కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:సీన్ రివ‌ర్స్‌-దీపనే సీఈఓ చేస్తాన‌న్న శివ‌న్నారాయ‌ణ‌-జ్యోకు దిమ్మ‌తిరిగే షాక్‌-క‌త్తితో పారు

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 10 ఎపిసోడ్ లో కొత్త సీఈఓ ఎవరు? అనే దాని చుట్టూ కథ తిరుగుతుంది. సుమిత్రను తీసుకుని ఆవేశంతో ఆఫీస్ కు వస్తుంది పారిజాతం.శివన్నారాయణతో మాట్లాడుతూ దీపను ఎవరు సీఈఓ చేయమన్నారని అడుగుతుంది. ఈ సలహా బాగుందని, దీపనే సీఈఓ చేస్తానని శివన్నారాయణ కౌంటర్ ఇస్తాడు.

Published on: Nov 10, 2025 7:20 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 10 ఎపిసోడ్ లో దీప తెచ్చిన వంటలను టేబుల్ పై సెట్ చేస్తుంటారు కార్తీక్, దీప. అప్పుడే సుమిత్రను పారిజాతం తీసుకొస్తుంది. మాట్లాడాలని శివన్నారాయణను పక్కకు తీసుకెళ్తుంది పారు. కొత్త సీఈఓ ఎవరండి? అని పారు అడిగితే, ఆఫీస్ విషయాలు నీకెందుకు అని అంటాడు శివన్నారాయణ.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దీపను సీఈఓ చేస్తారా?

దీపను సీఈఓ చేయమని బోర్డు చెప్పిందా? అని పారిజాతం అడుగుతుంది. దీపను సీఈఓ చేస్తామని ఎవరు చెప్పారని శివన్నారాయణ అంటాడు. అందరితో పాటు తెలియాల్సింది నాకు కాస్త ముందు తెలిసిందని పారు అంటుంది. జ్యోత్స్న చెప్పింది కాబట్టే అడుగుతుందని కార్తీక్ అంటాడు. శివన్నారాయణ కూడా అదే అంటాడు. సుమిత్ర అడగాల్సింది కానీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి ఆగిపోయిందని పారు అంటుంది.

సలహా నచ్చిందని

దీపను సీఈఓ చేస్తానని నువ్వేమైనా చెప్పావా తాతా? అని కార్తీక్ అడుగుతాడు. చూడు పారు, తాత సీఈఓ చేయాలనుకున్నది దీపను కాదు. ఆ మనిషి అని కార్తీక్ చెప్పబోతుంటే శివన్నారాయణ అడ్డుకుంటాడు. ఇప్పటివరకూ నేను అనుకున్న మనిషి వేరు, కానీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన సలహా నాకు బాగా నచ్చింది. నీ వల్లే దీపను సీఈఓ చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. ఇప్పటివరకూ వంటగదిని నడిపింది. ఇప్పటి నుంచి రెస్టారెంట్ ను నడుపుతుందని శివన్నారాయణ అంటాడు.

పారు కుట్ర

దీపను నువ్వే ఒప్పించాలని కార్తీక్ కు చెప్తాడు శివన్నారాయణ. చాలా థ్యాంక్స్ పారు, నీ వల్లే నా భార్య సీఈఓ అవుతుందని కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓ దీప అనే పేరు వినేందుకే అదిరిపోయిందని కార్తీక్ వెళ్తాడు. ఇప్పుడు ఎలా ఆపుతావని పారును జ్యో అడిగితే, ఆపడాలు లేవు పంపకాలే అని బొడ్డులో నుంచి కత్తి తీస్తుంది గ్రానీ. దీప సీఈఓ అయితే నీ భవిష్యత్ ఏంటో నాకు తెలుసు. దీపను సీఈఓ అనని ఈ కత్తితో ఒక్కటే పోటు దెబ్బకు చస్తుందని పారు కుట్ర పన్నుతుంది.

కాంచన దగ్గరకు శ్రీధర్

భోజనం చేస్తున్న కాంచన దగ్గరకు వస్తాడు శ్రీధర్. కార్తీక్ ఇంట్లో లేడండీ ఫోన్ చేసి మాట్లాడతారా? వెళ్తారా? అని అడుగుతుంది కాంచన. ఆకలిగా ఉంది నీతో కలిసి భోజనం చేస్తానని శ్రీధర్ అడిగితే కాంచన సరే అంటుంది. టమాట పచ్చడి రుచిని పొగిడేస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు శ్రీధర్. కావేరీతో భర్తను పంపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది కాంచన. ఆ జ్ణాపకాలను మర్చిపోలేనని కాంచన అంటుంది. నీకోసమే వచ్చానని శ్రీధర్ అంటాడు.

మూడు కాదు ఆరు ముళ్లు

నేను ఒంటరిగా లేను, ఏకాంతంగా ఉన్నా. నా కోసం వచ్చే వాళ్ల కోసం ఎదురు చూస్తున్నా. మీరు కార్తీక్ కోసం ఎప్పుడైనా రావొచ్చని చెప్పాను కదా అని కాంచన అంటుంది. నువ్వు స్నానం చేసేటప్పుడు కానీ నిద్ర పోయేటప్పుడు కానీ మంగళసూత్రం మెడలోనే ఉంటుందా? తీసేస్తావా?, అది సర్దుకున్నప్పుడు అయినా గుర్తుకు వస్తానా? అని అడుగుతాడు శ్రీధర్. అది కట్టినవాడు మూడు ముళ్లు కాదు ఆరు ముళ్లు వేశాడని కాంచన అనగానే శ్రీధర్ బాధపడి వెళ్లిపోతాడు.

జంటగా చూడాలని

మరోవైపు ఆఫీస్ లో అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. కార్తీక్, దీప కూడా తింటారు. ఇక్కడ ఒకరి గురించి ఆలోచించడానికి మరొకరు ఉన్నారు. కానీ నీ గురించి ఆలోచించడానికి ఎవరున్నారు? ఇక్కడ ఉన్న జంటల్లాగే నిన్ను కూడా చూడాలని అనుకుంటున్నానని జ్యోత్స్నతో సుమిత్ర అంటుంది. ఆఫీస్ లో దీప తినడం ఇదే మొదటిసారి అని పారు అంటుంది. ఇకపై రోజు ఇలాగే తింటుందని కార్తీక్ చెప్తాడు.

రక్తానికి వారసులు

బోర్డు మీటింగ్ లో అందరూ ఛైర్మన్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంటారు. కార్తీక్ సీఈఓ అవుతారని అనుకున్నాం కానీ ఆ అవకాశం లేదన్నారు. మరి నెక్ట్స్ సీఈఓ ఎవరు? అని బోర్డు మెంబర్ అడుగుతాడు. ఆయన రక్తానికి వారసులు ఎవరో వాళ్లే అవుతారు. నువ్వేం మాట్లాడవేంటీ సుమిత్ర అని పారు అంటుంది. ఎక్కడ ఎలా ఆలోచించాలో సుమిత్రకు తెలుసు. సీఈఓ పదవి అందుకునే అర్హత రక్తంలో కాదు సమర్థతలో ఉంది. అది ఎవరికి ఉంటే వాళ్లకే బాధ్యతలు. సుమిత్ర నాతో ఏమైనా చెప్పాలా? అని శివన్నారాయణ అడుగుతాడు.

శభాష్.. సుమిత్ర

లేదు మామయ్య. ఈ రెస్టారెంట్లను సంస్థగా తీర్చిదిద్దారు. దీని నీడలో ఎంతో మంది జీవితాలున్నాయి. ఆ ఆశలను నెరవేర్చే సత్తా ఉన్నవాళ్లే నాయకత్వం వహించాలి. అది ఎవరు అనే నిర్ణయం మీకంటే గొప్పగా ఎవరూ తీసుకోలేరని సుమిత్ర అంటుంది. శభాష్.. శివన్నారాయణ కోడలు అనిపించుకున్నావని శివన్నారాయణ సంతోషపడతాడు.

దీప పేరు

మై డియర్ బోర్డ్ మెంబర్స్ మనం ఫ్యామిలీ మెంబర్స్ లాగే కలిసి పని చేశాం. నేను సంస్థలో లేకపోయినా నా సేవలు, సలహాలు, సహకారం సంస్థకు ఎప్పుడూ ఉంటాయి. కానీ నేను సీఈఓగా ఉండే అవకాశం లేదు. అందుకే ఈ సంస్థ కొత్త సీఈఓగా నా భార్య దీపను ప్రపోజ్ చేస్తున్నానని కార్తీక్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

News/Entertainment/కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:సీన్ రివ‌ర్స్‌-దీపనే సీఈఓ చేస్తాన‌న్న శివ‌న్నారాయ‌ణ‌-జ్యోకు దిమ్మ‌తిరిగే షాక్‌-క‌త్తితో పారు
News/Entertainment/కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:సీన్ రివ‌ర్స్‌-దీపనే సీఈఓ చేస్తాన‌న్న శివ‌న్నారాయ‌ణ‌-జ్యోకు దిమ్మ‌తిరిగే షాక్‌-క‌త్తితో పారు