మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధా దాస్ త్రికాల- సీనియర్ హీరోయిన్ ఆమని కీలక పాత్ర- రిలీజ్ ఎప్పుడంటే?

హీరోయిన్ శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా త్రికాల. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా డిసెంబర్‌లో త్రికాల మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Published on: Nov 24, 2025 8:32 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్‌తో వచ్చే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జోనర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే బ్యూటిపుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా త్రికాల.

మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధా దాస్ త్రికాల- సీనియర్ హీరోయిన్ ఆమని కీలక పాత్ర- రిలీజ్ ఎప్పుడంటే?
మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధా దాస్ త్రికాల- సీనియర్ హీరోయిన్ ఆమని కీలక పాత్ర- రిలీజ్ ఎప్పుడంటే?

త్రికాల నటీనటులు

రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ‘త్రికాల’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీకి మణి తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నారు. త్రికాల సినిమాలో శ్రద్దా దాస్‌తోపాటు మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, సీనియర్ హీరోయిన్ ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

త్రికాల ట్రైలర్‌కు రెస్పాన్స్

ఇప్పటికే రిలీజ్ చేసిన త్రికాల ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మాస్టర్ మహేంద్రన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, నటుడు అజయ్ విశ్వరూపం, సినిమాలోని డైలాగ్స్, శ్రద్దా దాస్ మేకోవర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌తోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.

అర్జున్ రెడ్డి, యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్

ఒక్క ట్రైలర్‌తోనే ఏకంగా నార్త్ ఇండియాలోనూ ‘త్రికాల’ బిజినెస్ జరిగిపోయింది. ప్రస్తుతం అన్ని చోట్లా ‘త్రికాల’ మీద మంచి డిమాండ్ ఏర్పడింది. త్రికాల సినిమాకు అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించడం విశేషం.

స్పెషల్ అట్రాక్షన్‌గా

ప్రస్తుతం స్పిరిట్, పూరి-విజయ్ సేతుపతి లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హర్షవర్దన్ రామేశ్వర్ 'త్రికాల’ కథ నచ్చి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో ఆయన సౌండింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండనుందని మేకర్స్ ఆశాభావావ్య వ్యక్తం చేశారు.

ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ

‘త్రికాల’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం పూర్తి అయ్యాయి. ఇక మరో వైపు ప్రమోషన్స్ కార్యక్రమాల్ని కూడా పెంచే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత బజ్‌ను క్రియేట్ చేయాలని టీమ్ ప్రయత్నిస్తోంది. డిసెంబర్ నెలలో త్రికాల సినిమా థ్రియేట్రికల్ రిలీజ్ కానుంది.

అల్లరి నరేష్ సినిమాతో

ఇదిలా ఉంటే త్రికాల సినిమాకు షాజిత్ హుమాయున్ బీజీఎమ్ అందించగా.. కెమెరా వర్క్‌ను పవన్ చెన్నా నిర్వర్తిస్తున్నారు. డైరెక్టర్ మణి తెల్లగూటి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఇకపోతే అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్.

శ్రద్ధా దాస్ సినిమాలు

ఆ తర్వాత ఆర్య 2 సినిమాలో శాంతి పాత్రలో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిపుల్ శ్రద్ధా దాస్. హిందీలో జిద్ సినిమాతో కూడా అలరించిన శ్రద్ధా దాస్ గుంటూర్ టాకీస్, ఏక్ మినీ కథ, డార్లింగ్, పున్నమి రాత్రి, డిక్టేటర్, నాగవల్లి వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. గతేడాది పారిజాత పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రద్ధా దాస్.

News/Entertainment/మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధా దాస్ త్రికాల- సీనియర్ హీరోయిన్ ఆమని కీలక పాత్ర- రిలీజ్ ఎప్పుడంటే?
News/Entertainment/మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధా దాస్ త్రికాల- సీనియర్ హీరోయిన్ ఆమని కీలక పాత్ర- రిలీజ్ ఎప్పుడంటే?