కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: చూసి కూడా ఎందుకు ఆప‌లేద‌ని జ్యోకు షాకిచ్చిన సుమిత్ర‌-శివ‌న్నారాయ‌ణ సీరియ‌స్‌-దీపపై ప్రేమ

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 3 ఎపిసోడ్ లో పెళ్లి రోజు సందర్భంగా సుమిత్ర, దశరథతో దండలు మార్పిస్తాడు కార్తీక్. జ్యోత్స్నకు కాకుండా దీపకు కేక్ తినిపిస్తాడు దశరథ. కాంచన, శ్రీధర్ కలిసి ఉండటం లేదనే విషయంతో రచ్చ చేయాలని చూస్తుంది జ్యో. శివన్నారాయణ  సీరియస్ అవుతాడు. కూతురికి సుమిత్ర షాకిస్తుంది.  

Published on: Nov 03, 2025 7:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 3 ఎపిసోడ్ లో అమ్మలాంటి అత్తకు ఎంతో రుణపడి పోయా. ఆ రుణాన్ని ఎంతో కొంత తీర్చుకోగలిగితే చాలని కార్తీక్ అంటాడు. మనవడికే కాదు మనవరాలికి కూడా చాలా చెప్పా. ఎవరికి ఏం అవసరమో అది మాత్రమే గుర్తు పెట్టుకుంటారని శివన్నారాయణ అంటాడు. అందరు కలిసి జోకర్ ను చేశారు. బావకు, దీపకు ఎక్కడ నిజం తెలిసిపోయిందోననే కొత్త భయం పట్టుకుందని జ్యోత్స్న అనుకుంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దండలు మార్చుకుని

పెళ్లి రోజు సందర్భంగా దశరథ, సుమిత్రతో దండలు మార్పిస్తాడు కార్తీక్. నా మనసులోని మాట చెప్తా. మనిషి శరీరంలో ప్రాణం ఎక్కడుంది అంటే? గుండె ఆగిపోతే ప్రాణం పోతుంది. ప్రాణం గుండెలోనే ఉంది. గుండె ఉన్నా ప్రాణం పోతుంది. అదెప్పుడూ ఊపిరి ఆగినప్పుడు. ప్రాణం ఊపిరిలో ఉంది. భార్యకు ఊపిరి భర్తే. ఓ కఠిన మాట తీసుకునే ఊపిరిని కూడా ఆపేస్తుంది. మాట అనిపించుకునేంత వరకూ తీసుకురానని మాటిస్తున్నా అని దండ వేస్తుంది సుమిత్ర.

మళ్లీ బాధపెట్టను

మీ అత్తయ్యలా గుండె అని చెప్పను కానీ. మరోసారి ఎప్పుడూ తనను మాటలతో కానీ చేతలతో కానీ బాధపెట్టను. కన్నీళ్ల బరువు కార్చేవాళ్లకే కాదు మోసేవాళ్లకూ తెలుస్తోంది. ఈ రెండు రోజులు ఆ బరువు మోశా. కొంత నా మేనల్లుడి దగ్గర, కొంత నా భార్య దగ్గర బరువు తెంచేసుకున్నా. మరోసారి నిన్ను బాధపెట్టే పని ఏదీ చెయ్యను సుమిత్ర అని దండ వేస్తాడు దశరథ. అదరగొట్టేశావ్ బావ అని శ్రీధర్ చప్పట్లు కొడతాడు.

దీపకు కేక్

దశరథ, సుమిత్ర కలిసి కేక్ కట్ చేస్తారు. మళ్లీ మేం కలవడానికి కారణం మీ జంట. అందుకే ముందుగా మీకే తినిపించాలనుకుంటున్నానని దశరథ అంటాడు. ముందు జ్యోత్స్నకు పెట్టమని దీప అంటుంది. మా విషయంలో కార్తీక్, దీప తీసుకున్న బాధ్యత ఈ ఇంటి కన్నీళ్లను తుడిచింది. ఈ పెళ్లి రోజుకు కారణం మీరేనని దీప నోట్లో కేక్ పెడతాడు దశరథ. ఇదేంటీ ఇంతలా ఫీల్ అవుతుంది కన్నవాళ్లు వీళ్లే అని దీపకు తెలుసా అని జ్యోత్స్న కంగారు పడుతుంది.

జ్యోత్స్న రచ్చ

మమ్మల్ని కలిపింది మీరే. ఈ సంతోషంలో ఏదైనా చేయాలనుంది. అడగండని కార్తీక్ తో అంటాడు దశరథ. ఇదంతా చూసి జ్యోత్స్న తట్టుకోలేదు. విడదీసేది వీళ్లే, కలిపేది వీళ్లే. మరి అత్తను, మామయ్యను ఎందుకు కలపలేకపోయారు? మా అమ్మనాన్న గురించి మాత్రమే ఆలోచిస్తావా? మీ అమ్మనాన్న గురించి ఆలోచించవా? ఏం డాడీ మీ చెల్లి, బావ కలిసి ఉండాలని కోరుకోవా? అని మళ్లీ రచ్చ చేస్తుంది జ్యోత్స్న.

బావ, నువ్వు నీ కన్నతల్లిని పట్టించుకోవు. కానీ నా కన్నతల్లి కాపురాన్ని నిలబెట్టేందుకు మాత్రం యుద్ధాలు చేస్తావు. మీ అమ్మానాన్నకలిసి ఉండాలని కోరుకోవా? అని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వు అడిగిన దాంట్లో తప్పు లేదు. కానీ అజ్ణానం ఉంది. మాట్లాడేటప్పుడు బుర్ర కాదు బుద్ధి కూడా పనిచేయాలి. వాళ్లు విడిపోయారని ఎవరైనా చెప్పారా? విడిపోయారని ఎలా అంటున్నావ్? కార్తీక్ పెళ్లికి శ్రీధర్ ఒంటరిగా వచ్చాడా? ఇప్పుడు జంటగానే ఉన్నారా? కళ్లు కనిపించడం లేదా? నోటికి ఏదొస్తే అదే అంటావా? అని జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు శివన్నారాయణ.

జ్యోకు సుమిత్ర షాక్

అందరూ భోజనాలు చేసేందుకు వెళ్తారు. అప్పుడు సుమిత్రతో ఒంటరిగా మాట్లాడుతుంది జ్యోత్స్న. మిగతావాళ్లకు తెలియకపోవచ్చు కానీ దీప ఎలాంటిదో నీకు తెలుసు కదా. దానివల్లే నువ్వు, డాడీ విడిపోయారని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్నను పక్కకు తీసుకెళ్లి సుమిత్ర మాట్లాడుతుంది. కాంచన అత్తయ్య, శ్రీధర్ మామయ్య గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అని సుమిత్ర అడుగుతుంది.

గతాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతుంది జ్యోత్స్న. నేను బాధపడటానికి కారణం దీపే అంటావు. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం దీపే అంటావు. అవును.. అని జ్యోత్స్న అంటుంది. బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత ఇంట్లో గొడవ జరిగింది. దానికి కారణం ఎవరు? అని అడుగుతుంది సుమిత్ర. ఆ రోజు నువ్వు చేసిన పనికి రిజల్ట్ అలాగే వచ్చింది. నీకు ఏం తెలీదు జ్యోత్స్న. నువ్వెంత అమాయకురాలివి అంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవడం చూసినా ఆపలేనంత. మీ డాడీకి, నాకు గొడవ రావడానికి కారణం నువ్వే అని తెలిసినా దీపను తప్పుపట్టేంత అమాయకురాలివని సుమిత్ర షాక్ ఇస్తుంది.

దీపకు, నీకు తేడా

ఎవరేంటో నాకు అర్థమవుతుంది. మన విషయంలో ఎదుటి వాళ్లు ఎలా ఉన్నారనేదాన్ని బట్టి కొన్ని సార్లు మనుషుల్ని నమ్మాల్సి వస్తుంది. నా కోసం నువ్వు అంత ఆరాటపడేదానివి అయితే నన్ను ఆపేదానివి జ్యోత్స్న. సమర్థించుకోకు. నువ్వు చిన్నపిల్లవి కాదు. ఒకప్పుడు దీప ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది. ఇప్పుడూ కాపాడింది. నువ్వు నన్ను వదిలేశావు. దీపను ద్వేషించా. కానీ నన్న వదిలేయలేదు. ఇదే నీకు, దీపకు ఉన్న తేడా అని సుమిత్ర అంటుంది.

బావ, దీప కలిసి నీ మనసు మార్చేశారు మమ్మీ అని జ్యోత్స్న కంగారు పడుతుంది. నేను నిన్నేం అడగడం లేదు. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పా అంతే. నువ్వేంటో నాకు తెెలీదా? అని వెళ్లిపోతుంది సుమిత్ర. షాక్ గట్టిగానే తగిలినట్లుందని అంతా విన్న అంటూ పారిజాతం వస్తుంది. నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసిపోయే రోజు చాలా దగ్గర్లో ఉంది. బిడ్డలను మార్చింది నేనే కాబట్టి గెంటేస్తుండొచ్చు. నిన్ను ఏం చేస్తారో తెలియదని పారు అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.