బిగ్ బాస్ స్టేజీపై సమంత టాపిక్ తెచ్చిన నాగ చైతన్య- చైతూ కాళ్లు ఎంతో తెల్లగా ఉంటాయన్న రీతూ చౌదరి- తండ్రికొడుకుల సందడి!

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోకి హీరో నాగ చైతన్య అడుగుపెట్టాడు. దాంతో బిగ్ బాస్ స్టేజ్ అంతా సందడిగా మారింది. బిగ్ బాస్ 9 తెలుగు వీకెండ్ స్టేజీపై తండ్రి కొడుకులు నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు మెరిశారు. సమంత టాపిక్ తెచ్చిన నాగ చైతన్య బిగ్ బాస్ తెలుగు 9 నవంబర్ 16 ఎపిసోడ్ హైలెట్‌గా నిలవనుంది.

Published on: Nov 16, 2025, 12:49:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఈపాటికే నిఖిల్ నాయర్ ఎలిమినేటర్ కాగా ఇవాళ్టీ ఎపిసోడ్‌లో గౌరవ్ గుప్తా ఎలిమినేషన్‌ను చూపించనున్నారు. ఇదిలా ఉంటే, వీకెండ్‌లోని సండే రోజున నాగార్జున కంటెస్టెంట్స్‌కు వినోదం పంచుతాడని తెలిసిందే.

బిగ్ బాస్ స్టేజీపై సమంత టాపిక్ తెచ్చిన నాగ చైతన్య- చైతూ కాళ్లు ఎంతో తెల్లగా ఉంటాయన్న రీతూ చౌదరి- తండ్రికొడుకుల సందడి! (Star Maa)
బిగ్ బాస్ స్టేజీపై సమంత టాపిక్ తెచ్చిన నాగ చైతన్య- చైతూ కాళ్లు ఎంతో తెల్లగా ఉంటాయన్న రీతూ చౌదరి- తండ్రికొడుకుల సందడి! (Star Maa)

బిగ్ బాస్‌లో తండ్రికొడుకులు

ఈ క్రమంలోనే ఇవాళ్టీ (నవంబర్ 16) ఎపిసోడ్‌లో హీరో నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ స్టేజీపై తండ్రికొడుకులు నాగార్జున, నాగ చైతన్య ఇద్దరి ప్రజెన్స్ అదిరిపోయింది. హైలెస్సా అనే పాటతో నాగ చైతన్య బిగ్ బాస్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య రావడం చూసి కింగ్ నాగ్ షాక్ అయ్యాడు.

నాకు చెప్పకుండా ఎప్పుడు చేశావ్

"మీకు తెలుసు నాకు యాక్టింగ్‌తోపాటు రేసింగ్ అంటే చాలా ఇష్టమని. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఒక ఫెస్టివల్ స్టార్ట్ అయింది. నేను హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌కు ఓనర్‌ని" అని నాగ చైతన్య చెప్పాడు. "ఫెంటాస్టిక్ ఇది నాకు చెప్పకుండా ఎప్పుడు చేశావ్" అని నాగ్ అన్నాడు. "చేశానులే" అని చైతూ అన్నాడు.

మొన్నటిదాకా నేను అన్నావ్

తర్వాత నాగ చైతన్యను హౌజ్‌మేట్స్‌కు చూపించారు. "హాయ్ చైతూ గారు పిచ్చి మీరంటే నాకు" అని రీతూ చౌదరి అంది. "మొన్నటిదాకా నేను అన్నావ్" అని నాగార్జున అన్నాడు. "సర్ మీరు మీరే సర్" అని రీతూ అంది. "ఇది చీటింగ్. ఇప్పుడు మీరు మీరే అంటారేంటీ" అని నవ్వుతూ అన్నాడు నాగ చైతన్య.

ఎంత తెల్లగా ఉంటాయో

"చైలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటో చెప్పు" అని నాగార్జున అడిగాడు. "చైతూ గారి కాళ్లు ఉంటాయి సర్.. ఎంత తెల్ల...గా.. ఉంటాయో సర్. శిల్పంలా చెక్కినట్లు ఉంది" అని రీతూ అంటే.. "హాలో రీతూ ఆ శిల్పం చెక్కింది నేను కూర్చో" అని నవ్వించాడు నాగార్జున.

సమంత టాపిక్

"కార్తీక్ అని పేరు ఉందిగా. నా బాయ్‌ఫ్రెండ్ పేరు కార్తీక్ ఉండాలని కొన్నిరోజులు వెతికాను" అని ఏ మాయ చేశావే సినిమాలోని చైతూ పాత్ర గురించి చెప్పింది రీతూ చౌదరి. "కానీ, నీ పేరు జెస్సీ (సమంత పాత్ర) కాదు కదా" అని నాగ చైతన్య పంచ్ ఇచ్చాడు. అలా బిగ్ బాస్ స్టేజీపై సమంత టాపిక్ తీశాడు నాగ చైతన్య.

మీ మీద నమ్మకం ఉంది

దాంతో అంతా నవ్వేశారు. తర్వాత బొమ్మల పేర్లు చెబితే కంటెస్టెంట్స్ వాటి నేమ్స్‌ను అల్భాబెట్‌లో పేర్చాలని టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో "నీ స్పెల్లింగ్ మీద నమ్మకం ఉందిగా" అని నాగ చైతన్య అంటే.. "సర్ నాకు మీ మీద నమ్మకం ఉంది" అని ఇమ్మాన్యూయెల్ కామెడీ చేశాడు. ఇలా కామెడీగా నేటి బిగ్ బాస్ నాగ చైతన్య ఎపిసోడ్ ప్రోమో సాగింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More