బ్రహ్మముడి నవంబర్ 28 ఎపిసోడ్: స్వరాజ్ గ్రూపును తొలి దెబ్బ కొట్టిన రాహుల్.. రాజ్, కావ్యలకు షాక్ ఇచ్చిన మేనేజర్..

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (నవంబర్ 28) ఎపిసోడ్ లో ఆఫీసుకు వెళ్లిన రాజ్, కావ్యలకు తొలి షాక్ తగులుతుంది. స్వరాజ్ గ్రూప్ ను దెబ్బకొట్టడానికి రాహుల్ అప్పుడే కుట్ర మొదలుపెడతాడు. ఇటు ఇంట్లో అప్పు కారణంగా కొత్త రచ్చ మొదలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

Published on: Nov 28, 2025, 07:06:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 890వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఓవైపు రాహుల్, మరోవైపు రాజ్, కావ్య ఆఫీసుకు వెళ్లగా.. అప్పుని డ్యూటీకి తీసుకెళ్లడానికి కల్యాణ్ నానా తంటాలు పడతాడు. అయితే అటు స్వరాజ్ గ్రూప్ ను దెబ్బకొట్టడానికి అప్పుడే రాహుల్ కుట్రలు మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి నవంబర్ 28 ఎపిసోడ్: స్వరాజ్ గ్రూపును తొలి దెబ్బ కొట్టిన రాహుల్.. రాజ్, కావ్యలకు షాక్ ఇచ్చిన మేనేజర్..
బ్రహ్మముడి నవంబర్ 28 ఎపిసోడ్: స్వరాజ్ గ్రూపును తొలి దెబ్బ కొట్టిన రాహుల్.. రాజ్, కావ్యలకు షాక్ ఇచ్చిన మేనేజర్..

ఆఫీసుకెళ్తామన్న రాజ్, కావ్య.. అప్పును డ్యూటీకి వద్దన్న ధాన్యం

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (నవంబర్ 28) ఎపిసోడ్ ఇంట్లో వాళ్లందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న సీన్ తో మొదలవుతుంది. రాహుల్ ను ఇక కొత్త కంపెనీకి వెళ్లమని సుభాష్, ప్రకాశ్ చెబుతారు. అటు రాజ్ కూడా తాను, కావ్య ఆఫీసుకు వెళ్తామంటారు. కావ్య ఎందుకు అని అపర్ణ అడిగినా.. ఇంట్లో బోర్ కొడుతోందట అని రాజ్ అంటాడు.

ఇదే అదును అనుకొని కల్యాణ్ కూడా తాను రైటింగ్ మొదలుపెడతానని, అప్పు డ్యూటీకి వెళ్తుందని అంటాడు. దీంతో ధాన్యలక్ష్మి మండిపడుతుంది. డెలివరీకి ఎక్కడికీ వెళ్లేది తేల్చి చెప్పడంతో అప్పు, కల్యాణ్ సైలెంట్ అయిపోతారు.

బాధపడిన అప్పు.. వార్నింగ్ ఇచ్చిన కావ్య

బయటకు వచ్చిన అప్పు బాధపడుతుంటే కల్యాణ్ ఓదారుస్తాడు. ఆ పాప మిస్సింగ్ కేసును ఎలాగైనా పరిష్కరించాలని అనుకుంటున్నట్లు అప్పు చెబుతుంది. అది కరెక్టే కానీ అమ్మ ఈ విషయం చెబితేనే మండిపడుతోంది కదా అని కల్యాణ్ అంటాడు. అయితే ఆమెకు చెప్పకుండా వెళ్దామని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది. అలా అయితే ఇంట్లో రచ్చ మొదలవుతుందని అంటుంది.

అప్పుకు రాజ్ సలహా.. చెప్పకుండా వెళ్లమని..

కానీ రాజ్ ఎంట్రీ ఇచ్చి అలా ఏమీ జరగదని అంటాడు. అప్పు డ్యూటీకి వెళ్తే పిన్నికి చెప్పి వెళ్లాల్సిన పని లేదని చెబుతాడు. ఆమెకు తెలియకుండా వెళ్లి.. ఆ కేసును పరిష్కరించి వచ్చెయ్ అని సలహా ఇస్తాడు. కానీ కావ్య ఆందోళన చెందుతుంది. అయినా రాజ్ పట్టించుకోకుండా అప్పూకి డ్యూటీకి వెళ్లమని చెబుతాడు.

రాజ్‌ రొమాన్స్.. కావ్య క్లాస్..

గదిలోకి వచ్చిన తర్వాత రాజ్ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతాడు. కానీ కావ్య మాత్రం అతనికి క్లాస్ పీకుతుంది. పిన్నికి తెలియకుండా వెళ్లమని ఎందుకు చెప్పారని నిలదీస్తుంది. దాని గురించి ఎందుకు అంతలా కంగారు పడటం.. ఏమైనా జరిగితే మనం ఉన్నాం కదా అని అంటాడు. ఇప్పుడు మనం అంటారు.. ఆ తర్వాత భారం మొత్తం తనపై వేస్తారని కావ్య అంటుంది. అక్కడితో ఆ విషయాన్ని ఇద్దరూ వదిలేసి ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతారు.

ఆఫీసుకు రాజ్, రాహుల్.. గుడికి కల్యాణ్, అప్పు

ఇటు రాహుల్ తొలిసారి తన సొంత కంపెనీకి వెళ్తుండటంతో రుద్రాణి చాలా సంతోషంగా కనిపిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లు ఆమెను ఆటపట్టిస్తారు. అటు రాహుల్ ఆఫీసుకు వెళ్లడానికి కిందికి వస్తాడు. ఇకనైనా ఇప్పటి వరకూ చేసినట్లుగా కాకుండా మంచిగా పని చేసుకొని కొత్త కంపెనీని డెవలప్ చేసుకోమని ఇందిరా దేవి అతనికి చెబుతుంది. అతడు సరే అంటూ ఆమె ఆశీర్వాదం తీసుకొని వెళ్లిపోతాడు. ఇటు రాజ్, కావ్య కూడా రెడీ అయి ఆఫీసుకు వెళ్తుంటే కావ్యను జాగ్రత్తగా చూసుకోమని అందరూ రాజ్ కు చెబుతారు.

వాళ్లు వెళ్లిపోవడంతో కల్యాణ్, అప్పు మెల్లగా కిందికి వస్తుంటారు. బ్యాగులో అప్పు యూనిఫాం పెట్టుకొని కల్యాణ్ వస్తాడు. మీరెక్కడికి వెళ్తున్నారని ధాన్యం అడిగితే గుడికి వెళ్తున్నామని అబద్ధం చెబుతారు. ఆ తర్వాత మరి బ్యాగు ఎందుకు, అందులో ఏముంది అని ఆమె అడుతుంది. దీంతో ఇంట్లో మరో రచ్చ జరగడానికి రంగం సిద్ధమవుతుంది.

మరోవైపు ఆఫీసుకు వెళ్లిన రాజ్, కావ్యలకు షాక్ తగులుతుంది. మేనేజర్ మూర్తి రిజైన్ చేసి రాహుల్ కంపెనీకి వెళ్లిపోయాడని రాజ్ పీఏ చెబుతుంది. అటు స్వరాజ్ గ్రూపులో నుంచి తొలి ఇటుకను కూల్చే సమయం వచ్చిందని మేనేజర్ తో రాహుల్ అంటాడు. స్వరాజ్ గ్రూపు క్లైంట్స్ అందరూ రేపు తన ముందు ఉండాలని ఆర్డర్ ఇస్తాడు. అంతటితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More