బ్రహ్మముడి నవంబర్ 27 ఎపిసోడ్: పాప మిస్సింగ్ కేస్- సీఐ ఛాలెంజ్-కడుపుతోనే అప్పు రీ ఇన్వెస్టిగేట్-సుభాష్ అపర్ణకు రాహుల్ భయం
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 27 ఎపిసోడ్‌లో ఐస్ క్రీమ్ కోసం కల్యాణ్‌ను బయటకు తీసుకెళ్తుంది అప్పు. అక్కడే తన పోలీస్ స్టేషన్ ఉండటంతో అందులోకి వెళ్తుంది. రేణుక అనే ఆవిడ తన పాప మిస్సింగ్ గురించి చెబుతు ఏడుస్తుంది. అది చూసి చలించిపోయిన అప్పు వెళ్లి సీఐని అడిగితే ఆ పాప చనిపోయిందని చెబుతాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కల్యాణ్‌ను అప్పు కారులో రాత్రి తీసుకెళ్తుంది. నాకు నరకం చూపిస్తున్నట్లు ఉందని కల్యాణ్ అంటాడు. ఐస్‌క్రీమ్ తినాలని ఉందని అప్పు అంటుంది. ఇదివరకు ఇలాగే తిని అమ్మతో తిట్లు తినిపించావ్ అని కల్యాణ్ అంటాడు.

మోజు తీరిపోయింది
నువ్వెందుకు తీరుస్తావులే. అదే మా బావ అయితే బకెట్ లిస్ట్ పూర్తి చేశాడు. నీకు నా మీద మోజు తీరిపోయింది అని అప్పు అంటుంది. సరే ఆపు. తినిపిస్తా. కానీ చిన్నది అని కల్యాణ్ అంటాడు. అప్పు ఐస్‌క్రీమ్ తింటుంది. అక్కడే అప్పు వాళ్ల పోలీస్ స్టేషన్ ఉంటుంది. అలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తానని వెళ్తుంది అప్పు. అక్కడ ఒకావిడ పాప కోసం ఏడుస్తుంటుంది.
కానిస్టేబుల్ తిడుతుంటాడు. అప్పుడే వచ్చిన అప్పు కానిస్టేబుల్‌ను తిడుతుంది. శాంతంగా విని సాయం చేయాలని కానీ అలా అరిస్తే ఎలా అని బుద్ధి చెబుతుంది అప్పు. అసలు సమస్య ఏంటని ఆవిడను అడుగుతుంది అప్పు. సంవత్సరం నుంచి మా పాప కనిపించట్లేదు. రోజు వస్తున్నాను. అడిగితే కసురుకుంటున్నారు అని ఆవిడ ఏడుస్తూ చెబుతుంది.
సీఐని అడిగితే ఏం చెప్పట్లేదు. ఈ కేసును పట్టించుకోవద్దని చెప్పారు అని కానిస్టేబుల్ చెబుతాడు. సీఐతో నేను మాట్లాడుతాను అని లోపలికి వెళ్తుంది అప్పు. ఊరికే అలా వచ్చాను చెప్పిన అప్పు పాప మిస్సింగ్ కేస్ గురించి అడుగుతుంది. ఆ పాప చనిపోయింది. ఆమెది భ్రమో, పిచ్చో అర్థం కావట్లేదు. ఇన్వెస్టిగేషన్‌లో అన్ని ఆధారాలు ఆ పాప చనిపోయినట్లు చూపించాయి. ఆవిడ భర్త కూడా కన్ఫర్మ్ చేశాడు. కానీ, ఈవిడ మాత్రం పాప బతికే ఉందని, తీసుకురమ్మని గొడవ చేస్తుందని సీఐ చెబుతాడు.
రీ ఇన్వేస్టిగేట్ చేస్తే
ఆవిడ చెప్పే మాటల్లో నిజముందని తెలుస్తుంది. మరోసారి కేసు రీ ఇన్వెస్టిగేట్ చేస్తే సాయం చేసినట్లుంటుంది అని అప్పు అంటుంది. అయితే నువ్వు చేయి, లాంగ్ లీవ్‌లో ఉన్నావుగా. అది క్యాన్సిల్ చేసుకుని కేసు రీ ఇన్వెస్టిగేట్ చేసి ఆమెకు న్యాయం చేయి. ఇదే కేసు గురించి మాట్లాడాలనుకుంటే దయచేసి వెళ్లిపో అని సీఐ అంటాడు. దాంతో అప్పు వెళ్లిపోతుంది.
అప్పు వెళ్తుంటే ఆవిడ ఆపుతుంది. మరోవైపు నీ బకెట్ లిస్ట్ అయిపోయిందిగా అని రాజ్ అంటే.. ఒక చిన్న ఆఖరి కోరిక మిగిలిపోయిందని కావ్య అంటుంది. ఇంతలో సుభాష్, అపర్ణ వస్తారు. రాహుల్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం మాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. రాహుల్ మీద నమ్మకం లేదని ఇద్దరు అంటారు. రాహుల్ మన కింద ఉండటం వల్లే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడనిపించింది అని రాజ్ అంటాడు.
రాహుల్‌కు బాధ్యతలు అప్పగించిన నేను దూరంగా ఉండి చూసుకుంటాను అని రాజ్ అంటాడు. ఇది కాదండి మనం అనుకుంది. రాహుల్‌ను పూర్తిగా వదిలేస్తేనే మంచిదని కావ్య అంటుంది. మరి రాహుల్ వల్ల కంపెనీకి నష్టం వస్తే అని సుభాష్ అంటే.. ఒక సంవత్సరం ఆదాయం పోయిందనుకుందాం మావయ్య అని కావ్య అంటుంది. ఇన్నేళ్లుగా ఇంట్లో ఉన్నా వాళ్లను మార్చడానికి కంటే ఎక్కువ కాదు అని కావ్య అంటుంది.
రాహుల్, రుద్రాణి మారే ఛాన్స్
రాహుల్ మారితే రుద్రాణి గారు కూడా మారుతారు. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. అందరికి సమాన హక్కులు ఉంటాయి అని కావ్యఅంటుంది. సరే వాళ్లిద్దరు మారుతారు అంటే అంతకంటే ఇంకేంకావాలి అని అపర్ణ, సుభాష్ వెళ్లిపోతారు. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చినావిడ తన పాప సిరిని పట్టుకుని ఏడుస్తుంది.
నువ్వు తప్పిపోయావంటే ఎవరు నమ్మలేదమ్మా. చివరికి నా ప్రాణాలే పోయాయమ్మా.. అంటూ ఏడుస్తుంది. పాప అంటూ అప్పు ఒక్కసారిగా నిద్రలోనుంచి ఉలిక్కిపడి లేస్తుంది. నీళ్లు ఇచ్చి ఏమైందని కల్యాణ్ అడుగుతాడు. ఇందాక చెప్పాను కదా రేణుక అనే ఆవిడ వాళ్ల పాప గురించి ఏడుస్తుందని. ఆ పాప చనిపోయినట్లు ఏదో పీడకల వచ్చిందని అప్పు అంటుంది.
ఆవిడ పాప కోసం పడుతున్న బాధ చూస్తే పాప బతికే ఉందనిపిస్తుంది. మా పోలీసులు ఎక్కడో ఏదో మిస్టేక్ చేసి ఉండొచ్చు కదా. ఏదో మూల ఆ పాప బతికే ఉందని నాకు అనిపిస్తుంది. నేను ఆ కేసును రీ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నేనే ఆ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేద్దామనుకుంటున్నాను అని అప్పు అంటుంది. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్. నువ్వు ఇలా చేస్తానంటే ఎవరు ఒప్పుకోరని కల్యాణ్ అంటాడు.
గిల్టీతో బతకలేను
ఒకవేళ ఆ పాప నిజంగా బతికి ఉండి మనవల్ల మరణిస్తే ఆ గిల్టీతో బతకలేను. ఎలాగైనా సరే ఈ కేసు టేకప్ చేయాలి అని గట్టిగా చెబుతుంది అప్పు. సరే ట్రై చేద్దాం. పడుకో అని కల్యాణ్ సర్ది చెబుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


