బ్రహ్మముడి నవంబర్ 29 ఎపిసోడ్: కల్యాణ్, అప్పును కాపాడిన ప్రకాశం- రాజ్ కంపెనీకి రాహుల్ దెబ్బ- గుడిలో పడిపోయిన కావ్య
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 29 ఎపిసోడ్‌లో గుడి పేరు చెప్పి అప్పును పోలీస్ ఇన్వెస్టిగేషన్‌కు పంపించాలనుకుంటాడు కల్యాణ్. కానీ, బ్యాగ్‌లో ఏంటని కల్యాణ్‌ను ఆపుతుంది ధాన్యలక్ష్మీ. ఆఫీస్‌కు వెళ్లిన రాజ్‌కు తొలి దెబ్బ తగులుతుంది. తన మేనేజర్ రాహుల్ కంపెనీలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. గుడిలో కావ్య పడిపోతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అప్పు, కల్యాణ్ గుడికి వెళ్తామని చెబుతారు. బ్యాగ్‌లో ఏముందని కల్యాణ్‌ను ధాన్యలక్ష్మి అడుగుతుంది. కాసేపు తడబడిన కల్యాణ్ అందులో లిరిక్ పేపర్స్ ఉన్నాయని, దేవుడి ముందు పెట్టి సాంగ్స్ రాద్దామని తీసుకెళ్తున్నా అని కల్యాణ్ అంటాడు.

కాపాడిన ప్రకాశం
అంత ఎత్తుగా ఉంది. పేపర్స్ అంత ఎత్తుగా ఉంటాయా. ఇటు తీసుకురా చూస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. దేవుడి దగ్గరికి వెళ్తున్నారుగా. సమర్పించడానికి పట్టు వస్త్రాలు సమర్పిద్దామనుకుంటున్నారేమో . అది కూడా అడగాలా అని ప్రకాశం అంటాడు. అలా ప్రకాశం కాపాడటంతో కల్యాణ్, అప్పు వెళ్లిపోతారు.
మరోవైపు ఆఫీస్‌కు రాజ్, కావ్య వెళ్తారు. మేనేజర్ సతీష్ రిజైన్ చేశారని, రాహుల్ కంపెనీలోకి వెళ్లిపోయారని, ఇన్ఫార్మ్ కూడా చేయలేదని శ్రుతి చెబుతుంది. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు. ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సతీష్ లాంటి మేనేజర్ రాహుల్ దగ్గర ఉండటమే కరెక్ట్. రాహుల్‌కు ఉపయోగపడతాడు అని చెప్పిన రాజ్ మేనేజర్ పోస్ట్‌కు ఇంటర్వ్యూస్ పెట్టు. నేను ఇంటర్వ్యూ చేస్తానంటాడు.
మరోవైపు సతీష్ కాస్తా భయపడుతుంటాడు. నేను చెప్పినట్లు చేస్తే సింగిల్ పేమెంట్‌లో నీ జీవితాన్ని మార్చేస్తా. డబ్బున్నోడు ఎథిక్స్ పట్టించుకోవద్దు అని చెబుతాడు రాహుల్. దాంతో సరేనంటాడు మేనేజర్ సతీష్. రాజ్ డీల్ చేసిన పాత క్లైంట్స్ అందరిని పిలువు. ఒకరికి మరొకరు వస్తున్నట్లు తెలియకుండా పిలువు. రాజ్‌కు ఏం చెప్పాలన్నది నా హెడెక్ అని రాహుల్ అంటాడు.
అప్పు ఎంక్వైరీ
సరేనని సతీష్ అంటాడు. స్వరాజ్ సామ్రాజ్యంలో మొదటి ఇటుక కూల్చబోతున్నాను అని రాహుల్ నవ్వుతాడు. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో పాప మిస్సింగ్ ఫైల్ గురించి వెతికిస్తుంది అప్పు. పాప కనిపించకుండా పోయిం సంవత్సరం అవుతుంది. మూడు రోజులకే డ్రైనేజీలో శవమై దొరికింది. అది తన కూతురే అని తండ్రి అశోక్ తన పాపే అని చెప్పాడని కానిస్టేబుల్ చెబుతాడు.
కానీ, తల్లి రేణుక మాత్రం కాదని చెప్పింది. అన్ని వస్తువులు మ్యాచ్ అయ్యాయి, డీఎన్‌ఏ కూడా మ్యాచ్ అయిందని కానిస్టేబుల్ చెబుతాడు. సరే రేణుక ఇంటికి వెళ్దామని వెళ్తుంటే సీఐ కనిపించి డ్యూటీలో జాయిన్ అవడమేంటని అప్పును అడుగుతాడు. మీరే అన్నారుగా సర్ ఇన్వెస్టిగేట్ చేయమని, నేను అది సీరియస్‌గా తీసుకున్నాను అని చెప్పి అప్పు వెళ్లిపోతుంది.
మరోవైపు అన్ని అకౌంట్స్ సరిగ్గానే ఉన్నాయి. కానీ టర్నోవర్ ఎందుకు తగ్గుతుందో అర్థం కావట్లేదని రాజ్, కావ్య మాట్లాడుకుంటారు. సంక్రాంతి తర్వాత చాలా పండుగలు వచ్చాయి. కానీ, కొత్త డిజైన్స్ తయారు చేయలేదని, మనకు కొత్త క్లైంట్స్ రావట్లేదని రాజ్ అంటాడు. న్యూ ఇయర్‌కు అన్ని కొత్త డిజైన్స్ వెంటనే చేయించాలి అని రాజ్ అంటాడు.
చాలా ఖర్చు అవుతుంది
పాతవి కరిగించి మళ్లీ కొత్తవి చేయించాలి అంటే చాలా ఖర్చు అవుతుందని కావ్య అంటుంది. లేబర్ ఖర్చు భరిద్దాం. కానీ, తప్పదు. పోటీ తట్టుకోవాలంటే ఇలా చేయాల్సిందే అని రాజ్ అంటాడు. మరోవైపు రేణుక ఇంటికి అప్పు వెళ్తుంది. పాప గురించి అడిగి రికార్డ్ చేసుకుంటుంది అప్పు.
ఆ శవం మీ పాపది కాదని ఎలా చెబుతున్నారు అని అప్పు అడిగితే.. తల్లిని మేడమ్. నా కూతురు నాకు తెలియదా అని రేణుక అంటుంది. రేణుక భర్త గురించి అడిగితే ఊరేళ్లారని, రేపు వస్తారని చెబుతుంది రేణుక. కానిస్టేబుల్స్ వచ్చి పాప చనిపోయిందనే చెబుతున్నారు అని చెబుతారు. రిపోర్ట్స్‌లో విన్నదే చెబుతున్నారు. ఇంకాస్తా డెప్త్‌గా ఇన్వెస్టిగేట్ చేయాలని అప్పు అంటుంది.
మిస్సయిన మూడు రోజులకు పాప శవం దొరికింది. ఆ 3 రోజులు పాప ఎక్కడుంది. ఆ శవం పాపది కాకుంటే వేరేవాళ్లది. అది ఎవరు అనేది తెలుసుకోవాలి అని అప్పు అంటుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అంతా భోజనం చేస్తుంటారు. రాహుల్‌ను అంతా ఓకేనా అడుగుతాడు రాజ్.
రాహుల్ అబద్ధం
అంతా ఓకే. కానీ, మీ మేనేజర్ నా కంపెనీలోకి వచ్చి పని చేస్తానన్నాడు. సీనియర్ కదా అని నేను పెట్టుకున్నాను అని అబద్ధం చెబుతాడు రాహుల్. తర్వాత గుడిలో కావ్య స్పృహ తప్పి పడిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


