గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు చెంప పగలగొట్టిన మౌనిక.. మనోజ్ నగలు అమ్మేశాడని తెలుసుకున్న బాలు.. కొత్త ప్లాన్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (నవంబర్ 26) ఎపిసోడ్ మొత్తం మౌనిక, సంజూ, బాలు చుట్టూ తిరిగింది. అయితే చివర్లో మనోజ్ గురించి బాలు తెలుసుకునే నిజంతో ముగియడం ఆసక్తి రేపుతోంది. ఇంకా ఏం జరిగిందో చూడండి.

Nov 26, 2025, 07:57:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 562వ ఎపిసోడ్ లో మౌనికను పుట్టింటి వాళ్లకు దూరంగా ఉండాలని సంజూ వార్నింగ్ ఇవ్వడం, మౌనిక గురించి మీనా నిజం దాచడం, మనోజ్ రూ.4 లక్షల గురించి బాలు నిజం తెలుసుకోవడంలాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు చెంప పగలగొట్టిన మౌనిక.. మనోజ్ నగలు అమ్మేశాడని తెలుసుకున్న బాలు.. కొత్త ప్లాన్
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు చెంప పగలగొట్టిన మౌనిక.. మనోజ్ నగలు అమ్మేశాడని తెలుసుకున్న బాలు.. కొత్త ప్లాన్

బాలు చెంప పగలగొట్టిన మౌనిక

గుండె నిండా గుడి గంటలు బుధవారం (నవంబర్ 26) ఎపిసోడ్ గుడిలో సంజూపై బాలు చేయి చేసుకునే సీన్ తో మొదలైంది. తన చెల్లిని నానా మాటలు అనడంతో బాలు తట్టుకోలేక సంజూని చితకబాదుతాడు. అది చూసి మౌనిక తన అన్న అని కూడా చూడకుండా బాలు చెంప పగలగొడుతుంది.

ఇది తనకు, తన భర్తకు సంబంధించిన విషయం అని, ఆయనను కొట్టడానికి నువ్వు ఎవరు అని బాలుని మౌనిక నిలదీస్తుంది. ఆ తర్వాత ఆమెను బలవంతంగా తీసుకొని సంజూ వెళ్లిపోతాడు.

బాలుకి క్లాస్ పీకిన ప్రభావతి..

ఇటు అల్లుడిని బాలు కొట్టడంతో ఇంట్లో బాలుని ప్రభావతి నిలదీస్తుంది. అతన్ని రవి, మనోజ్, రోహిణి కూడా తప్పుబడతారు. అయితే శృతి మాత్రం సరైన పనే చేశాడని అంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే అని, అలా అని ఇంటి అల్లుడిపై చేయి చేసుకుంటావా అని బాలుని ప్రభావతి అడుగుతుంది. అల్లుడుగారు ఆమెను బాగా చూసుకుంటారని చెబుతుంది. కానీ మీనా మాత్రం మౌనిక గురించి తెలుసుకోకుండా మాట్లాడకండని అంటుంది.

మౌనిక అక్కడ ఏమైనా కష్టాలు పడుతుందా? మాకు తెలియనది నీకేమైనా తెలుస్తే చెప్పమ్మా అని సత్యం అడుగుతాడు. అది మీరే మౌనికను అడిగి తెలుసుకోండి మామయ్య అంటూ తనకు తెలిసిన నిజాన్ని మీనా దాచి పెడుతుంది. ఏది ఏమైనా బాలు చేసింది తప్పే.. ఇక నుంచి ఇలాంటి పనులు చేయకు అని బాలుకు చెప్పి సత్యం వెళ్లిపోతాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత నిజం చెప్పకుండా తాను తప్పు చేస్తున్నానా అని మీనా బాధపడుతుంది.

మౌనికకు సంజూ, నీలకంఠం స్ట్రాంగ్ వార్నింగ్

అటు ఇంటికి వెళ్లిన తర్వాత మౌనికకు సంజూ, నీలకంఠం స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. తమను అవమానించిన వాళ్ల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావని నీలకంఠం అడుగుతాడు. అది నీ అన్న అయినా, నాన్న అయినా ఈ ఇంటి వాళ్లను అవమానిస్తే వాళ్లకు నువ్వు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తాడు. అటు సంజూ కూడా మరోసారి నీ పుట్టింటి వెళ్తే బాగుండదని వార్నింగ్ ఇస్తాడు.

కాదంటే ఇప్పుడే తాళిబొట్టు ఇక్కడ పెట్టి వెళ్లిపో అంటూ బ్యాగు తీసుకొస్తాడు. కానీ మౌనిక మాత్రం మీరు తిట్టినా, కొట్టినా తన ఇల్లు ఇదే అని, తాను ఎక్కడికీ వెళ్లనని అంటుంది. ఆ ఇంటికి వెళ్లడం కాదు కదా.. కనీసం వాళ్లతో ఫోన్ కూడా మాట్లాడకూడదని సంజూ స్పష్టం చేస్తాడు. దీంతో మౌనిక సరే అంటూ లోపలికి వెళ్తుంది.

కూతురి గురించి సత్యం ఆందోళన..

మరోవైపు కూతురి గురించి సత్యం ఆందోళన చెందుతూ ఉంటాడు. మీనా నిజం దాస్తుందా అని అనుమానిస్తాడు. అప్పుడే ప్రభావతి వచ్చి ఓసారి మౌనికకు ఫోన్ చేసి మాట్లాడమని చెబుతుంది. సరే అని అతడు ఫోన్ చేస్తాడు. మౌనిక ఫోన్ మోగడంతో సంజూ చూస్తాడు. నిన్ను చంపేశామేమో అని మీ నాన్న ఫోన్ చేస్తున్నాడా.. ఫోన్ కూడా మాట్లాడొద్దని చెప్పాను కదా అని అంటాడు.

కానీ ఇప్పుడు తాను ఫోన్ మాట్లాడకపోతే బాలు అన్నయ్య వస్తాడని, అతడు వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అని మౌనిక అనడంతో సరే అని ఫోన్ మాట్లాడినిస్తాడు. అల్లుడు గారు ఏమైనా అన్నారా అని ప్రభావతి అడిగితే.. ఆయనకు బాలు అన్నయ్య మీద కోపం తప్ప తనను ప్రేమగా చూసుకుంటారని అబద్ధం చెబుతుంది. అందుకే బాలుకి నువ్వు కూడా దూరంగా ఉండమని ప్రభావతి అనడంతో కూతురికి చెప్పే మాటలేనా అవి అని సత్యం మందలిస్తాడు.

మనోజ్ గురించి తెలుసుకున్న బాలు

ఇక తనకు రూ.4 లక్షలు అప్పు ఇవ్వాలంటూ మనోజ్ పార్క్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు బాలు. అంత డబ్బు తన దగ్గర లేదని అంటాడు. మరి మా అన్నయ్యకు ఇచ్చావు కదా అని అంటే.. తాను ఇవ్వలేదని అంటాడు. దీంతో బాలుకి విషయం అర్థమవుతుంది. ఆ డబ్బు నీ నగలు అమ్మే తెచ్చాడని మీనాతో బాలు అంటాడు. మనోజ్ భండారం బయటపెట్టడానికి మరో కొత్త ప్లాన్ తో ఇంటికి వస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More