కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నను కొట్టిన పారు-అమ్మను తీసుకొస్తేనే గౌరవమంటూ వార్నింగ్-కార్తీక్ ఇంటికి శివన్నారాయణ

కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 23 ఎపిసోడ్ లో కార్తీక్ పై శివన్నారాయణకు అనుమానం వస్తుంది. మరోవైపు జ్యోత్స్నను ఇంకా మారవా? అంటూ చెంప మీద కొడుతుంది పారిజాతం. మీ అమ్మను వెతికి తీసుకొస్తేనే గౌరవం దక్కుతుందని చెప్తుంది. కార్తీక్ ఇంటికి శివన్నారాయణ వెళ్తాడు. 

Published on: Oct 23, 2025, 06:51:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో జ్యోత్స్న ఇంటికి వచ్చిందా? అయితే అత్తను ఎక్కువ రోజులు దాచలేం. మామయ్యకు ఫోన్ చేస్తానని కార్తీక్ అంటే దీప వద్దు అంటుంది. సుమిత్ర కూడా ఇప్పుడు అలాగే ఉంది, కొత్త మనిషిని చూస్తున్నట్లే ఉంది. ఆ ఇంట్లో ఉండే అర్హత లేదు, పోతాను అంటుందని కాంచన చెప్తుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

మీ వదిన ఎక్కడ?

అమ్మ అడగడంతో శివన్నారాయణకు కాల్ చేస్తాడు కార్తీక్. సుమిత్ర ఎక్కడుందో తెలిసిందా? అని అడుగుతాడు శివన్నారాయణ. ఈ వయసులో మనవరాలి పెళ్లి చేయాలని, అందరూ సంతోషంగా ఉండాలనే ఉంటుంది. డబ్బులు లేకపోవడం వల్లే కష్టాలు అనుకునేవాణ్ని. కానీ డబ్బుకు కష్టాలతో సంబంధం ఉండదని తెలిసింది. మీ అన్నయ్యను ఎలా ఓదార్చాలి? పోనీ మీ వదిన ఎక్కడుందో తెలిసిందా? అని శివన్నారాయణ కాంచనను అడుగుతాడు.

శివన్నారాయణకు డౌట్

అప్పుడే శౌర్య వచ్చి నేను అమ్మమ్మ రూమ్ లో పడుకోనా? నానమ్మ రూమ్ లో పడుకోనా? అని అడుగుతుంది. అప్పుడు శివన్నారాయణకు అనుమానం వస్తుంది. మరోవైపు మీ అమ్మ పేరు మీద పూజలు చేయిద్దామని జ్యోత్స్నకు చెప్తుంది పారిజాతం. నీకు భర్త మీద ఇన్నాళ్లు లేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఏం చెప్పినా నీ చెవికి ఎక్కదని జ్యో అంటుంది. నా ప్రేమ వేరు, పగ వేరు. మనుషుల్ని సాధించడం కాదు నా పగ, నేను అనుకున్నది సాధించడం. అది నీ వల్ల కావడం లేదని పారు అంటుంది.

జ్యోకు చెంపదెబ్బ

రెండు రోజులు సైలెంట్ గా ఉండు. డాడీ తింటాడు మమ్మీ పోయింది. పోనీ, ఎలాగో చేయని తప్పునకు నేను నింద పడుతున్నా. మమ్మీ వెళ్లిపోవడం నాకు మైనస్ కాదు. శాడ్ మూడ్ లో ఉండి కంపెనీ గురించి కానీ, సీఈఓ వ్యవహారాల గురించి కానీ డాడీ, తాతయ్య పట్టించుకోరు. అది మనకు కలిసొచ్చే విషయమే అని జ్యో అనగానే పారు లాగిపెట్టి చెంప మీద కొడుతుంది.

ఈ జన్మకు మారవా నువ్వు? తప్పు చేయ్ కానీ దానికి కారణం నువ్వు కాకూడదు. మీ అమ్మ వెళ్లిపోతుంటే ఆపకుండా తప్పు చేశావ్. హీరో ఉన్నంతవరకూ విలన్ కు విలువ ఉండేది. కార్తీక్ గాడు హీరో అవుతున్నాడు. నువ్వు ఏదైనా చేయ్ మీ అమ్మను ఇంటికి తీసుకురా. వాడు తీసుకొస్తే వాడు హీరో అవుతాడు. అప్పుడు సీఈఓ పోస్టు కాదు ప్యూన్ పోస్టు కూడా ఇవ్వరు. నువ్వు అసలైన కూతురివి కాదని మీ నాన్నకు ఇప్పటికే అనుమానం వస్తుందని జ్యోతో పారు అంటుంది.

ఉదయాన్నే తాతకు సారీ చెప్పి అమ్మను తీసుకొచ్చేంతవరకూ ఇంటికి రాను అని మంగమ్మ శపథం చేయ్. అమ్మతో వస్తేనే నీ గౌరవం నీకు తిరిగొస్తుంది. నీ వల్ల అయ్యేలా ఏం చేయాలో ఆలోచించు అని జ్యోకు చెప్పి వెళ్లిపోతుంది పారు.

ఎదురు చూస్తున్నారని

సుమిత్ర దగ్గరకు వెళ్లి కార్తీక్ మాట్లాడతాడు. నన్ను ఇక్కడి నుంచి పంపించేయ్ రా అని సుమిత్ర అడుగుతుంది. కొంతమంది మనల్ని బాధ పెడతారు. అప్పుడు దూరంగా వెళ్లిపోతాం. మన కళ్లలో నీళ్లు ఉన్నాయని వెనక్కి చూడకుండా వెళ్లిపోతాం. కానీ వెనక్కి తిరిగి చూస్తే అవతలి వాళ్ల కళ్లలోనూ నీళ్లు కనిపిస్తాయి. ముడి తెగిపోయిందనుకున్న నీ మూడు ముళ్ల బంధం నీ కోసం ఎలా తపిస్తుందోనని కార్తీక్ అంటాడు.

నీకు ఏం కావాలో చెప్పత్తా అని కార్తీక్ అడుగుతాడు. నాకు ఏ నొప్పి తెలియడం లేదు. నా నడక ఆగేవరకు అలా నడుస్తూ వెళ్లిపోవాలనే ఉంది. నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లు. నవ్వు, ఏడుపు, కోపం, ఆనందానికి సంబంధించిన నరం తెగిపోయినట్లు అనిపిస్తోంది. అందుకే ఏ ఫీలింగ్ రావడం లేదేమో అని సుమిత్ర అంటుంది. జరిగే దాని గురించి ఆలోచించు. నువ్వు వచ్చేసిన తర్వాత ఆ ఇంట్లో దేవుడి గదిలో దీపం వెలగలేదు. మీ మామయ్య అక్కడే కూర్చుని గడప దాటిన కోడలి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. తన భార్య ఏ క్షణమైనా వస్తుందని నీ భర్త చూస్తున్నాడని కార్తీక్ అంటాడు.

సుమిత్ర ఎమోషనల్

నువ్వు ఎక్కడున్నావో చెప్పలేను. ఎందుకంటే నాకు మామయ్య ఏంతో నువ్వు కూడా అంతే. మామయ్య అన్న మాటలకు నువ్వు ఎంత బాధపడ్డావో నేనూ అంతే బాధపడ్డా. నువ్వే ఆగ్రహిస్తే ఎలా? అని అడుగుతాడు కార్తీక్. నేను ఒకటి నమ్మా. కానీ ఎవరూ నమ్మలేదు. నన్ను మాటలన్నారని సుమిత్ర చెప్తుంది. మామయ్య ఎంతో బాధపడుతున్నాడని కార్తీక్ అంటుండగానే తల పట్టుకుని సుమిత్ర పడుకుంటుంది.

ఉదయం కాంచన ఇంటికి శివన్నారాయణ వస్తాడు. దీప షాక్ అవుతుంది. కార్తీక్ అని పిలుస్తూ శివన్నారాయణ లోపలికి వెళ్తాడు. అప్పుడే కార్తీక్ తాత అని పిలుస్తాడు. కార్తీక్, తాత మాట్లాడుకుంటుంటే దీప వెళ్లి కర్టెన్లు క్లోజ్ చేస్తుంది. నిజంగా సుమిత్ర దొరుకుతుందంటావా? అని శివన్నారాయణ అడగడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More