కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సీఈవో పదవికి ఓటింగ్-క్లీన్ స్వీప్‌తో గెలిచిన దీప- చివర్లో ట్విస్ట్-కొత్త క్యారెక్టర్ ఎంట్రీ
కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్‌లో సీఈవో పదవికి దీపను కార్తీక్ ప్రపోజ్ చేస్తే ఏం అర్హతలు ఉన్నాయని వాదిస్తుంది జ్యోత్స్న. దీప చిన్నతనం నుంచి చేసిన బిజినెస్ మెళకువల గురించి చెబుతాడు కార్తీక్. సీఈవో పదవికి ఓటింగ్ పెడితే దీప క్లీన్ స్వీప్‌తో గెలిచేస్తుంది. దీపను సీఈవోగా ప్రకటిస్తారు.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కొత్త సీఈఓ గురించి బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. కొత్త సీఈఓగా దీపను ప్రపోజ్ చేస్తున్నట్లు కార్తీక్ చెబుతాడు. ఈ నిర్ణయం తనకు నచ్చలేదని దీప వెళ్లిపోతుంది. కార్తీక్ వెళ్లి దీపతో మాట్లాడుతాడు. ఇంటికోసం నువ్వు కూడా బలంగా నిలబడాలని చెప్పానుగా. ఇదంతా మనదేగా. మనమే కాపాడుకోవాలని దీపను వెనక్కి తీసుకొస్తాడు కార్తీక్.

ఇంకెంత డ్యామేజ్ జరుగుతుందో
సుమిత్రను అడ్డుపడమని పారిజాతం అంటే.. అక్కడ అంతా పెద్దవాళ్లు ఉన్నారు. చూసుకుంటారు అని సుమిత్ర అంటుంది. దీప నిలబడటానికి అర్హత, యోగ్యత ఉండాలని, ఆ రెండు లేని వాళ్లను ఎలా నిలబెడతారు. ఐదో తరగతి చదువుకున్న ఈ పల్లెటూరు మొద్దు సీఈఓ అయితే ఇంకెంత డ్యామేజ్ జరుగుతుందో అని జ్యోత్స్న అంటుంది.
పల్లెటూరు మొద్దు పదాన్ని కార్తీక్ ఖండిస్తే జ్యోత్స్న వెనక్కి తీసుకుంటుంది. దీప ఏం చేయగలదు. ల్యాప్‌టాప్ ఆపరేట్ చేయరాదు, ఇంగ్లీష్ రాదు. అయినా బోర్డ్ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేస్తారు అని జ్యోత్స్న అంటుంది. అసలు దీప ఎవరో తెలిస్తే తనకున్న అర్హతలు, యోగ్యత తెలుస్తుంది అని కార్తీక్ అంటాడు. దీప చిన్నతనం గురించి చెబుతాడు.
తన తండ్రి హోటల్‌లో పెట్టిన స్కీమ్స్, నడిపించిన తీరు అన్ని చెబుతాడు కార్తీక్. దివాళ తీసిన సత్యరాజ్ హోటల్ సక్సెస్ కావడానికి కారణం దీప. అవార్డ్ ఇద్దరం కలిసే తీసుకున్నాం. అది రావడానికి కారణం దీపే. ప్రతి విషయంలో దీపకు లోతైనా అవగాహన ఉంది. ఇవి సరిపోవా అని కార్తీక్ అంటాడు. సరిపోవు. నేను దీపను సీఈఓగా ఒప్పుకోను అని జ్యో అంటుంది.
ఈ గతి ఎందుకు పట్టించారు
మీరు చదువుకుని అన్ని హోదాలు ఉండి రెస్టారెంట్‌కు ఈ గతి ఎందుకు పట్టించారు అని రివర్స్ పంచ్ ఇస్తాడు కార్తీక్. ఎంపిక న్యాయంగా జరగాలంటే ఓటింగ్ పెడదామని, నీ ముందే చిటీలు రాసి పెడతాం. ఎవరికి ఎక్కువ ఓట్లు ఉంటే వాళ్లే గెలిచినట్లు అని శివ నారాయణ అంటాడు. జాగ్రత్తగా ఓట్లు వేయండి అని భరణితో అంటుంది జ్యోత్స్న.
ఈ ఓటింగ్‌లో దీప, జ్యోత్స్న, కార్తీక్, సుమిత్ర, పారిజాతంకు ఓట్ లేదు. కేవలం మనం ఏడుగురం మాత్రమే ఓటింగ్ వేయాలి. నా నిర్ణయం చివరిలో చెబుతాను. మీరంతా రాయండి అని శివ నారాయణ అంటాడు. సుమిత్ర వాలకం చూస్తుంటే దీపే గెలవాలని కోరుకుంటున్నట్లుందని పారు అనుకుంటుంది. శివ నారాయణ ఓట్లు లెక్కిస్తాడు.
ఆరు ఓట్లు యూనానమస్‌గా దీపకే పడతాయి. ఆరు ఓట్లు పడ్డాక నా ఓటుతో పనేముంది. నెక్ట్స్ సీఈఓ కార్తీక్ భార్య దీపే అని శివ నారాయణ ప్రకటిస్తాడు. అలా సీఈఓ ఓటింగ్‌లో దీప క్లీన్ స్వీప్ చేస్తుంది. అంతా చప్పట్లు కొడతారు. సొంత వాళ్లే మోసం చేశారు అని పారు అనుకుంటుంది. డాడీ నువ్వు కూడా దీపకే వేశావుగా. ఇది గుర్తు పెట్టుకుంటాను అని జ్యో అనుకుంటుంది.
ఇదే ఆఖరు రోజు
అంతా కంగ్రాట్స్ చెబుతారు. ఇదే నీకు ఆఖరి రోజు అని పారు, ఈ కేకలు మరికాసేపట్లో చావు కేకలు అవుతాయని జ్యో అనుకుంటారు. మా బావను చూసే నాకు ఓట్ వేశారు. మీ నమ్మకాన్ని నేను కాపాడుతాను. జ్యోత్స్న రెస్టారెంట్‌ను సమర్థవంతంగా చూసుకుంటాను అని దీప చెబుతుంటే అంతవరకు నువ్వుంటే కదా అని కత్తితో పొడిచేందుకు పారిజాతం లేస్తుంది.
అలా చెప్పలేకపోతున్నందుకు క్షమించండి అని చివరిలో ట్విస్ట్ ఇస్తుంది దీప. దాంతో పారు కూర్చుంటుంది. తాను సీఈఓగా ఉండలేనని, అందరిని క్షమించమని, నాకు ఈ స్థానం వద్దని అంటుంది దీప. నిజానికి ఇక్కడ నువ్వు ఉండాలి. నిన్ను రెండుసార్లు అవమానించారు. నిన్ను అవమానించిన స్థానంలో నేను ఉండలేను. నేను సీఈఓగా ఉంటే నీ స్థానం ఏంటీ అని దీప అంటుంది.
డ్రైవర్ పోస్టేగా అని జ్యో అంటుంది. విన్నావుగా.. నిన్వు అవమానించిన పోస్ట్‌లో నేనుండలేను, నాకు నువ్వు చాలు, ఇవేవి వద్దు అని దీప అంటుంది. దానికి షభాష్ అని శివ నారాయణ చప్పట్లు కొడతాడు. అర్హత లేకున్న అధికారం కోసం ఆశపడేవారు ఒకవైపు, అధికారం వచ్చిన ఆశపడని మరొకరు. కార్తీక్ నీ భార్యకు నువ్వైనా చెప్పు అని శివ నారాయణ అంటాడు.
కొత్త సీఈఓ ఎంట్రీ
భవిష్యత్తులో నింద పడాల్సి వస్తుందని ఈ నాటకం ఆడుతుందని పారిజాతం అంటుంది. నీ భార్యను అడ్డుపెట్టుకుని జ్యోత్స్నపై గెలిచావ్. ఇప్పుడు దీప సీఈఓగా చేయనంటే చేసేది కార్తీక్ గాడే కదా అని గొడవ చేస్తుంది పారిజాతం. దీప వద్దంటుంది కాబట్టి జ్యోత్స్ననే కూర్చొబెట్టండి అని పారు అంటుంది. ఒక్క ఓటు పడని జ్యోత్స్నను ఎలా కూర్చొబెడతావ్ అని శివ నారాయణ అంటాడు.
మరి సీఈఓ ఎవరు అని జ్యోత్స్న అంటే.. ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉందని శివ నారాయణ అంటాడు. మరోవైపు బ్లాక్ సూట్‌లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.














