిత్ర స్పృహ తప్పి పడిపోతుంది.
కార్తీక్ కు ఫోన్ చేసి మన ఇంటికి రమ్మని చెప్తుంది దీప. కంగారుగా వెళ్లిన కార్తీక్ ఈ ఇంటికి ఎందుకు వచ్చావని దీపను అడుగుతాడు. తాత కళ్లు తిరిగి పడిపోయాడని తెలుసా? కోడలు ఏమైపోయిందే తెలియక బీపీ పెంచుకున్నాడు. జ్యోత్స్న, పారు అక్కడే ఉన్నా ఏ ఉపయోగం ఉండదు. అందుకే నిన్ను అక్కడే ఉండమన్నానని కార్తీక్ కోప్పడతాడు.
శౌర్య వచ్చి అమ్మమ్మ అని అనగానే గదిలో పడుకుని ఉన్న అత్తను చూస్తాడు కార్తీక్. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


