బ్రహ్మముడి నవంబర్ 22 ఎపిసోడ్: కొత్త కంపెనీ గురించి భార్యకు చెప్పిన రాహుల్- స్వప్న దొంగతనం- గోల్డ్, మనీ అక్రమంగా తరలింపు!
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 22 ఎపిసోడ్‌లో రాజ్ పెట్టే కొత్త కంపెనీ గురించి రాహుల్ మొత్తం తెలుసుకుంటాడు. కొత్త కంపెనీకి అక్రమంగా గోల్డ్, డబ్బు తరలిస్తున్నారని రాహుల్ అనుకుంటాడు. అదే విషయాన్ని స్వప్నకు చెబుతాడు. సరైన ఆధారం కోసం రాజ్ ల్యాప్‌ట్యాప్‌ను స్వప్న దొంగతనం చేస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇప్పటివరకు కంపెనీ లోగోనే డిజైన్ కాలేదు. మీరు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అని ఫోన్‌లో రాజ్ మాట్లాడుతుంటే వచ్చి కావ్య వింటుంది. ఇప్పటివరకు స్వరాజ్ గ్రూప్‌కు చేయలేని విధంగా డిజైన్స్, ఆఫీస్ అట్మాస్పియర్ భిన్నంగా ఉండాలంటున్నారు. దానికి టైమ్ పడుతుందని అవతలి వ్యక్తి అంటాడు.

స్వరాజ్ కంపెనీకి సంబంధం లేకుండా
స్వరాజ్ గ్రూప్ కంపెనీకి సంబంధించిన ఒక్కటి కూడా ఉండకూడదు. ఆ కంపెనీ ఈ కంపెనీ వేరు అన్నట్లుగా ఉండాలి అని రాజ్ చెబుతాడు. కొత్త కంపెనీ మేనేజరా అని కావ్య అంటే అవును అని రాజ్ అంటాడు. నాకు భయంగా ఉందండి. తాతయ్య గారు ఈ కంపెనీ సృష్టించారు. ఇది కాకుండా మీరు వేరే కంపెనీ పెడితే బాధపడతారేమో అని కావ్య అంటుంది.
ఇదంతా ఎందుకు చేస్తున్నామో తెలుసు కదా. మనసుకు నచ్చిందే చేస్తున్నాం. కంపెనీ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యేవరకు ఇంట్లో ఎవరికి తెలియకూడదు అని రాజ్ అంటాడు. రాహుల్‌కు ఆఫీస్‌లో ఫ్రీనెస్ ఇద్దామా. అక్క ఫీల్ అవుతుందని కావ్య అంటుంది. లేదు. ముందు పని తెలియాలి. రాహుల్ చేయగలడని నమ్మకం రావాలి అని రాజ్ అంటాడు.
మరోవైపు ఆఫీస్‌లో శ్రుతిని రాహుల్ పిలిచి మేనేజర్ గురించి అడుగుతాడు. ఆడిటింగ్ ఫైల్ గురించి అడిగితే.. రాగానే తీసుకొస్తాను అంటుంది. అవసరం లేదు నేను వెళ్లి తీసుకుంటాను అని రాహుల్ వెళ్తాడు. అక్కడ ఆర్ పేరుతో ఉన్న కొత్త కంపెనీ ఫైల్ చూస్తాడు రాహుల్. కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్‌మెంట్ గురించి రాజ్ నాకు ఒక్క మాట చెప్పలేదు అని రాహుల్ అనుకుంటాడు.
గోల్డ్ మనీ తరలింపు
వెళ్లి శ్రుతిని అడిగితే నాకు అవసరమా అని రాజ్ సర్ అన్నాడని చెబుతుంది. కొత్త కంపెనీకి ఇంత గోల్డ్, మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా. ఎవరికి తెలియకుండా రాజ్, కావ్య గూడుపుఠాని చేస్తున్నారా. ఏదో ఉంది అని రాహుల్ అనుకుంటాడు. ఇంతలో మేనేజర్ వస్తే కొత్త కంపెనీ గురించి అడుగుతాడు. రాజ్ సర్ కొత్త కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ తెలియదని మేనేజర్ అంటాడు.
కొత్త కంపెనీ గురించి అక్కడికి వెళ్లి తెలుసుకుంటే సరిపోతుంది అని రాహుల్ అనుకుంటాడు. సుభాష్, అపర్ణ వెడ్డింగ్ యానివర్సరీకి కావ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ తయారు చేస్తుంది. వాళ్లకు కొత్తగా ఏదైనా ఇవ్వాలని రాజ్ అంటాడు. మన పెళ్లి అనుకోకుండా అలా జరిగిపోయింది కదా. అందుకే మనం మళ్లీ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని అమ్మనాన్నకు చూపిస్తే అని రాజ్ అంటాడు.
సరే అయితే. మంచి బూత్ బంగ్లా తీసుకోండి. అక్కడే ఫస్ట్ నైట్ ప్లాన్ చేయండి. ముందు అయితే గిఫ్ట్ ప్యాక్ చేయండి అని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు కొత్త కంపెనీకి రాహుల్ వెళ్తాడు. మేనేజర్ రాహుల్‌ను ఆహ్వానిస్తాడు. ఇంకో పది రోజుల్లో అంతా పూర్తి అవుతుందని మేనేజర్ చెబుతాడు. స్వరాజ్ కంపెనీ నుంచి ఒక్క ముక్క ఇక్కడికి రాదు. అన్ని కొత్తగా చేస్తున్నారు అని మేనేజర్ అంటాడు.
లెక్కల్లో చూపించకుండా
ఓకే కంపెనీ సంబంధం లేకుండా ఎవరికి తెలియకుండా గోల్డ్, మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడు. లెక్కల్లో చూపించకుండా చాలా పెద్ద వ్యవహారమే చేస్తున్నావ్. ఇది చాలు నేనేంటో నీకు చూపిస్తాను అని రాహుల్ అనుకుంటాడు. మరోవైపు సుభాష్, అపర్ణ పెళ్లి రోజు ఏర్పాట్లు చేస్తుంటారు. అపర్ణను పెళ్లికూతురుగా తయారు చేస్తారు. కావ్య వచ్చి నగలు ఇస్తుంది.
ఇన్ని నగలు వేసుకుంటే పెళ్లి కూతురిలా కాదు అమ్మవారిలా ఉంటాను అని అపర్ణ అంటుంది. ఇవాళ నీ పెళ్లి రోజు కానీ కావ్యది మాత్రం పెత్తనం. తను ఏది చెబితే అది చేయాల్సిందే అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు సుభాష్‌కు బుగ్గ చుక్క పెట్టడానికి కల్యాణ్, రాజ్, ప్రకాశం ట్రై చేస్తారు. బలవంతంగా పెడతారు. రాహుల్ వస్తే రుద్రాణి మాట్లాడుతుంది.
రాహుల్ కోపంగా ఇరిటేట్ అయి వెళ్లిపోతాడు. అది స్వప్న చూస్తుంది. ఏమైందని రాహుల్‌ను స్వప్న అడుగుతుంది. నాకో విషయం తెలిసింది. అది తప్పో రైటో తెలియదు. కానీ, పూర్తిగా నిజం తెలుసుకోకుండా మాట్లాడితే తప్పు అవుతుంది. రాజ్, కావ్య కలిసి కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది స్వరాజ్ కంపెనీకి ఏమాత్రం సంబంధం లేకుండా చేస్తున్నారు. చాలా సీక్రెట్‌గా చేస్తున్నారు అని రాహుల్ చెబుతాడు.
స్వప్న దొంగతనం
చాలా మొత్తంగా ఆ కంపెనీకి గోల్డ్, మనీ ట్రాన్స్‌ఫర్ చేశారు. దానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. రాజ్‌ను అడిగితే తప్పు పడతావా అంటారు. మనకు ఇంకా స్ట్రాంగ్ ప్రూవ్స్ కావాలి. రాజ్ ల్యాప్‌ట్యాప్‌లో ఉంటాయి అని రాహుల్ అంటే.. వాటిని తెలియకుండా తీసుకొద్దాం అని స్వప్న అంటుంది.
నువ్ అనేది నిజమైతే రాజ్‌ను నిలదీద్దాం, లేకపోతే మళ్లీ సైలెంట్‌గా అక్కడే ల్యాప్‌ట్యాప్ పెడదాం అని స్వప్న వెళ్లిపోతుంది. అనుకుంది సక్సెస్ అని రాహుల్ సంతోషిస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


