కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అమ్మానాన్న మధ్యలో దీప-కూతురు ఎందుకు కాకూడదని దశరథ ప్రశ్న-రగిలిపోతున్న జ్యోత్స్న
కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 4 ఎపిసోడ్ లో కుటుంబమంతా కలిసి భోజనం చేస్తుంటే జ్యోత్స్న రగిలిపోతుంది. దీపను మధ్యలో కూర్చోబెట్టుకుని మరి భోజనం చేసేలా చూస్తారు సుమిత్ర, దశరథ. దొరికిందే ఛాన్స్ అని పారు కుమ్మేస్తుంది. అందరికీ బట్టలు పెట్టి, పార్టీ ఉంది రమ్మంటాడు శివన్నారాయణ.
కార్తీక దీపం 2 టుడే నవంబర్ 4 ఎపిసోడ్ లో నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసే రోజు చాలా దగ్గర్లోనే ఉందని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. అది తెలిసిన రోజు నిన్నయితే ఏం చేస్తారో తెలియదు. అందుకే దాసును పిలిచి నీ కూతురిని నువ్వు తీసుకుపోరా అని అంటా. అప్పుడు నీకు ఆస్తికి ఏం సంబంధం ఉండదు. చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు వస్తే ఆస్తి మొత్తం తనకే కట్టబెడతారని పారు అంటుంది.

పెళ్లి చేసుకో
సుమిత్ర కూతురు బతికే ఉందని దాసు చెప్పిన విషయం నిజమే అయితే నువ్వు వారసురాలివి కాదని బయటపడిన తర్వాత అసలైన వారసురాలు బతికే ఉందని దాసు చెప్పేస్తాడు కదా. అప్పుడు అసలైన యువరాణి కోసం వేట మొదలవుతోంది. అది దొరికిందే అనుకో ఆస్తి మొత్తం దానికి. అప్పుడు నువ్వు ఆటోలు మారుతూ ఉద్యోగం అంటూ తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే దాసు దగ్గర డబ్బులు లేవు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుంటే కొంతలో కొంత అయినా సేవ్ అవుతావని పారు చెప్తుంది.
చెప్పలేనంత సంతోషం
డైనింగ్ టేబుల్ మీద తమ అమ్మానాన్నలను పక్కపక్కన చూసి అటు దీప, ఇటు కార్తీక్ సంతోషపడతారు. కడుపు నిండా భోజనం చేసి ఇవాళ్టికి మూడో రోజు. ఈ రోజు ఆనందంతో ఆకలి రెట్టింపైంది. మీరిద్దరు కూర్చుంటే నిజంగా ఇది విందు భోజనమవుతుంది. దీప కూర్చో. అన్ని జంటలను ఇలా చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉందని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్న మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది, ఏవండీ ఏదైనా సంబంధం అని పారు అనబోతుంటే నాకు తెలియదా అని శివన్నారాయణ అంటాడు.
అమ్మానాన్న మధ్యలో
దీపను మధ్యలో కూర్చోబెట్టుకుంటారు సుమిత్ర, దశరథ. దశరథ నీ కూతురు దీప కాదు జ్యోత్స్న అని పారు అంటే, ఏ దీప ఎందుకు కాకూడదు అని దశరథ అనగానే జ్యో షాక్ అవుతుంది. దీప కూడా కూతురు ఎందుకు కాకూడదని దశరథ మళ్లీ అంటాడు. దీంతో డాడీ మీద జ్యోకు అనుమానం వస్తుంది. ఓ మనిషి మీద అభిమానం చూపించాలంటే రక్త సంబంధం ఉండాలా? పిన్ని అని అడుగుతాడు దశరథ. ఈ మూడు రోజులు సుమిత్రకు దీప కన్నతల్లికి సేవలు చేసినట్లుగా చేసిందని మా చెల్లి చెప్పిందంటాడు. పెళ్లి రోజు అతిథి దీప అని ఇద్దరు కలిసి వడ్డిస్తారు. తొందర్లోనే నిజాలు బయటపడేలా ఉన్నాయని జ్యో కంగారు పడుతుంది.
నిజం చెప్పాలని కార్తీక్
మీవన్నీ దొంగ ప్రేమలు, అన్ని మనసులోనే పెట్టుకుంటారని తల్లి, తాత గురించి అంటాడు కార్తీక్. మీ ప్రేమలు అందరికీ చూపిస్తున్నారు కదా పారు అంటే, సాంబారు కంటే మీ మాటలే బాగున్నాయని శ్రీధర్ కౌంటర్ వేస్తాడు. పారు నువ్వు డైైట్ ను మర్చిపోయినట్లున్నావ్, ఈ ఒక్క రోజు మాత్రమే తినమని అంటాడు కార్తీక్. దొరికిందే ఛాన్స్ అని కుమ్మేస్తుంది పారు. వారానికి సరిపడా తినేస్తానంటుంది. దీపకు పొలమారితే సుమిత్ర, దశరథ తలపై చేతితో కొడతారు. ఒక్క రోజులో వీళ్లు ఇలా మారిపోయారేంటీ అని జ్యో షాక్ అవుతుంది. త్వరలోనే అత్తకు, మామయ్యకు నిజం చెప్పాలని అనుకుంటాడు కార్తీక్.
బంధాలు శాశ్వతం
ఉండిపో మామయ్య, నీకు అత్తింట్లో చోటు లేకపోయినా మా ఇంట్లో చోటు ఉందని జ్యోత్స్న మళ్లీ మంటపెట్టేలా శ్రీధర్ తో మాట్లాడుతుంది. జ్యోత్స్న నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు పుట్టకముందే అతను ఈ ఇంటి అల్లుడు. అప్పుడు ఇక్కడే ఉండేవాళ్లు. కానీ ఏదీ శాశ్వతం కాదు. కలిసి ఉన్న రోజుల నుంచి ముక్కలైపోయిన రోజులూ వచ్చాయి. కానీ బంధాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని దశరథ అంటాడు. చెల్లెమ్మ రెండు రోజులు ఉండిపోకూడదా? అని దశరథ అంటే, దగ్గర్లోనే ఉన్నా కదా అని కాంచన చెప్తుంది.
చెట్టు లాంటిది
వట్టి చేతులతో పంపడం ఇష్టం లేదని, అందరి కోసం బట్టలు తెచ్చానని శివన్నారాయణ అంటాడు. శ్రీధర్ కు బట్టలు పెడతాడు. కొట్టే చేయి మీదే, పెట్టే చేయి మీదే. మళ్లీ నాకు ఇంత చనువు ఇస్తారనుకోలేదని శ్రీధర్ అంటాడు. నా కోపం గాలికి విరిగిపడిపోయే చెట్టు లాంటిదేనని శివన్నారాయణ చెప్తాడు. అంతా కలిసిపోతున్నారని గ్రానీ అని జ్యో అంటుంది. కాంచన, కార్తీక్, దీపలకు కూడా బట్టలు పెడతాడు శివన్నారాయణ.
సారీ చెప్పిన సుమిత్ర
నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయి మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో సారీ వదినా అని సుమిత్ర అంటుంది. పాత గాయాలకు ఆపరేషన్ జరిగిపోయిందని అంటాడు కార్తీక్. అతి త్వరలోనే ఈ ఇంట్లో పెద్ద పార్టీ అరెంజ్ చేయబోతున్నాను. అందరూ తరలి రావాలి. నీ కుటుంబానికి కూడా చెప్పు. పెద్ద కుటుంబం గురించి కాదు చిన్న కుటుంబం గురించి చెప్తున్నా. దాసు, కాశీ, స్వప్నను కూడా రమ్మనండని శివన్నారాయణ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.














