గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: తానే నగలు అమ్మానని ఒప్పుకున్న మనోజ్.. చితక బాదిన బాలు, సత్యం.. ప్రభావతికీ అదే గతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (నవంబర్ 28) ఎపిసోడ్ మొత్తం బాలు తెచ్చిన నిమ్మకాయ, దానిని చూసి మనోజ్, ప్రభావతి కంగారు పడటం, చివరికి బయటపారేయబోతూ దొరికిపోయి నిజం అంగీకరించడం చుట్టూ తిరిగింది.

Nov 28, 2025, 09:16:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 564వ ఎపిసోడ్ లో బాలు ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నిమ్మకాయను చూసి కంగారు పడిపోయి ఏదేదో ఊహించేసుకున్న మనోజ్, ప్రభావతి.. చివరికి దొంగతనాన్ని అంగీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మనోజ్ ను బాలు, సత్యం చితకబాదుతారు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: తానే నగలు అమ్మానని ఒప్పుకున్న మనోజ్.. చితక బాదిన బాలు, సత్యం.. ప్రభావతికీ అదే గతి
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: తానే నగలు అమ్మానని ఒప్పుకున్న మనోజ్.. చితక బాదిన బాలు, సత్యం.. ప్రభావతికీ అదే గతి

వణికిపోయిన మనోజ్, ప్రభావతి.. ధైర్యం చెప్పిన రోహిణి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (నవంబర్ 28) ఎపిసోడ్ మీనాకి బాలు నిజం చెప్పే సీన్ తో మొదలవుతుంది. ఆ స్వామీజీ తానేనని, వాళ్లతో నిజం చెప్పించడానికి ఇలా చేశానని అంటాడు. అటు బాలు నిమ్మకాయ దెబ్బకు మనోజ్, ప్రభావతి భయంతో వణికిపోతారు.

తమకు కాళ్లు, చేతులు పడిపోయినట్లు ఊహించేసుకుంటారు. దీంతో రోహిణి వచ్చి వాళ్లకు ధైర్యం చెబుతుంది. మీరు బాగానే ఉన్నారని, బాలు కావాలని ఇదంతా చేస్తున్నాడని అనడంతో ప్రభావతి వెళ్లిపోతుంది. కానీ మనోజ్ మాత్రం భయపడుతూనే ఉంటాడు.

శృతిలోనూ భయం.. అసలు నిజం చెప్పిన మీనా

ఇటు శృతి కూడా తన సీరియల్ కు స్క్రిప్ట్ రాసుకుంటూ ఆ నిమ్మకాయ గురించి ఆలోచించి భయపడుతుంది. రవి ధైర్యం చెప్పినా వినదు. అప్పుడే మీనా వాళ్ల గదికి వస్తుంది. ఆ నిమ్మకాయి, నీ నగల గురించి తాము మాట్లాడుకుంటున్నామని వాళ్లు ఆమెతో అంటారు. దీంతో మీనా అసలు నిజం చెబుతుంది.

మీ మనోజ్ అన్నతో నిజం చెప్పించడానికి బాలుయే ఇలా చేశాడని అంటుంది. అతని కళ్లలో భయం చూస్తుంటే మనోజే ఈ పని చేసినట్లు స్పష్టమవుతోందని అనుమానిస్తుంది మీనా. ఈ ట్విస్ట్ బాగుందని శృతి అంటుంది.

నిద్రలోనూ భయపడిపోయిన మనోజ్.. తిట్టిన రోహిణి

అటు మనోజ్ నిద్రలోనూ భయపడుతుంటాడు. తన కాళ్లు, చేతులు నిజంగానే పడిపోయినట్లు.. ప్రభావతి తనకు సేవలు చేస్తుంటే బాలు, రవి తనను ఆటపట్టిస్తున్నట్లు కలగంటాడు. ఉలిక్కిపడి లేస్తాడు. రోహిణినీ నిద్ర లేపడంతో ఆమె అతన్ని తిడుతుంది.

ఈ బుద్ధి దొంగతనం చేయకముందు ఉండాలి.. మీ తమ్ముడు కావాలనే ఇదంతా చేస్తున్నాడు.. భయపడకండి.. మీ కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి అని చెబుతుంది. అయినా మనోజ్ వినకపోవడంతో అతన్ని గదిలో నుంచి వెళ్లగొడుతుంది.

నిమ్మకాయ దగ్గరికి మనోజ్, ప్రభావతి..

దీంతో అర్ధరాత్రి ఇటు మనోజ్, అటు ప్రభావతి ఇద్దరూ నిమ్మకాయ దగ్గరికి వెళ్తారు. ఒకరిని చూసి మరొకరు ఉలిక్కి పడతారు. తనకు వచ్చిన కల గురించి తల్లితో మనోజ్ చెబుతాడు. తనకూ అలాంటిదే ఓ కల వచ్చిందని ప్రభావతి అంటుంది. అందులో తన కాళ్లు, చేతులు పడిపోయి చక్రాల కుర్చీకే పరిమితం కావడం.. బాలు, మీనాతోపాటు రోహిణి, శృతి కూడా తనను నానా మాటలు అన్నట్లు చెబుతుంది.

దీంతో ఇక ఆపెయ్ అమ్మ అంటూ మనోజ్ అంటాడు. ఏం చేద్దాం మరి అని ఆలోచిస్తుండగా కామాక్షి ఫోన్ చేస్తాను.. ఆమెకు చాలా మంది ఇలాంటి స్వామీజీలు తెలుసంటూ ఫోన్ చేస్తుంది ప్రభావతి. ఇంట్లో జరిగిన విషయం చెబుతుంది.

అయినా ఇద్దరిలోనూ భయం పోదు. ఆ నిమ్మకాయను తీసేసి ఎక్కడైనా పాతేద్దామని అనుకుంటారు. ప్రభావతి దానిని తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి బయటకు వెళ్తుండగా.. ఇంట్లో వాళ్లందరూ వస్తారు. దీంతో బాలు.. మనోజ్ ను పట్టుకొని నాలుగు పీకితే నగలను తానే అమ్మానని నిజం చెబుతాడు. దీంతో చెడ పుట్టావు కదరా అంటూ సత్యం కూడా అతన్ని కొడతాడు. అడ్డు వచ్చిన ప్రభావతిని కూడా పక్కకు తోసేస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ట్విస్ట్ సోమవారం (డిసెంబర్ 1) వచ్చే ఎపిసోడ్ పై ఎంతో ఆసక్తి రేపుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More