బిగ్ బాస్ ఓటింగ్‌లో ఫేక్ ఓట్లు- మళ్లీ రీసెట్ చేసిన బీబీ యూనిట్- ఇప్పుడు ఎవరిది ఏ స్థానం? ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ పదో వారానికి చేరుకుంది. ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే, ఎప్పుడు ఎలిమినేషన్‌ను నిర్ణయించే బిగ్ బాస్ ఓటింగ్‌ను ఆపించేశారు నిర్వాహకులు. ఫేక్ ఓట్లు పడిన కారణంగా బిగ్ బాస్ ఓటింగ్‌ను రీసెట్ చేయించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూద్దాం.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో పదో వారం కూడా అయిపోయేందుకు వచ్చేసింది. ఇప్పటికీ బిగ్ బాస్ హౌజ్ నుంచి 9 మంది ఎలిమినేట్ అయి వెళ్లిపోగా రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్‌తో, అనారోగ్యం కారణంగా ఆయేషా జీనత్ హౌజ్‌ను వీడి వెళ్లారు.

ప్రస్తుతం 11 మంది
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరికి పదో వారం నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. బిగ్ బాస్ 9 తెలుగు పదో వారం నామినేషన్స్‌లో మొదటగా ఆరుగురు మాత్రమే నామినేట్ అయితే ఆ తర్వాత పదోవారం అందరూ నామినేషన్స్‌లో ఉంటారని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నామినేషన్స్‌లో పదిమంది
దాంతో ఒక్క ఇమ్మాన్యూయెల్ తప్పా మిగతా పది మంది కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక నామినేషన్స్‌లో ఉన్న గౌరవ్ గుప్తా, దివ్య నిఖిత, భరణి శంకర్, తనూజ గౌడ, సంజన గల్రానీ, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, కల్యాణ్ పడాల, రీతూ చౌదరి, నిఖిల్ నాయర్ పది మందికి ఓటింగ్ పోల్స్ పెట్టారు.
ఫేక్ ఓట్లు పడినట్లు
అయితే, ఈ ఓటింగ్ పోల్స్‌లో ఫేక్ జరిగిందని తాజా సమాచారం. మొబైల్స్ ద్వారా వేసే ఈ ఓటింగ్ ప్రక్రియలో ఎక్కువగా ఫేక్ ఓట్లు పడ్డాయట. దాంతో ఓటింగ్ పోల్స్‌ను రీసెట్ చేశారని పలువురు రివ్యూవర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అంటే, మళ్లీ ఫ్రెష్‌గా ఓటింగ్ పోల్స్‌ను నిర్వహించింది బీబీ యూనిట్.
ముందంజలో కల్యాణ్
మరి ఈ ఓటింగ్‌లో పలు నివేదికల ప్రకారం టాప్ 1లో కల్యాణ్ పడాల 26.14 శాతం ఓటింగ్, 45, 816 ఓట్లతో ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాత 25.23 శాతం ఓటింగ్ (44,230 ఓట్లు)తో రెండో స్థానంలో తనూజ పుట్టస్వామి నిలిచింది. ఇక మూడో ప్లేసులో జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి 16.88 శాతం ఓటింగ్ (29,589 ఓట్లు)తో నిలిచింది.
8 వరకు స్థానాలు
అలాగే, 7.9 శాతం ఓటింగ్ (13,848 ఓట్లు)తో 4 ప్లేసులో భరణి శంకర్, 6.35 శాతం ఓటింగ్ (11,129 ఓట్లు)తో ఐదో స్థానంలో గౌరవ్ గుప్తా, 3.86 శాతం ఓటింగ్ (6,774 ఓట్లు)తో సుమన్ శెట్టి 6వ ప్లేసులో, 3.67 శాతం ఓటింగ్ (6,429 ఓట్లు)తో సంజన గల్రాని 7వ స్థానంలో, 3.58 శాతం ఓటింగ్ (6,279 ఓట్లు)తో 8వ ప్లేసులో దివ్య నిఖిత నిలిచారు.
అతడే ఎలిమినేట్
ఇక చివరి రెండు స్థానాలైన 9లో డిమాన్ పవన్ 3.49 శాతం ఓటింగ్ (6,115 ఓట్లు)తో 10లో 2.89 శాతం ఓటింగ్ (5,069 ఓట్లు)తో నిఖిల్ నాయర్ మిగిలారు. ఇక ఈ లెక్కన చూసుకుంటే బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


