కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న మైండ్‌బ్లాక్‌- షాకిచ్చిన తాత‌, తండ్రి, త‌ల్లి- సీఈఓ పోస్టుకు రాజీనామా చేయాలంటూ!

కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 6 ఎపిసోడ్ లో జ్యోత్స్నకు ఫ్యామిలీ షాక్ ఇస్తుంది. సీఈఓ పోస్టుకు రాజీనామా చేయమని శివన్నారాయణ చెప్తాడు. డాడీని జ్యోత్స్న రిక్వెస్ట్ చేసిన ఫలితం ఉండదు. చివరకు సుమిత్ర నిర్ణయం కోసం అందరూ వెయిట్ చేస్తారు. 

Published on: Nov 06, 2025 6:48 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 6 ఎపిసోడ్ లో శివన్నారాయణ దగ్గరకు వెళ్లి పొగడ్తలతో బుట్టలో వేసేందుకు ప్రయత్నిస్తుంది పారిజాతం. చేతిలో చిడతలుంటే భజన సరిగ్గా సరిపోయేదని శివన్నారాయణ అంటాడు. కాళ్లు పడతానని పారు అంటుంది. సుమిత్ర, దశరథ కలిసిపోయారు కదా అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం కాదు. అందుకే బోర్డు మీటింగ్ లో సీఈఓగా జ్యోత్స్న కొనసాగుతుందని చెప్పాలని పారు అడుగుతుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

రాజీనామా చెయ్

పారు వెనకాల వచ్చి జ్యోత్స్న డోర్ దగ్గర నుంచి అంతా వింటుంది. జ్యోత్స్నకు నీ మీద నమ్మకం లేనట్లుంది. అందుకే వెనకాల వచ్చింది. జ్యోత్స్న ఇటు రా అని శివన్నారాయణ పిలుస్తాడు. ముందు సీఈఓ పోస్టుకు రాజీనామా చేయ్, మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో అని షాక్ ఇస్తాడు శివన్నారాయణ. కాస్త మీ అమ్మానాన్నలకు దూరంగా ఉండమని కూడా జ్యోత్స్నకు చెప్తాడు.

దీప కంగారు

సీఈఓ విషయంలో తాత ఏ నిర్ణయం తీసుకుంటాడో, గొడవలు జరుగుతాయో అని దేవుడికి మొక్కా. కానీ కొబ్బరికాయ కుళ్లిపోయింది. అలా జరిగితే అశుభం అని కార్తీక్ కు చెప్తూ దీప కంగారు పడుతుంది. జ్యోత్స్న సీఈఓ కాకపోతే మళ్లీ గొడవలు మొదలవుతాయిని దీప అంటే, మనకు సంబంధం లేదని కార్తీక్ అంటాడు. మనకు సంబంధం లేకపోవడం ఏంటీ? అని దీప అడుగుతుంది. మనకు, మన కుటుంబానికి ఎవరు అన్యాయం చేస్తారో మనకు తెలుసని కార్తీక్ చెప్తాడు.

కార్తీక్ ధైర్యం

నువ్వే ఆ ఇంటి అసలైన వారసురాలివి అని చెప్పేకంటే ముందు ఆ ఇంట్లో ఒక్క సమస్యా ఉండకూడదు. కానీ ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. తాత తీసుకునే నిర్ణయం వల్ల కొన్నిటికి పరిష్కారం దొరుకుతాయని నా నమ్మకం. కానీ జ్యోత్స్న కూడా తనకు మనవరాలే నిజం తెలిసేంత వరకు. కొబ్బరికాయ కుళ్లిందనో, జ్యోత్స్న తిట్టిందనో నువ్వు కంగారు పడకు అని కార్తీక్ ధైర్యం చెప్తాడు. మామయ్యకు బుల్లెట్ ఎలా తగిలిందని అత్త ప్రూవ్ చేయమని చెప్పింది. అంతకంటే ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని దీపకు టిఫిన్ తినిపిస్తాడు కార్తీక్.

జ్యోత్స్న రిక్వెస్ట్

నాన్న కాళ్ల మీద పడు. నువ్వు సీఈఓగా ఉండాలంటే ఇంట్లో వాళ్ల సపోర్ట్ ఉండాలి. సెంటిమెంట్ తో కొట్టమని జ్యోకు చెప్తుంది పారు. డాడీ నేను కాకుండా మీకు ఇంకెవరైనా పిల్లలున్నారా? అని జ్యో అడుగుతుంది. నాకు ఒక్కరే భార్య, ఒక్కరే కూతురని దశరథ అంటాడు. అంటే మీ కూతురే మీ వారసురాలు కదా. మీ తర్వాత మీ వారసత్వాన్ని కొనసాగించాల్సింది మీ కూతురే. మరి అలాంటి కూతురు కంపెనీలో సీఈఓగా ఉండాలి కదా అని అడుగుతుంది జ్యోత్స్న.

నాన్న నిర్ణయమే

నాకు ఆస్తే కాదు పదవి కూడా కావాలని జ్యోత్స్న అడుగుతుంది. ఆస్తి పోతే నేనే బాధపడతా. కానీ కంపెనీ నష్టపోతే ఎంత మంది రోడ్డున పడతారో తెలుసా? ఆలోచించాను కాబట్టే కార్తీక్ ను సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత నిన్ను సీఈఓగా చేస్తే సైలెంట్ గా ఉన్నా. చాలా నష్టపోయాం అయినా సరే 30 రోజుల టైమ్ ఇచ్చాం. నువ్వు ప్రూవ్ చేసుకోలేదు. ఇప్పుడు కంపెనీ వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయేలా ఉంది. నీకు నేను సపోర్ట్ చేయలేను. నాన్న ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అని దశరథ అంటాడు.

అర్హత ఉన్నవాళ్లు

ప్లీజ్ డాడీ, సీఈఓగా తీసేస్తే పరువు పోతుంది. ఎంప్లాయిస్ ముందు తల ఎత్తుకు తిరగలేను. నన్ను సపోర్ట్ చేయ్ డాడీ అని చేయి పట్టుకుని రిక్వెస్ట్ చేస్తుంది జ్యోత్స్న. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది బోర్డు మెంబర్స్. అందరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఆ కుర్చీ సమర్థవంతమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది. అర్హత ఉన్నవాళ్లు మాత్రమే దాంట్లో కూర్చోగలరని శివన్నారాయణ అంటాడు. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు.

మధ్యలో పారు

సామర్థ్యం, తెలివితేటలు లేవని నిరూపించుకున్నావు. నిన్ను చూసి బోర్డు మెంబర్స్ షేర్లు అమ్మి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కావాల్సింది నడిపించే వాడు కాదు. నమ్మకం కలిగించే వాడని దశరథ అంటాడు. నమ్మకం కలిగించే మనిషి ఎవరన్నది ఈ రోజు తెలుస్తుందని శివన్నారాయణ చెప్తాడు. సుమిత్రకు నిర్ణయం తీసుకునే అధికారం లేదా అని పారు పుల్ల పెడుతుంది.

సుమిత్ర చేతిలో

సుమిత్ర ఈ ఇంటి మహాలక్ష్మి. తను కన్నీళ్లు పెట్టే ఏ పని చేయకూడదు. మన నిర్ణయాల్లో తన భాగం కూడా ఉంది. నా కొడుకు, బోర్డు మెంబర్స్ నా మాట కాదు అనరు. నీ నిర్ణయం చెప్పమ్మా. నీ కూతురే సీఈఓగా ఉండాలని కోరుకుంటున్నావా? నీ కోరిక అదే అయితే మేమంతా దానికి సరే అంటామని శివన్నారాయణ అడుగుతాడు. మమ్మీని రిక్వెస్ట్ చేస్తుంది జ్యోత్స్న.

నా నిర్ణయాన్ని గౌరవించి అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఒక తల్లిగా నా కూతురి గురించి ఏం కోరుకుంటానో అదే చెప్పాలనుకుంటున్నా. నా కూతుర్ని పెళ్లి కూతురిగా చూడాలనుకుంటున్నా అని సుమిత్ర చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.