ఈ వారం 2 రకాలుగా బిగ్ బాస్ నామినేషన్స్- సీజన్‌లోనే బిగ్గెస్ట్ ఫైట్- ఆమె తప్పా అందరూ నామినేట్- హీరోయిన్‌కు అధికంగా ఓట్లు!
బిగ్ బాస్ 9 తెలుగు 12వ వారం డిఫరెంట్‌గా నామినేషన్స్ జరిగాయి. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌ను ఇవాళ (నవంబర్ 24) ప్రసారం చేయనున్నారు. అయితే, ఈ సీజన్‌లోనే ఇద్దరి కంటెస్టెంట్స్ ఫైట్ పెద్దగా ఉండనుందని సమాచారం. ఒక్క బ్యూటీ తప్పా అందరు ఈ వారం నామినేట్ అయ్యారు. మరి వారెవరో చూద్దాం.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 12వ వారానికి చేరుకుంది. గత వారం అంతా ఫ్యామిలీ వీక్ సాగింది. అలాగే, వీకెండ్స్‌లో కంటెస్టెంట్స్‌కు రిలేటివ్స్, సెలబ్రిటీలు వచ్చి హింట్స్ ఇచ్చి వెళ్లారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 9 పన్నెండో వారం నామినేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

రెండు రకాలుగా నామినేషన్స్
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే, వీరికి ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ రెండు రకాలుగా జరిగాయి. ఒకటి బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిలో ప్రైవేట్‌గా, మరోటి అందరి ముందు ఓపెన్‌గా కారణాలు చెప్పి నామినేట్ చేయడం. బ్యాలెట్ విధానంలో కెమెరాలను చూస్తూ పాయింట్స్ చెప్పి ఒకరిని నామినేట్ చేయాలి.
మరోకరిని అందరి ముందే వారి ఫొటోను ఫైర్‌లో వేసి నామినేట్ చేయాలి. ఈ విధానంలోనే కల్యాణ్ పడాల, డీమాన్ పవన్ మధ్య బిగ్గెస్ట్ ఫైట్ జరిగిందని సమాచారం. ఈ గొడవ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో బిగ్గెస్ట్ ఫైట్ అని పలువురు రివ్యూవర్స్‌కు లీకైనట్లుగా తెలుస్తోంది. నామినేషన్స్‌లో పాయింట్స్ చెప్పే క్రమంలో ఈ గొడవ జరిగిందని, మధ్యలో రీతూ కూడా వెళ్లిందని టాక్.
ముగ్గురి మధ్య గొడవ
ఆ గొడవ ముగ్గురి మధ్య జరిగి మరింత రచ్చగా మారిందని అంటున్నారు. ఇక ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌ను ఇవాళ (నవంబర్ 24) ప్రసారం చేయనున్నారు. అయితే, నేటి బిగ్ బాస్ తెలుగు 9 నవంబర్ 14 ఎపిసోడ్‌లో కేవలం ప్రైవేట్ నామినేషన్స్ మాత్రమే చూపించనున్నట్లు టాక్.
ప్రైవేట్‌గా తనూజను నామినేట్ చేసిన భరణి శంకర్ ఓపెన్‌గా దివ్య నిఖితాను చేశాడు. అదే దివ్య ప్రైవేట్‌గా భరణిని, ఓపెన్‌గా తనూజ గౌడను నామినేట్ చేసింది. అలాగే, తనూజ పుట్టస్వామి ప్రైవేట్‌గా డీమాన్ పవన్‌ను, ఓపెన్‌గా దివ్యను నామినట్ చేసింది. ఈ క్రమంలో పవన్, తనూజ మధ్య ఫైట్ జరిగింది.
అత్యధిక నామినేషన్ ఓట్లు ఆమెకే
కల్యాణ్ సీక్రెట్‌గా కమెడియన్ సుమన్ శెట్టిని, ఓపెన్‌గా డీమాన్ పవన్‌ను నామినేట్ చేశాడు. ఈ సమయంలోనే కల్యాణ్ వర్సెస్ పవన్ చోటు చేసుకుంది. ఇక డీమాన్ పవన్ ప్రైవేట్‌గా కల్యాణ్‌ను, ఓపెన్‌గా ఇమ్మాన్యూయెల్‌ను నామినేషన్స్‌లోకి పంపించాడు. సుమన్ ప్రైవేట్‌గా సంజనను, ఓపెన్‌గా తనూజను నామినేట్ చేశాడు.
ఇమ్మాన్యూయెల్ సీక్రెట్‌గా డీమాన్ పవన్‌ను, ఓపెన్‌గా తనూజను నామినేషన్స్‌లోకి పంపించాడు. రీతూ చౌదరి సీక్రెట్‌గా సంజన గల్రానిని, ఓపెన్‌గా కల్యాణ్ పడాలను నామినేట్ చేసింది. ఇలా రెండు దశల్లో జరిగిన ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో అత్యధికంగా ఓట్లు సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామికి పడ్డాయి.
ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది
ఇకపోతే బిగ్ బాస్‌లో ఈ వారం 8 మంది నామినేట్ అయ్యారు. అంటే ఒక్కరు తప్పా ఈ వారం అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి కెప్టెన్ అయిన కారణంగా బిగ్ బాస్ తెలుగు 9 పన్నెండో వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


