కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప తప్పులేదని ప్రూవ్ చేస్తానన్న కార్తీక్-బావకు టైట్ హగ్-పారును రెచ్చగొట్టిన జ్యో
కార్తీక దీపం 2 టుడే నవంబర్ 5 ఎపిసోడ్ లో దశరథ మామయ్యను గన్ తో కాల్సిన విషయంలో దీప తప్పు లేదని ప్రూవ్ చేస్తానని సుమిత్రతో అంటాడు కార్తీక్. సర్ ప్రైజ్ కూడా ఇస్తానని చెప్తాడు. సీఈఓ పోస్టు కోసం తాతను ఒప్పించేలా పారిజాతాన్ని రెచ్చగొడుతుంది జ్యోత్స్న. భర్తను సగం పంచుకోలేనని కాంచన ఫీల్ అవుతుంది.
కార్తీక దీపం 2 టుడే నవంబర్ 5 ఎపిసోడ్ లో నువ్వు చేస్తున్న ప్రతిపనిలో నటిస్తున్నట్లు కనిపించడం లేదు. నిజాయతీగా చేస్తున్నట్లే ఉందని సుమిత్ర అంటుంది. నేనెందుకు నటిస్తానమ్మా అని దీప అంటే, కొన్నిసార్లు అవసరం నటించేలా చేస్తుందని సుమిత్ర అంటుంది. పెళ్లి ఆపుదామని తాళి దాచా. కానీ పైకి నవ్వుతూ నిజాయతీగా నటించానని చెప్తుంది.

దీప వేరు
నాకు కావాల్సిన వాళ్లు నేను వెళ్లిపోతుంటే చూసి కూడా ఆపలేదు. ఏ సంబంధం లేని నువ్వు మాత్రం నాకోసం వెతికావు. నన్ను నీ ఇంటికి తీసుకెళ్లావు. సేవ చేశావు. నా కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లావు. ఎక్కడా నీలో నాకు నటన కనిపించలేదు. రక్త సంబంధం కోసం చేసినట్లే అనిపించింది. నీ తల్లి కోసం ఎలా చేస్తావో అంత ప్రేమతో చేశావు. నేను చూసిన దీప వేరు, అర్థం చేసుకున్న దీప వేరు, ఇప్పుడు చూస్తున్న దీప వేరు. పైగా నువ్వు మా అమ్మవి అని అన్నావు. కానీ నేను అయిపోతానా? ద్వేషించిన కూడా ఇంత ప్రేమ చూపించగలుగుతున్నావా? అని అడుగుతుంది సుమిత్ర.
నిరూపిస్తా అత్త
ఒక విషయంలో దీపను నమ్మలేకపోతున్నానని సుమిత్ర అంటుంది. అది నాకు తెలుసు అత్త. నువ్వు నిజాలు నమ్మలేకపోతున్నావు. విన్నావు, చూసిందే నిజం అనుకుంటున్నావు. అన్నిటికి ఆధారాలు ఉండవు అత్త అని కార్తీక్ అంటాడు. ఆధారాలు లేనప్పుడు దీప పట్టుకున్న గన్ నుంచి బుల్లెట్ రాలేదని ఎలా నిరూపిస్తా అన్నావని సుమిత్ర అడుగుతుంది. దీప ఎప్పుడూ ఒకేలా ఉందని కార్తీక్ చెప్తాడు.
కార్తీక్ కు హగ్
చిన్నప్పుడు ఏ స్వార్థం కోసం నన్ను కాపాడింది? నిన్ను కూడా కాపాడింది. దశరథ మామయ్యకు బుల్లెట్ తగిలిన విషయంలోనూ దీప తప్పు లేదని కార్తీక్ అంటాడు. నిరూపించు, నా మైండ్ లో ఉన్న విజువల్ ను చెరిపేయ్ అని సుమిత్ర అడుగుతుంది. నిరూపిస్తా అత్త, ఆ తర్వాత సర్ ప్రైజ్ కూడా ఇస్తానని కార్తీక్ అంటాడు. సుమిత్ర వెళ్లిపోయాక నువ్వే అత్త కూతురివి అని చెప్పడమే కానుక అని కార్తీక్ దీపతో చెప్తాడు. కార్తీక్ ను గట్టిగా హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది దీప. హ్యాండిల్ విత్ కేర్ అని కార్తీక్ ఆయాసపడతాడు.
మన జీవితాల్లోకి ఓ తుపాను వచ్చి వెళ్లిపోయినట్లుందని కాంచన అంటుంది. జ్యోత్స్నకు పెళ్లి చూస్తే ఎవరి జీవితాల్లోకి ఏ తుపాను రాదు. మనం చూసిన సంబంధాలు వాళ్లకు నచ్చుతాయా? పొరపాటును ఎవరినైనా తీసుకొచ్చినా వాడు జ్యోత్స్న కంటే ముదురై ఉండాలని శ్రీధర్ అంటాడు. ఇప్పుడైతే గొడవలు పోయి అందరం ఒకటై పోయామని కాంచన ఆనందపడుతుంది.
సీఈఓ పోస్టు కోసం
ముందు నువ్వు ఎవరి సైడ్ ఉన్నావో చెప్పమని పారిజాతాన్ని అడుగుతుంది జ్యోత్స్న. నీ సైడే, ఈ పారు ఎప్పుడూ మనవరాలి కోసమే బతుకుతుందని పారు చెప్తుంది. ఇది నా ఎండింగ్ పాయింట్. ప్రేమను దీప ఎత్తుకుపోయింది. ఆస్తి మొత్తం డాడీ పేరు మీద రాశారు. గౌరవం కూడా లేదు. అందుకే కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఇప్పుడు క్లారిటీగా లేకపోతే కష్టమే. సీఈఓ పోస్టు పోతే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? నేను సీఈఓగా ఉంటే ఆస్తి మొత్తం ఎలా నా పేరు మీద రాయించుకోవాలో చెప్తానని జ్యో అంటుంది.
నీ తెలివితేటలతో తాతను బుట్టలో పడేసి తాళి కట్టించుకున్నదానివి. ఈ ఒక్క సాయం చేయలేవా? మనం అనుకున్నది జరగాలంటే పాత పారిజాతం రావాలి గ్రానీ అని పారును రెచ్చగొడుతోంది జ్యో. నా టాలెంట్ అంతా వాడి మీ తాతను ఎలా ఒప్పిస్తానో చూడు అని పారు వెళ్తుంది.
మీ కథ వేరు
నేను మీతో ఉండొచ్చా? అని కార్తీక్ ను అడుగుతాడు శ్రీధర్. మనమంతా కలిసే ఉంటాం. కానీ ఎవరి ఇళ్లు వాళ్లకున్నాయి. ఎవరి కుటుంబాలు వాళ్లకున్నాయి. మీరు బయల్దేరండి చిన్నమ్మ ఎదురు చూస్తుంటుందని కార్తీక్ అంటాడు. అయితే జ్యోత్స్న అడిగింది కరెక్టే. అందరి గురించి ఆలోచిస్తావు కానీ అమ్మానాన్న గురించి కాదంటాడు శ్రీధర్. అత్తమామ కథ వేరు మీ కథ వేరు అని కార్తీక్ అంటాడు.
మనం కుటుంబంగా కలిసి ఉండటమనేది నా తల్లి నిర్ణయం మీద ఆధారపడి ఉందని అంటాడు కార్తీక్. అంతా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది కాంచన. మన కుటుంబం కూడా కలిసిపోతే అది కదా నిజమైన ఆనందం. సరే అను కాంచన అని శ్రీధర్ అడుగుతాడు. నేను వద్దు అనుకున్నది నాకు వద్దు. మరొకరికి ఇచ్చేసింది నాకు వద్దు. కొన్నిటికి మార్పు ఉండదని కరాఖండీగా చెప్తుంది కాంచన.
కాంచన ఎమోషనల్
సగం సగం పంచుకోలేనని మిమ్మల్ని పూర్తిగా వేరొకరికి ఇచ్చేశా. కావేరీ మిమ్మల్ని పంపను అంటే పిలిచే అధికారం నాకు లేదు. కానీ తోబుట్టువులా కలిసే మనిషి కాబట్టి మీరు మాతో ఉండగలుగుతున్నారు. ఇది కూడా మీ ఇల్లే. ఇక్కడికి రావొచ్చు, వెళ్లొచ్చు కానీ తండ్రిగా మాత్రమే. కాంచనకు భర్తగా కాదని కాంచన ఫీల్ అవుతుంది. నీ మనసు మారుతుందనే చిన్న ఆశతో వెళ్తున్నా అని శ్రీధర్ వెళ్లిపోతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












