పాంచ్ మినార్ రివ్యూ.. 5 కోట్లు తీసుకొచ్చి తంటాలు.. రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ మూవీ నవ్వించిందా?
రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ సినిమా పాంచ్ మినార్. రామ్ కడుముల దర్శకత్వం వహించిన పాంచ్ మినార్ నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఒకరోజు ముందుగానే అంటే ఇవాళ (నవంబర్ 20) మీడియాకు పాంచ్ మినార్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి పాంచ్ మినార్ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: పాంచ్ మినార్

నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, రవి వర్మ, నితిన్ ప్రసన్న, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి
నిర్మాణ సంస్థ: కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్‌పీ
సమర్పణ: గోవింద రాజు
విడుదల తేది: 21 నవంబర్ 2025
ఇటీవల ఆహా ఓటీటీలోకి చిరంజీవ సినిమాతో అలరించిన రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ సినిమా పాంచ్ మినార్. రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహించారు.
ఇప్పటికే రిలీజైన పాంచ్ మినార్ సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నవంబర్ 21న పాంచ్ మినార్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. అయితే, రిలీజ్‌కు ఒకరోజు ముందే అంటే ఇవాళ (నవంబర్ 20) మీడియాకు పాంచ్ మినార్ స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి పాంచ్ మినార్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
కృష్ణచైతన్య అలియాస్ కిట్టు (రాజ్ తరుణ్) లవర్ ఖ్యాతి(రాశి సింగ్) ఒత్తిడి చేయడంతో సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేరినట్లు అబద్ధం చెబుతాడు. కానీ, డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చు అని క్యాబ్ డ్రైవర్‌గా చేస్తుంటాడు కిట్టు. ఒక రోజు కిట్టు క్యాబ్ ఎక్కిన ఇద్దరు కిరాయి హంతకులు అతని ముందే గ్యాంగ్‌స్టర్ చోటు (రవి వర్మ)ను హత్య చేస్తారు.
హత్య చేసినందుకు ఇద్దరు హంతకులకు రూ. 5 కోట్లు వస్తాయి. ఐదు కోట్లు తీసుకుని వెళ్తున్న క్రమంలో హంతకులు పోలీసులకు చిక్కుతారు. అదే సమయంలో ఐదు కోట్లు మాయం అవుతాయి.
ఆ తర్వాత ఏమైంది? ఆ 5 కోట్లు ఎవరు తీశారు? కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చింది? ఎవరు కిట్టుకు వచ్చిన కష్టాలు ఏంటీ? కిట్టు వెంట ఎందుకు కిరాయి హంతకులు, సీఐ (నితిన్ ప్రసన్న) ఎందుకు పడ్డారు? చివరికి ఐదు కోట్లు ఎవరికి దక్కాయి? పాంచ్ మినార్ అని టైటిల్‌కు కారణం ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
పాంచ్ మినార్ ఒక క్రైమ్ కామెడీ సినిమా. ఒక చిన్న రొటీన్ స్టోరీనే. కానీ, చూస్తున్నంత సేపు నవ్వించేలా ఉంటుంది. ఉద్యోగానికి బదులు ఈజీగా డబ్బు సంపాదించాలనుకునే ఓ యువకుడు ఎలాంటి కష్టాలు కొనితెచ్చుకున్నాడు, ఏ సమస్యలను ఎదుర్కొన్నాడు అన్నదే పాంచ్ మినార్ కథ.
క్రైమ్ కామెడీ జోనర్‌కు తగినట్లుగా సినిమాలో కామెడీతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓ వైపు నటీనటుల నుంచి కామెడీని రాబట్టుకున్న దర్శకుడు మరోవైపు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను బాగా వచ్చేలా రాసుకున్నాడు. అలాగే, ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఏం జరుగుతుందనే ఆసక్తి పెంచేలా సీన్స్ రావడం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కామెడీ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్
చోటు హత్య తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. పాంచ్ మినార్ పదం కిట్టు జీవితాన్ని ఎలా మార్చేసిందనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే ఫాస్ట్‌గా సాగుతుంది.
ప్రాణాలతో పాటు డబ్బుని దక్కించుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు బాగానే ఉంటాయి. అక్కడక్కడ వచ్చే కొద్దిపాటి టిస్టులు థ్రిలింగ్ కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. కొత్త రకమైన స్క్రీన్ ప్లేతో, మంచి టేకింగ్‌తో డైరెక్టర్ రామ్ కడుముల సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.
నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. విజువల్స్ బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. బీజీఎమ్ సీన్స్‌కు తగినట్లు హైలెట్‌గా నిలిచింది. ఇక రాజ్ తరుణ్ కిట్టు పాత్రలో ఆకట్టుకున్నాడు. రాశి సింగ్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది.
ఓవరాల్‌గా చెప్పాలంటే
మిగతా పాత్రలు నవ్విస్తూ థ్రిల్లింగ్ పంచాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే వల్గారిటీ లేకుండా ఫ్యామిలీతో కలిసి నవ్వుకునే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీనే పాంచ్ మినార్.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


