కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ట్విస్ట్ అదుర్స్- సీఈఓగా శ్రీధర్-జ్యో రాజీనామా- ఇంట్లో నుంచి వెళ్లిపోతానని రచ్చ
కార్తీక దీపం 2 టుడే నవంబర్ 12 ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. కొత్త సీఈఓగా శ్రీధర్ ఎంట్రీ ఇవ్వడంతో పారు, జ్యో షాక్ అవుతారు. జ్యో రాజీనామా చేస్తుంది. కొడుకు కారణంగానే ఈ పదవి దక్కిందని శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోతానని జ్యో రచ్చ చేస్తుంది.
కార్తీక దీపం 2 టుడే నవంబర్ 12 ఎపిసోడ్ లో అందరూ ఎదురు చూస్తుండగా జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కు కొత్త సీఈఓగా శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. అల్లుడు ఇది నువ్వేనా అని పారు అడుగుతుంది. అవును అత్తయ్య ఇది నేనే అని స్టైల్ గా చెప్తాడు శ్రీధర్.

సీఈఓ శ్రీధర్
జ్యోత్స్నను పక్కకు జరిపి ఆ సీట్లో కూర్చుంటాడు శ్రీధర్. కొత్త సీఈఓ ఎవరో చెప్తారా? అని జ్యో అడుగుతుంది. ఎదురుగా మనిషిని పెట్టుకుని ఇంకా అడుగుతావేంటీ? అని శివన్నారాయణ అంటాడు. మరి అర్హతల మాటేమిటీ? అని జ్యో అడుగుతుంది. అన్ని అర్హతలు శ్రీధర్ కు ఉన్నాయని శివన్నారాయణ అంటాడు. థ్యాంక్స్ తాతా సీఈఓ అవ్వాలంటే రెండేసి పెళ్లిళ్లు చేసుకోవాలన్నమాట అని జ్యోత్స్న అనగానే శివన్నారాయణ సీరియస్ అవుతాడు.
జ్యో రాజీనామా
ఇదే మాట ఇంకెవరైనా అని ఉంటే నోటితో కాదు చేతితో సమాధానం చెప్పేవాణ్ని. ఇది పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేసే ప్లేస్ కాదు. ఓ బిజినెస్ మ్యాన్ గా శ్రీధర్ సక్సెస్ ఫుల్ పర్సన్. ఈ రోజు నుంచి జ్యోత్స్న గ్రూఫ్ ఆఫ్ రెస్టారెంట్స్ కు సీఈఓగా ఉంటారు. అలాగే కార్తీక్ ను కూడా ఈ బోర్డుకు ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమిస్తున్నానని శివన్నారాయణ అనగానే అందరూ చప్పట్లు కొడతారు. మాజీ సీఈఓను వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నానని శివన్నారాయణ అడుగుతాడు. జ్యోత్స్న సైన్ చేస్తుంది.
కార్తీక్ తండ్రిగా
ఇక్కడ నా అవసరం ఎవరికి లేదు లే మమ్మీ అని జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంది. సుమిత్ర, దీప, పారు కూడా వెళ్తారు. రూమ్ లో కత్తి చూసి కార్తీక్ ను దగ్గర పెట్టుకోమంటాడు శివన్నారాయణ. శ్రీధర్ ను సీఈఓ కుర్చీలో కూర్చోబెడతాడు. నువ్వు కార్తీక్ తండ్రివి అదే నీకున్న అర్హత అని శివన్నారాయణ అంటాడు. మామయ్య జ్యోత్స్న కూడా ఈ కంపెనీలో ఉండాలని శ్రీధర్ అడుగుతాడు.
కొడుకే గెలిపించాడని
ఈ రోజు నేను గెలిచా. నా కొడుకే నన్ను గెలిపించాడు. నేను తన కూతురికి అన్యాయం చేశానని నన్ను కొట్టి బయటకు గెంటేశారు మామయ్య. ఇప్పుడు అదే మనిషి నాకు విలువైన స్థానాన్ని ఇచ్చి కూర్చోబెట్టారు. నాలో మార్పునకు కారణం నువ్వే. తండ్రిని గెలిపించిన కొడుకు కథ ఇది. నా మీద పగను కాదు ప్రేమను పెంచుకున్నావు. శ్రీధర్ అనేవాడు లేడు. కార్తీక్ తండ్రి మాత్రమే ఉన్నాడు. నా కొడుకు నాకే ఓ కుటుంబాన్ని ఇచ్చాడు. కొడుకు కాకుంటే కాళ్లు పట్టుకునేవాణ్ని అని శ్రీధర్ ఫీల్ అవుతాడు.
వెళ్లిపోతున్న జ్యోత్స్న
ఇంట్లో కత్తిని ఎదురుగా పెట్టి నువ్వు ఏ ఉద్దేశంతో దీన్ని ఆఫీస్ కు పట్టుకోవచ్చని శివన్నారాయణ గట్టిగా అడుగుతాడు. ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి అని పారు అంటే, మరి ఫ్రూట్స్ ఏవని కార్తీక్ అడుగుతాడు. ఫ్రూట్స్ మర్చిపోయానని అంటుంది పారు. పారు చేతిలో నుంచి కత్తి లాగి పడేసి జీవితాలు తలకిందులవుతుంటే ఈ పంచాయతీ ఏంటీ అని జ్యో అడుగుతుంది. లగేజీ సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని జ్యో చెప్తుంది.
ఎవరిని అడిగి?
నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటీ అని సుమిత్ర అడుగుతుంది. మరి మేమంతా ఎవరు? అని దశరథ అడుగుతాడు. కెనడాలో నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడే వెళ్లిపోతానని జ్యో చెప్తుంది. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావని అడిగితే, మరి ఎవరిని అడిగి శ్రీధర్ మామయ్యను సీఈఓ చేశారని జ్యో సీరియస్ అవుతుంది. బిజినెస్ ను పర్సనల్ చేయకు అని శివన్నారాయణ అంటాడు. ఫ్యామిలీ అంతా బిజినెస్ లో ఉన్నప్పుడు బిజినెస్ లో కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయని జ్యో అంటుంది.
బయటకు గెంటేశారని
నాకు నీ అంత అనుభవం, వయసు లేదు కదా. అందుకే ఏదో ఒకటి మాట్లాడుతుంటా. నీ కూతురు నాకు పాఠాలు నేర్పిస్తుందిరా అని శివన్నారాయణ అంటాడు. పిల్లల మనసులను పెద్దవాళ్లు అర్థం చేసుకోవాలి. నన్ను శత్రువులా చూశారు. ఇప్పుడు నాకు ఇది కావాలని అడిగినా ఇచ్చేవాళ్లు ఎవరూ లేరు. నా మెడ పట్టుకుని తాత బయటకు గెంటేశారు. బావను సీఈఓ చేయాలనుకున్నారు. కానీ జరగలేదు. దీపను గెలిపించారు. కానీ తీసుకుందా? సీఈఓ పోస్టు పడేసి పక్కకు పోయింది. ఇంటి అల్లుణ్ని పిలిచి పోస్టులో కూర్చోబెట్టారని జ్యో రచ్చ చేస్తుంది.
నా కోసం ఎవరూ లేరు. కన్నతండ్రివి నువ్వే నన్ను గెలిపించకపోతే ఎవరు గెలిపిస్తారు? అని జ్యో దశరథను ప్రశ్నిస్తుంది. నీ ఓటు ఎవరికి వేసేవాడివి తాత? దేశం వదిలి వెళ్లిపోతా. బావను ఎండీ చేస్తారు. దీపను ఛైర్మన్ చేస్తారు. ఇక్కడే ఉండి ఘోరాలన్నీ చూడలేను. వెళ్లిపోతానని జ్యో అంటుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. నాకు మీ ప్రేమ కావాలి, మీతో ఉండే అవకాశం కావాలని శ్రీధర్ అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.














