కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దశరథ కాళ్లు పట్టుకున్న జ్యోత్స్న- కార్తీక్‌పై శివ నారాయణ డౌట్- వేరే ఇల్లు చూసుకుంటున్న కాశీ

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 22 ఎపిసోడ్‌లో జ్యోత్స్నను లోపలే ఉండమని, సుమిత్ర వెళ్లిపోడానికి కారణం తనే అని దశరథ్ అంటాడు. దాంతో దశరథ్ కాళ్లు పట్టుకున్న జ్యోత్స్న మమ్మీ వెళ్లిపోడానికి కారణం మీరే అని నిందిస్తుంది. జ్యోత్స్నను శివ నారాయణ తిడతాడు. బావపైన అనుమానం రావట్లేదా అని జ్యోత్స్న అంటుంది.

Published on: Oct 22, 2025, 08:21:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర క్షేమంగా ఉందని ఎలా చెప్పావ్ అని కార్తీక్‌ను అడుగుతాడు దశరథ్. దాంతో దశరథ్, శివ నారాయణను కూర్చొబెట్టి సుమిత్ర మానస్థిక స్థితి గురించి వివరిస్తాడు. తప్పు చేయడం, పశ్చాత్తాప పడటం, ఇంతలోనే నువ్వు మాట అనడంతో వెళ్లిపోయింది. దాని నుంచి తేరుకోడానికి సమయం తీసుకుంటుంది అని కార్తీక్ అంటాడు.

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 22వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 22వ తేది ఎపిసోడ్

కార్తీక్ చెప్పింది నిజమే అనిపిస్తుంది

సుమిత్ర ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అని శివ నారాయణ అడుగుతాడు. దానికి టైమ్ పడుతుంది. తను ఎక్కడున్న క్షేమంగా ఉంటుంది. గాయపడిన హృదయం నయం కావాలిగా. వెళ్లిన దొరకదు. దొరికిన రాదు. అత్త ఏ క్షణమైన ఇంటికి రావచ్చు. ఇంట్లోనే ఉండు మావయ్య అని కార్తీక్ వెళ్లిపోతాడు. కార్తీక్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. కానీ, ఏదో జరుగుతుందని భయమేస్తుందని దశరథ్ అంటాడు.

దాంతో ఎమోషనల్ అయిన పారు పక్కకు వెళ్లిపోతుంది. జ్యో వచ్చి అడుగుతుంది. దశరథ్‌ను చూస్తుంటే దాసు గుర్తొస్తున్నాడే. దాసు కన్నకొడుకు అయితే దశరథ్ పెంచిన కొడుకు. ఈ పారిజాతాన్ని దేవుడు కూడా మార్చలేడు. కానీ, నాలో కూడా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే ఈ బాధ. నువ్వేదో వెళ్లావ్ అని పారిజాతం అంటుంది.

దీప ఇంట్లో మమ్మీ ఉందేమో అని వెళ్లా. కానీ కనిపించలేదు. ఎక్కడో లింక్ మిస్ అవుతున్నాం. బావ కొత్త గేమ్ స్టార్ట్ చేశాడు. అందులోకి మనల్ని లాగాడు. నేను అనుకున్నది నిజమైతే మాత్రం నాకు ఓ అవకాశం దొరికినట్లే అని జ్యోత్స్న అంటుంది. ఏంటదని పారు అడిగేతే టైమ్ వచ్చినప్పుడు చెబుతాను అని జ్యో అంటుంది.

శౌర్య ప్రశ్నలు

మరోవైపు అమ్మమ్మ ఇక్కడ ఉందని జ్యోకి ఎందుకు చెప్పలేదు, అమ్మమ్మ వాళ్లింటికి ఎందుకు వెళ్లకూడదు, ఇక్కడే ఎందుకు ఉండాలి అని శౌర్య అంటుంది. నువ్వు దాగుడుమూతలు ఆగావుగా. దొరికితే అవుట్ అయినట్లుగా. అందుకే అమ్మమ్మ దాక్కుంటుంది అని దీప అంటుంది. అయినా చాలా ప్రశ్నలు వేస్తుంది శౌర్య. దాంతో శౌర్యకు కాంచన నారింజ మిఠాయి ఇస్తుంది.

అయినా నాకు ఒకటి అనిపిస్తుందని శౌర్య అంటే ఏంటదని కాంచన అడుగుతుంది. అమ్మమ్మతోనే చెబుతాను అని వెళ్లిపోతుంది శౌర్య. మరోవైపు శ్రీధర్, కావేరి సుమిత్ర గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో కాశీ వచ్చి నేను వారం రోజుల్లో వేరే ఇల్లు చూసుకుని మారిపోదామని అనుకుంటున్నా అని చెబుతాడు. ఏమైందని శ్రీధర్ అంటాడు. అల్లుడికి, ఇల్లరికం అల్లుడికి తేడా ఉంటుంది కదా అని కాశీ అంటాడు.

మరి ఇల్లు అమ్మాయి పేరు మీద రాసివ్వనా అని శ్రీధర్ అంటాడు. అలా వద్దని కాశీ అంటాడు. జీవితంలో బాగుపడలేని వారు ఎవరో తెలుసా ఈ మొహమాటొస్తులు. జీవితంలో కావాల్సినవి నిర్మొహమాటంగా అడగలేరు. ఇచ్చినవి ధైర్యంగా తీసుకోలేరు. నా ఇల్లు రాసిస్తా అని నేను నీతో అన్నట్లు నాతో మా మావయ్య అంటే మీ ఇష్టం మావయ్య గారు అనేవాన్ని. నీకు లౌక్యంగా బతకడం చాతకావట్లేదు అని శ్రీధర్ అంటాడు.

మంచి ఇల్లు దొరకడం కష్టమే

మీరు ఏదైనా అనుకోండి. మేమైతే ఇల్లు మారుతాం అని కాశీ అంటాడు. సరే మీ ఇష్టం. మంచి ఇల్లు దొరకడమే కష్టం. ఈ కాలనీలోనే ఏదైనా ఇల్లు చూస్తాను అని శ్రీధర్ అంటాడు. త్వరగా చూడమని కాశీ చెప్పి వెళ్లిపోతాడు. అల్లుడి ప్రవర్తనలో ఏదే తేడా ఉందని కావేరి, శ్రీధర్ అనుకుంటారు. మరోవైపు శివనారాయణకు జ్యూస్ ఇచ్చి టాబ్లెట్స్ వేసుకోమని అంటుంది జ్యోత్స్న.

తర్వాత వేసుకుంటాను వెళ్లు అంటాడు శివ నారాయణ. వెళ్లు వెళ్లు అంటున్నారు. నేను ఇక్కడ ఉండకూడదా అని జ్యో అంటుంది. నువ్వు ఎవ్వరిని ఉండనివ్వవుగా. నిన్ను చూస్తుంటే ఇంకా బాధగా ఉంది. నువ్వు లోపలికి వెళ్లవుగా మేమే వెళ్లిపోతాం అని దశరథ్ వెళ్లిపోతుంటాడు. ఆగు డాడీ. నీ కోపం చూస్తుంటే మమ్మీ వెళ్లడానికి కారణం నేనే అన్నట్లుందని జ్యో అంటుంది.

నువ్వే కారణం. సుమిత్ర వెళ్లిపోయేటప్పుడు నువ్వు ఆపలేదు. మాతో చెప్పలేదు అని దశరథ్ అంటాడు. సారీ డాడీ. సారీ సారీ నన్ను క్షమించు. నీ కాళ్లు పట్టుకుని సారీ చెబుతున్నాను. క్షమించు డాడీ అని జ్యోత్స్న కాళ్లు పట్టుకుంటే దశరథ్ పట్టించుకోడు. నాకోటి అర్థం కావట్లేదు. మమ్మీని వెళ్లేటప్పుడు ఆపకపోవడం నా తప్పు అయితే అసలు మమ్మీ వెళ్లడానికి కారణం నువ్వేగా. మరి నీదెంతా తప్పు. నువ్వన్న మాటల వల్లేగా మమ్మీ వెళ్లిపోయిందని జ్యో రివర్స్‌గా అంటుంది.

ముసలోడు లాజిక్ పట్టుకున్నాడు

దాంతో అంతా షాక్ అవుతారు. అసలు ఆ మాట అంది నువ్వేగా అని శివ నారాయణ అంటాడు. ముసలోడు లాజిక్ పట్టుకున్నాడని పారిజాతం అనుకుంటుంది. మనుషులను ప్రశాంతంగా ఉంచవా నువ్వు. మనుషులను రెండు ముక్కలు చేస్తుంది నువ్వు. నీవల్ల గుండెపోటు ఎప్పుడో వచ్చింది అని శివనారాయణ అంటాడు. అందరు బాగానే ఉన్నారు. కానీ, నేనే చెడ్డదాన్ని అయ్యాను అని జ్యో అంటుంది.

మమ్మీ గాయం నయమయేదాకా టైమ్ ఇవ్వాలని బావ అన్నాడు. ఆ టైమ్ వరకు మమ్మీ ఎక్కడ ఉంటుంది. అడిగారా మీరు. నిన్నటి నుంచి దీప ఈ ఇంటి మొహం చూడట్లేదు. అనుమానం రావట్లేదా మీకు. దీప, బావ మా మమ్మీ గురించి పట్టించుకోవట్లేదు. నా మీద నమ్మకం లేకపోడానికి కారణం ఏంటీ అని జ్యోత్స్న అంటుంది. ఎందుకంటే మీ మమ్మీని మీ నాన్న తిట్టడానికి కారణం నువ్వే నువ్వే అని దగ్గుతూ గుండె పట్టుకుంటాడు శివ నారాయణ.

మీరు ఆగండి అని పారు అంటుంది. జ్యోత్స్న నా భార్యను ఎలాగు బయటకు పంపించావ్. మా నాన్నకైనా ఏం కానివ్వకు. లోపలికి వెళ్లు నువ్వు. బయటకు రాకు నువ్వు అని దశరథ్ అంటాడు. సరే పోతాను. బావ మళ్లీ వచ్చి మమ్మీ ఫలానా చోటున ఉందని చెప్పడు. మీకు ఏ అనుమానం రాదు. నేను వెళ్లిపోతాను అని వెళ్లిపోతుంది జ్యోత్స్న. దాని మాటలు పట్టించుకోకండి అని దశరథ్ అంటాడు.

శివ నారాయణ డౌట్

జ్యోత్స్న అన్నమాటల్లో కొంత నిజముంది. సుమిత్ర ఎక్కడుంతో కార్తీక్‌కు తెలిసే ఉంటుంది అని శివ నారాయణ డౌట్ పడతాడు మరోవైపు సుమిత్ర ఎటో చూస్తుంటే అక్కడ ఏముందని శౌర్య అడుగుతుంది. సుమిత్ర ఏం చెప్పదు. సుమిత్రకు నారింజ మిఠాయి ఇస్తుంది శౌర్య. దాంతో ముద్దు పెట్టుకుంటుంది సుమిత్ర. నేను నిన్ను కాపాడాను తెలుసా. జ్యో వచ్చింది. నీ గురించి అడిగితె చెప్పలేదు అని శౌర్య అంటుంది.

ఎందుకంటే నువ్వు దొరికిపోతావ్‌గా. నువ్వు దాగుడుమూతలు ఆడుతున్నావట కదా. అందుకే నీ గురించి ఎవరికి చెప్పలేదు అని శౌర్య అంటుంది. నేను ఎప్పుడో ఓడిపోయాను. గెలవలాని ఆశ లేదని సుమిత్ర అంటుంది. నువ్ దొరకలేదు కాబట్టి ఓడిపోలేదు. నేను నిన్ను గెలిపిస్తాను. ఈరోజు జ్యో వచ్చినట్లు ముద్దుల తాత కూడా వస్తాడా అని శౌర్య అడిగితే.. నాకోసం ఎవరు రారు. నేను ఎవ్వరికి దొరకను అని సుమిత్ర అంటుంది.

ఇంతలో కార్తీక్ వస్తాడు. ప్రేమ ఉన్న వాళ్ల చూపుల నుంచి మనసున్న వాళ్లు ఎప్పుడు తప్పించుకోలేరు అని కార్తీక్ అంటాడు. శౌర్యను తీసుకెళ్లిపోతాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More