గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నగల గురించి తెలిసిన నిజం.. మనోజ్ చెంప పగలగొట్టిన సత్యం.. ఆవేశంతో ఊగిపోయిన మీనా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (నవంబర్ 19) ఎపిసోడ్ లో మనోజ్ చెంప పగలగొడతాడు సత్యం. అతడు ఫర్నీచర్ విషయంలో ఎదుర్కొన్న నష్టం గురించి బాలు సినిమా చూపిస్తాడు. అటు మీనా కూడా ఆవేశంతో ఊగిపోతుంది.

Nov 19, 2025, 07:53:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 557వ ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. నగల విషయంలో ప్రభావతి బుకాయించినా.. చివరికి మనోజ్ నిజ స్వరూపాన్ని బాలు బయటపెట్టడంతో సత్యం అతని చెంప పగలగొడతాడు. దీంతో ప్రభావతి కూడా దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నగల గురించి తెలిసిన నిజం.. మనోజ్ చెంప పగలగొట్టిన సత్యం.. ఆవేశంతో ఊగిపోయిన మీనా
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నగల గురించి తెలిసిన నిజం.. మనోజ్ చెంప పగలగొట్టిన సత్యం.. ఆవేశంతో ఊగిపోయిన మీనా

ప్రభావతి, మనోజ్‌లను తిట్టిన మీనా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (నవంబర్ 19) ఎపిసోడ్ లో నగల గురించి ప్రభావతి దబాయించే సీన్ తో మొదలవుతుంది. తన పుట్టింటి వాళ్లపై నింద వేయడంతో మీనా ఆవేశంగా ప్రభావతి, మనోజ్ లను తిడుతుంది. మరొకరి సొమ్ముకు ఆశపడే బుద్ధి తన పుట్టింటి వాళ్లకు లేదని, తండ్రి, తమ్ముడి సొమ్ము మింగే అలవాటు లేదని పరోక్షంగా మనోజ్ ను మీనా తిడుతుంది.

మీ ఆయనకు కారును ఆ బంగారం అమ్మే కొనుంటావని రోహిణి అంటే.. శృతి అడ్డుపడి ఆమెను తిడుతుంది. పోలీసులును పిలుద్దాం అంటుంది. దీంతో మనోజ్ భయపడతాడు. అయినా ప్రభావతి మాత్రం బుకాయిస్తూనే ఉంటుంది. మీనా పుట్టింట్లోనో లేదంటే మీ అమ్మగారే గిల్టు నగలు చేయించారేమో అనడంతో సత్యం ఆమెను కొట్టడానికి చేయొత్తుతాడు. దీంతో అందరూ షాకవుతారు. అయితే రెండు రోజుల్లో ఆ నగల దొంగను కనిపెడతానని బాలు శపథం చేసి వెళ్తాడు.

మనోజ్‌ను తిట్టిపోసిన ప్రభావతి..

దీంతో ప్రభావతి కంగారు పడుతుంది. లోనికి వెళ్లిన తర్వాత ఇక ఆ నగల సంగతి వదిలెయ్యమని మనోజ్ అనడంతో అతన్ని తిట్టిపోస్తుంది. నిన్ను కన్నప్పుడు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు నొప్పులతో బాధపడ్డాను.. పుట్టినప్పటి నుంచీ నన్ను వేధిస్తూనే ఉన్నావు..

నీవల్లే నా గుండె ఆగిపోతుంది.. ఈ గుండె ఇంకొన్నాళ్లు కొట్టుకోవాలంటే ముందు ఆ నగలు తీసుకురా.. బాలుగాడు వదిలేయడు.. వెంటనే ఆ నగలు చేయించు అని ప్రభావతి అతన్ని నానా మాటలు అంటుంది. అయినా మనోజ్ మాత్రం ఏమీ పట్టనట్లే ఉంటాడు.

ఆవేశంతో ఊగిపోయిన మీనా.. బాలుని నానా మాటలు

ఇటు కిచెన్ లో మీనా ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది. పాత్రలను ఎత్తేస్తూ ఉండటంతో బాలు భయపడుతూ ఆమె దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని అంటాడు. మా పుట్టింటి వాళ్లపై నింద వేస్తోంది మీ అమ్మగారు.. బంగారం గురించి కడిగేస్తానని ఆవేశంతో ఊగిపోయారు.. ఆమె మా పుట్టింటి వారిపై నింద వేస్తున్నప్పుడు ఏం చేశారని బాలుపై మీనా మండిపడుతుంది. దీంతో అతడు షాక్ తింటాడు. కచ్చితంగా ఇది మనోజ్ పనే.. అది వాడి నోటి నుంచే చెప్పిస్తాను.. వాటిని కొన్న షాపు నుంచి ఫోన్ చేసినట్లుగా మాట్లాడితే అసలు విషయం తెలుస్తుంది.. ఆ పని శృతితో చేయిద్దామని బాలు అనడంతో మీనా సరే అంటుంది.

రవి, శృతి, బాలు, మీనా ప్లాన్

బాలు, మీనా కలిసి రవి రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ రవి, శృతి, బాలు, మీనా కలిసి ప్లాన్ చేస్తారు. ఆవేశంతో ఊగిపోతున్న బాలును శాంతపరిచి అసలు ప్లాన్ ఏంటో చెప్పమని మీనా అంటుంది. ఇది కచ్చితంగా ఆ మనోజ్ గాడి పనే.. వాడి కోసం అమ్మ నగలను మాయం చేసి ఉంటుంది.. అది కనిపెట్టడంలో నీ సాయం కావాలని బాలు అనడంతో శృతి సరే అంటుంది. కాస్త గొంతు మార్చి మనోజ్ కు ఫోన్ చేయాలని, షాపు నుంచి మాట్లాడుతున్నట్లుగా చెబితే వాడు కచ్చితంగా నోరు జారుతాడని బాలు చెబుతాడు. సరే అని శృతి రెడీ అవుతుంది.

మనోజ్‌ను నిలదీసిన రోహిణి

ఇటు షాపులో నిద్రపోతున్న మనోజ్ దగ్గరికి రోహిణి వచ్చి అతన్ని కొట్టి లేపుతుంది. దీంతో అతడు భయంతో నాకేం తెలియదు.. ఆ రూ.4 లక్షలు నేను మింగలేదు అని అంటాడు. దీంతో రోహిణికి అనుమానం వచ్చి నిలదీస్తుంది. ఆ నగలకు నీకు సంబంధం ఉందా అని అడుగుతుంది. ఇంట్లో జరిగింది గుర్తు చేసుకుంటూ నిద్రపోయానని, అందుకే అలా ఉలిక్కి పడ్డానని అంటాడు. అప్పుడే రోహిణికి చింటూ.. మనోజ్ కు శృతి ఫోన్ చేయడంతో ఇద్దరూ ఎవరి దారిన వాళ్లు వెళ్తారు.

ఆ తర్వాత మనోజ్ గురించి నిజం తెలిసిపోయిందంటూ ఇంటికి వచ్చిన బాలు.. షాపులో అతడు ఫర్నీచర్ ఎలా మోసపోయాడో సినిమా చూపిస్తాడు. పోలీస్ స్టేషన్ లో మనోజ్ ఉన్న వీడియో అతనికి దొరుకుతుంది. అది చూసి మనోజ్ చెంప పగలగొడతాడు సత్యం. ఆ నగలను నువ్వే మాయం చేశావా అని అడుగుతాడు. దీంతో అతడు ప్రభావతి వైపు చూస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More