బ్రహ్మముడి నవంబర్ 15 ఎపిసోడ్: స్వప్నను నాసిరకం చీరతో పడగొట్టిన రాహుల్- కావ్యకు రౌడీల వెయ్యి- రాహుల్ చేతికి 20 లక్షలు

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 15 ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో రాహుల్‌ను బేరర్‌గా చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. రాహుల్ మాటలకు కావ్య నమ్మేస్తుంది. రాజ్ మాత్రం డౌట్ పడతాడు. కావ్యను నిజమైన రౌడీలు ఏడిపిస్తారు. రాజ్ వచ్చి వాళ్లను చితక్కొడతాడు. స్వప్నకు నాసిరకం చీర ఇచ్చి తన దారిలోకి తెచ్చుకుంటాడు రాహుల్.

Published on: Nov 15, 2025, 07:05:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యను రాజ్ క్యాండిల్ లైట్ డిన్నర్‌కు తీసుకెళ్తాడు. నన్ను అడక్కుండా నాకు ఇష్టమైంది తెలుసుకుని ఆర్డర్ తీసుకోవాలని కావ్య అంటుంది. ఇస్తాను అని బేరర్‌ను పిలిచి తనకు నచ్చింది ఆర్డర్ చేస్తాడు రాజ్. అవి మీకు నచ్చినవి అని చెప్పి రాజ్‌కు నచ్చిన మరో లిస్ట్ ఆర్డర్ చేస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 15 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 15 ఎపిసోడ్

పబ్లిక్‌లో ఫ్లర్ట్

మా శ్రీవారి ఇష్టాలే నా ఇష్టాలు అని కావ్య అంటుంది. కళావతి రోజుకో విధంగా నన్ను పడగొడుతున్నావ్ అని రాజ్ అంటే.. ఏంటీ పబ్లిక్‌లోనే ఫ్లర్ట్ చేస్తున్నావని కావ్య అంటుంది. పబ్లిక్‌లోనే రొమాన్స్ థ్రిల్లింగ్‌గా ఉంటుందని రాజ్ అంటాడు. బేరర్‌ను వాటర్ బాటిల్ తీసుకురమ్మని రాజ్ చెబితే రాహుల్ వస్తాడు. రాహుల్‌ను బేరర్‌గా చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

రాజ్, కావ్యలకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాడు రాహుల్. నా భార్యా బిడ్డలను పోషించుకోడానికి ఇంతకంటే ఆప్షన్ దొరకలేదు. మళ్లీ నన్ను నమ్మరని తెలిసినప్పుడు ఇదే కరెక్ట్. నిజాయితీగా చేసే పనులతోనే గౌరవం వస్తుందని నువ్వే చెప్పావ్‌గా రాజ్. నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీకు నాకు సంబంధం ఉన్నట్లు ఎవరికి చెప్పకండి. మీరు కస్టమర్స్ నేను బేరర్‌ను అంతే అని రాహుల్ డ్రామా ఆడి వెళ్లిపోతాడు.

రాహుల్‌లో ఎంత మార్పు వచ్చిందో చూశారా అని కావ్య అంటే.. నిజంగానే వచ్చిందనుకుంటున్నావా. నేను మాత్రం అనుకోవట్లేదు అని రాజ్ డౌట్ పడతాడు. మీరు చచ్చిన పామును అలాగే చంపుతారు అని చెప్పిన కావ్య హ్యాండ్ వాష్ చేసుకునేందుకు వెళ్తుంది. అక్కడ ముగ్గురు రౌడీలు కావ్యను టీజ్ చేస్తారు. రాజ్ ఏర్పాటు చేసిన డమ్మీ రౌడీలు అనుకుని కోపరేట్ చేస్తుంది.

కావ్యకు వెయ్యి

పాప లుక్ ఇచ్చిందిరా అంటూ కావ్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతారు. నువ్వు ఓకే అంటే మనమైపైదాం. ఏం పోరీ సరేనా అని రౌడీలు అంటారు. కావ్య విజిల్ కొట్టి రాజ్‌కు సైగ చేస్తుంది. మనం ఏర్పాటు చేసిన రౌడీలు అప్పుడే వచ్చారా అని అనుకున్న రాజ్ మనవాళ్లే మనవాళ్లే అంటాడు. దాంతో కావ్య నవ్వుతుంది. పాప గ్రీన్ సిగ్న్ ఇచ్చిందిరా. ఎక్కడికి పోదాం. హోటల్‌కు, మావోడి రూమ్‌కు అని రౌడీలు అంటారు.

కావ్య మీద చేయి వేస్తాడు రౌడీ. ఇదిగో వెయ్యి. తీసుకుని రా అని ఇంకొకడు అంటాడు. రేయ్ మీరు యాక్టింగ్ చేయాలిరా ఓవర్ యాక్టింగ్ కాదు. మిమ్మల్ని మా ఆయన డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేశాడు నా కోరికలు తీర్చడానికి అని కావ్య అంటుంది. జాక్‌పాట్‌రా పెళ్లాం కోరిక తీర్చడానికి మొగుడే పూనుకున్నాడు అని రౌడీ లాగుతాడు. ఏవండి అని కావ్య పిలవడంతో రాజ్ వస్తాడు.

తాను బుక్ చేసిన రౌడీల కాదా అని ఫోన్ చేసి క్లారిటీ తెచ్చుకుంటాడు. రాజ్ బుక్ చేసిన డమ్మీ రౌడీలు టైర్ పంచర్ అయి మధ్యలోనే ఆగిపోయినట్లు చెబుతారు. కావ్య నిజమైన రౌడీలు అని భయపడుతుంది. నా భార్య కోరిక తీర్చడానికి ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్లున్నాడు. కళావతి నీ కోరిక బలమైనదే అని రౌడీలను చితక్కొడతాడు రాజ్.

రౌడీలతో సారీ

కావ్య సంతోషిస్తుంది. కావ్యకు రౌడీలతో సారీ చెప్పిస్తాడు రాజ్. భర్త అంటే మీలా ఉండాలండి అని పక్కనున్న అమ్మాయి అంటుంది. దాంతో రాజ్‌ను హగ్ చేసుకుంటుంది కావ్య. తర్వాత కారులో తిరిగి ఇంటికి వెళ్తారు రాజ్, కావ్య. రాజ్ సంతోషంగా ఉంటే కావ్య బాధగా ఉంటుంది. రాహుల్ బేరర్‌గా సెర్వ్ చేస్తున్నాడని ఫీల్ అవుతుంది. రాహుల్‌కు ఏదైనా పని ఇచ్చి అది ఎంత పర్‌ఫెక్ట్‌గా చేస్తాడో చూడండి అని కావ్య అంటుంది.

రాహుల్ అంత ఈజీగా మారతాడని నేను అనుకోవట్లేదు అని రాజ్ అంటాడు. ఒక్కసారి చూడండి అని కావ్య అంటే.. సరేనని రాజ్ అంటాడు. మరోవైపు స్వప్న దగ్గరికి రాహుల్ వచ్చి గిఫ్ట్ తెచ్చినట్లు చెబుతాడు. కవర్ నుంచి చీర తీసి స్వప్నకు ఇస్తాడు. ఇలాంటి చీరలు కట్టవని తెలిసి నేను పని చేసిన డబ్బులతో ఇదే వచ్చిందని రాహుల్ అంటాడు.

ఏం పని చేశావని స్వప్న అడిగితే.. బేరర్‌గా చేసింది చెప్పి మళ్లీ డ్రామా స్టార్ట్ చేస్తాడు రాహుల్. నా కష్టార్జితంతో సంపాదించిన చీర ఇది. నీకు నచ్చకుంటే కట్టాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని డబ్బులు యాడ్ చేసి ఇంకోటి కొనిస్తాను అని రాహుల్ అంటాడు. దాంతో కరిగిపోయిన స్వప్న నిజాయితీగా ఏది చేసిన తక్కువ కాదు. నాకోసం ఇది చేశావ్ చాలు. థ్యాంక్స్ అని అంటుంది స్వప్న.

రాహుల్ దారికి స్వప్న

నేను నువ్వు మారావు అని నమ్ముతున్నాను. ఇది చాలు నాకు అని రాహుల్‌ను హగ్ చేసుకుంటుంది. మొదటి మెట్టు ఎక్కేశాను. పిచ్చిది నమ్మేసింది. నా దారికి వచ్చేసింది. ఇక నా రెండో మెట్టుని నా పెళ్లామే ఎక్కిస్తుంది అని రాహుల్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం అప్పు ఇందిరాదేవికి కాఫీ ఇస్తుంది. ప్రకాశంను టెండర్‌కు వెళ్లమని చెబుతాడు సుభాష్.

అక్కడ క్యాష్ డిపాజిట్ చేయాలి. రాజ్ ఇంకా రెడీ కాలేదని ఆగాను అని ప్రకాశం అంటాడు. స్వప్న చాలా సంతోషంగా వస్తుంది. అంత నాసీరకమైన చీర కట్టావేంటీ. చూడటానికి అస్సలు బాలేదని ధాన్యలక్ష్మీ అంటుంది.

తర్వాత టెండర్ గురించి చెప్పి 20 లక్షలు డిపాజిట్ చేయాలని, బ్యాంక్‌కు వెళ్లి డ్రా చేసుకురమ్మని రాహుల్‌కు చెక్ ఇస్తాడు రాజ్. అలా రాహుల్ చేతిలో 20 లక్షలు పెడతాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More