గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నిమ్మకాయకు దొరికిపోయిన ప్రభావతి, మనోజ్.. కాళ్లు, చేతులు పడిపోయి.. బాలు ఐడియా సూపర్

గుండె నిండా గుడి గంటలు గురువారం (నవంబర్ 27) ఎపిసోడ్ లో బాలు వేసే అదిరిపోయే ప్లాన్ కు మనోజ్, ప్రభావతి అడ్డంగా దొరికిపోతారు. వాళ్ల కాళ్లు, చేతులు పడిపోతాయి. నిమ్మకాయ ఓ ఊహించని పని చేసి పెట్టేలా కనిపిస్తోంది.

Nov 27, 2025, 07:28:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 563వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎలాగైనా నగల నిజం తెలుసుకోవాలని భావించే బాలు కొత్త ప్లాన్ వేస్తాడు. పార్కు ఫ్రెండ్ ను ఆరా తీయడంతోపాటు మంత్రించిన నిమ్మకాయ అంటూ కొత్త డ్రామా మొదలుపెడతాడు. దీంతో మనోజ్, ప్రభావతి దొరికిపోతారు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నిమ్మకాయకు దొరికిపోయిన ప్రభావతి, మనోజ్.. కాళ్లు, చేతులు పడిపోయి.. బాలు ఐడియా సూపర్
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నిమ్మకాయకు దొరికిపోయిన ప్రభావతి, మనోజ్.. కాళ్లు, చేతులు పడిపోయి.. బాలు ఐడియా సూపర్

బాలుని ఓదార్చిన మీనా.. కొత్త ప్లాన్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (నవంబర్ 27) ఎపిసోడ్ మౌనిక విషయంలో బాలు బాధపడటం, అతన్ని మీనా ఓదార్చే సీన్ తో మొదలవుతుంది. మీరు ఏ తప్పూ చేయలేదని, మౌనికను కూడా సంజూ ఏమీ అనలేదని బాలుతో చెబుతుంది.

దీంతో ఆ విషయం పక్కన పెట్టే బాలు మరోసారి నగల గురించి ఆలోచిస్తాడు. అది కచ్చితంగా మనోజ్ గాడే తీశాడని, ఈ విషయం తెలుసుకోవడానికి పార్క్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాల్సిందే అని అంటాడు. తాను అసలు విషయం తెలుసుకొని వస్తానని వెళ్తాడు.

మణికంఠ దగ్గరికి బాలు.. మనోజ్ గురించి ఆరా

మనోజ్ పార్క్ ఫ్రెండ్ మణికంఠ దగ్గరకు బాలు వెళ్తాడు. తాను సెకండ్ హ్యాండ్ కారు కొందామనుకుంటున్నానని, ఓ రూ.2 లక్షలు ఇవ్వాలని అతన్ని అడుగుతాడు. తన దగ్గర అంత డబ్బు లేదని, ఎవరికైనా రూ.లక్షకు మించి ఇవ్వలేనని మణికంఠ అంటాడు.

మరి మా అన్నయ్య మనోజ్ కు రూ.4 లక్షలు ఇచ్చావు కదా అని అడిగితే.. తాను ఇవ్వలేదని, ఎప్పుడో ఓసారి రూ.10 వేలు ఇస్తే దానిని వసూలు చేసుకోవడానికే కిందామీదా పడ్డానని, చివరికి అతని భార్య ఇచ్చిందని చెబుతాడు. దీంతో మణికంఠ.. మనోజ్ కు డబ్బు ఇవ్వలేని బాలు తెలుసుకుంటాడు.

మీనాకు అసలు నిజం చెప్పిన బాలు

వెంటనే మీనా దగ్గరికి వెళ్లి అసలు విషయం చెబుతాడు. మనోజ్ అప్పు చేయకపోతే ఆ రూ.4 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని మీనా అడుగుతుంది. నీ నగలు అమ్మితేనే వచ్చాయని బాలు అంటాడు. దీనిని ఎలా బయటపెట్టాలా అని బాలు ఆలోచిస్తుండగా.. తనకు తెలిసిన వ్యక్తి అంజనం వేస్తాడని, అతని దగ్గరికి వెళ్దామని మీనా అంటుంది. కానీ తాను అలాంటివి నమ్మనని అంటాడు. అయితే నువ్వు చెప్పిన విషయం నుంచే తనకు కొత్త ఆలోచన వచ్చిందని, ఈ నిజాన్ని మనోజ్ నోటి నుంచే చెప్పిస్తానని చెప్పి వెళ్లిపోతాడు.

మంత్రించిన నిమ్మకాయ అంటూ బాలు డ్రామా

ఇంటికి వెళ్లే ముందు బాలు ఓ నిమ్మకాయ, దారం, విభూతిలాంటివి దారిలో కొంటాడు. ఇంట్లోకి వెళ్లే ముందు బయటే తన ముఖానికి విభూతి రాసుకొని, నిమ్మకాయకు దారం కట్టి.. కుంకుమ, పసుపు రాస్తాడు. ఆ తర్వాత ఇంట్లోకి శరభ శరభ అంటూ ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూసి అందరూ షాక్ తింటారు. ఏంటీ అవతారం అని అడుగుతారు. తాను ఓ స్వామీజీ దగ్గరకు వెళ్లానని, ఇంట్లో నగల మాయం గురించి చెబితే ఈ మంత్రించిన నిమ్మకాయ ఇచ్చాడని అంటాడు.

దీనిని పూజ గదిలో ఉంచితే.. ఆ నగలు మాయం చేసిన వారికి 24 గంటల్లో కాళ్లు, చేతులు పడిపోతాయని చెబుతాడు. ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయంటూ మనోజ్, ప్రభావతి వైపు నిమ్మకాయ చూపిస్తూ వెళ్తాడు. దీంతో ఆ ఇద్దరూ భయంతో వణికిపోతారు. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడటం అని రోహిణి అంటున్నా కూడా ఆ ఇద్దరూ అలాగే వణికిపోతుంటారు. తర్వాత బాలు ఆ నిమ్మకాయను దేవుడి ముందు పెడతాడు.

రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆ నిమ్మకాయ దగ్గరికి వెళ్తారు మనోజ్, ప్రభావతి. దానిని తీసి బయటపడేద్దామని అనుకుంటారు. కానీ తమకేమైనా జరిగితే ఎలా అని భయపడతారు. ఆ తర్వాత ఉదయం ఇద్దరి కాళ్లు, చేతులు, నోరు పడిపోతాయి. ఇంట్లో వాళ్లు వాళ్లకు సేవలు చేస్తూ ఉంటారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More