కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నపై శివ నారాయణ కేసు- నువ్వో నేనో చూసుకుందామన్న తాత- శ్రీధర్ పరువు నష్టం దావా!

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 31 ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌లో జ్యోత్స్నపై కేసు పెడతానంటాడు శివ నారాయణ. నువ్వు ఎస్సైతో, నేను ఐజీతో మాట్లాడుతా చూసుకుందామా అని ఛాలెంజ్ చేస్తాడు. అంతా ఇంటికి వెళ్తారు. అక్కడికి వచ్చిన శ్రీధర్ జ్యోత్స్నను అరెస్ట్ చేయిస్తానని, పరువు నష్టం దావా వేస్తానంటాడు.

Published on: Oct 31, 2025, 07:50:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఏ ఆధారంతో కంప్లైంట్ తీసుకున్నారు అని ఎస్సైని నిలదీస్తాడు శివ నారాయణ. గతంలో దీప అని ఎస్సై అంటే గతం గురించి కాదు ఈ కేసు గురించి అడుగుతున్నా. ఏ ఆధారంతో అరెస్ట్ తీసుకొచ్చారు. జ్యోత్స్న చెప్పినట్లు కాంచన ఇంట్లో సుమిత్ర కనిపించిందా. ఉన్నట్లు ఏదైనా ఆధారం దొరికిందా అని శివ నారాయణ రఫ్పాడిస్తాడు.

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 31వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 31వ తేది ఎపిసోడ్

ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు

లేదని ఎస్సై అనడంతో మరి ఎలా అరెస్ట్ చేశారు. చెబుతారా ఐజీకి కాల్ చేయనా అని శివ నారాయణ అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ఎస్సై అంటాడు. ఇప్పుడు ఫైల్ చేయండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు జ్యోత్స్న అంటుంది. అంతవరకు వచ్చిందా. ఎఫ్ఐఆర్ రాయండి. దాంతో పాటు ఈ కేసు కూడా రాయండి. నేను నీ మీద కేసు పెడుతున్నాను. నా కూతురి కోసం నిన్ను నేను సెల్‌లో వేయిస్తాను. నువ్వు ఎస్సైతో మాట్లాడితే నేను ఐజీతో మాట్లాడుతాను. చూసుకుందామా అని శివ నారాయణ అంటాడు.

దీప అడ్డు చెబుతుంటే ఆగమంటాడు శివ నారాయణ. మరి మా అమ్మ ఏమైందని జ్యోత్స్న అడిగితే సుమిత్ర క్షేమంగా ఉంది. నా కొడుకుతోనే ఉంది అని శివ నారాయణ అంటాడు. కార్తీక్ గాడు కాల్ చేసి మీ తాతకు చెప్పాడు అని పారిజాతం అంటాడు. మరి నాకెందుకు చెప్పలేదని జ్యోత్స్న అంటే.. అబ్బా.. అవన్నీ ఇంటికెళ్లి మాట్లాడుకుందాం పదా అని జ్యోతో అంటుంది పారిజాతం.

మా మనవరాలు చేసినదానికి మీకు నేను సారీ చెబుతున్నాను. మీరు నా కూతురుకు సారీ చెప్పండి అని శివ నారాయణ అనడంతో ఎస్సై చెబుతాడు. ఇంతలో శ్రీధర్ కాల్ చేస్తే కాంచన మాట్లాడుతుంది. జరిగింది చెబుతుంది. జ్యోత్స్న నువ్వు నా భార్య దాకా వచ్చావంటే నీకు చరమగీతం పాడాల్సిందే అని శ్రీధర్ అనుకుంటాడు. ఈరోజు నువ్వు స్టేషన్‌లో కొట్టడానికి మించి అంతా అవమానించావ్ అని జ్యోత్స్న అంటుంది.

నన్ను ఫూల్‌ను చేశావ్

బావ ఏది చెప్పిన అదే శాసనం అన్న స్థితిలో ఉన్నావ్. బావ కాల్ చేసి చెప్పగాని నిజమని నమ్మకుండా నన్ను ఫూల్‌ను చేసి పట్టుకొచ్చావ్. బావ చెప్పినదానికి సాక్ష్యం ఉందా అని జ్యోత్స్న అంటుంది. మీ అమ్మ నా భార్య ఇంట్లో ఉందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. నాకు ఎవరి సపోర్ట్ వద్దు మావయ్య అని జ్యో అంటే.. బంధాలు, పిలుపులు నీకు అన్ని గుర్తున్నాయా అని శ్రీధర్ అంటాడు.

అవి మర్చిపోయి తిరిగేది నువ్వు అని జ్యో అంటే.. అలా అయింటే నేను ఈ ఇంటికి పోలీసులతో వచ్చేవాన్ని. నిన్ను అరెస్ట్ చేయించడానికి. కాంచన ఇంట్లో సుమిత్ర ఉందనడానికి సాక్ష్యం ఏముంది అని శ్రీధర్ అంటాడు. ఉంది. సుమిత్ర తన ఇంట్లో లేదని అత్త మీద ఒట్టు వేయించి చెప్పమను అని జ్యోత్స్న అంటుంది. సరే ఉంటే కాంచనను అరెస్ట్ ఎందుకు చేయించావ్ అని శ్రీధర్ అంటాడు.

అత్యుత్తమ అత్తగా, కోడలిగా ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా ఉన్నారని అంటుంది జ్యోత్స్న. నా భార్య మీద కేసు ఎందుకు పెట్టారో చెబుతారా. లేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయమంటారా అని శ్రీధర్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. శ్రీధర్ ఈ మధ్య జ్యోత్స్న మతిస్థిమితం సరిగా ఉండట్లేదు అని సుమిత్రి ఇంట్లోంచి వెళ్లిపోయేది గుర్తు చేసి చెబుతాడు శివ నారాయణ.

సుమిత్రకు దిష్టి తీసిన దీప

మరి మా మమ్మీ ఎక్కడుంది చెప్పు తాత అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్‌పై అరుస్తుంది జ్యోత్స్న. దీపను ఎర్రనీళ్లు తీసుకురమ్మంటాడు కార్తీక్. దానికి జ్యో, పారు ప్రశ్నలు వేయడంతో సుమిత్రను దశరథతో చూపిస్తాడు కార్తీక్. సుమిత్ర గురించి ఎమోషనల్‌గా మాటలు చెప్పిన కార్తీక్ ఇంట్లోకి అడుగుపెట్టమంటాడు. దీపను దిష్టి తీయమంటాడు కార్తీక్.

తల్లిదండ్రులకు దిష్టి తీస్తుంది దీప. ఈరోజు మీ పెళ్లి రోజు. అంటే మీకు పెళ్లయిన రోజు. ఒకప్పుడు ఇంటి పెద్ద కోడలిగా గడప దాటి ఎలా వచ్చిందో అలాగే వచ్చేయ్. మరోసారి మా అత్తను ఒంటరిగా బయటకు పోనివ్వకు అని గడపకు చెబుతాడు కార్తీక్. ఇంకోసారి వెళ్లకు అత్త అని కార్తీక్ అంటే సుమిత్ర సరే అంటుంది. తనను క్షమించమని శివ నారాయణ కాళ్ల మీద పడుతుంది. మీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది.

మెడిసిన్ లాంటి మనవడు ఉండగా నాకేం అవుతుంది. వీడు సర్వరోగ నివారిణి. వాడు సంజీవని. ఇంట్లో అందరం బాగుండటానికి కారణం వీడేనమ్మా అని శివ నారాయణ కార్తీక్‍‌ను మెచ్చుకుంటాడు. దాంతో కోపంగా పైకి వెళ్తుంది జ్యోత్స్న. వెంటనే పారిజాతం వెళ్తుంది. తప్పంతా నీదే. కిందకు వెళ్దాం పదా. అందరు నిన్ను ఛీ అంటారు అని పారు అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More