బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్‌లో 10 మంది.. అతను తప్పా అందరూ నామినేట్.. ఎందుకు? ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే?
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ఇటీవలే హౌజ్ నుంచి రాము రాథోడ్, సాయి శ్రీనివాస ఇద్దరు ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దీంతో హౌజ్‌లో 11 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వారిలో ఈ వారం ఏకంగా 10 మంది నామినేట్ అయ్యారు. అతను తప్పా అందరూ ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఉన్నారు.
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ పదో వారానికి చేరుకుంది. తొమ్మిదో వారంలో ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారం సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ కాగా.. నటుడు సాయి శ్రీనివాస అతి తక్కువ ఓటింగ్‌తో ఎవిక్షన్ అయి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

ఈ వారం నామినేషన్స్
ఇద్దరి ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ 9 తెలుగులో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వారికి కుర్చీలో పెట్టి బురద వేసే నామినేషన్ ప్రక్రియ పెట్టారు. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్ పూర్తి అయిపోయాయి. ఈసారి సింగిల్ నామినేషన్స్‌తోనే కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని మాత్రమే నామినేట్ చేసే అధికారం ఇచ్చాడు బిగ్ బాస్. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యూయెల్‌తో బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ప్రారంభం అవుతుంది. భరణి శంకర్‌ను ఇమ్ము నామినేట్ చేస్తాడు. తనకంటే తనూజ బెస్ట్ ప్లేయర్ అని ఒప్పుకోవడం ఏంటీ అనే కారణంతో భరణిని ఇమ్మాన్యూయెల్ నామినేట్ చేశాడు.
ఏకంగా నలుగురు
గౌరవ్ గుప్తాను తనూజ గౌడ, డీమాన్ పవన్, సంజన గల్రాని, దివ్య నిఖితా నలుగురు నామినేట్ చేశారు. అలాగే, దివ్యను రీతూ చౌదరి, భరణి శంకర్ నామినేట్ చేశాడు. వీటిలో దివ్యను భరణి శంకర్ నామినేట్ చేయడం హైలెట్‌గా నిలిచింది. ఎప్పుడు దివ్యతో ఉండే భరణి నామినేట్ చేయడం అందరిని షాక్‌కు గురి చేసింది.
నిఖిల్‌ను కమెడియన్ సుమన్ శెట్టి, కల్యాణ్ పడాల ఇద్దరు నామినేట్ చేశారు. రీతూ చౌదరిని నిఖిల్ నాయర్ ఒక్కడే నామినేట్ చేశాడు. ఒక్క ఓట్‌తోనే రీతూ చౌదరి నామినషన్స్‌లోకి వచ్చింది. సంజన కూడా సింగిల్ ఓట్‌తోనే నామినేట్ అయింది. రీతూ, భరణి, సంజన ముగ్గురు ఒక్కరు ఓట్ వేయడంతోనే ఈ వారం నామినేషన్స్‌లోకి వచ్చారు.
మొదట ఆరుగురు మాత్రమే
అలాగే, గౌరవ్ గుప్తా అత్యధికంగా నలుగురి ఓట్లతో నామినేట్ అయ్యాడు. నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిపోయేసరికి ఆరుగురు మాత్రమే నామినేషన్స్‌లో ఉన్నారు. కానీ, అనంతరం ఈ వారం హౌజ్ మొత్తం నామినేషన్స్‌లో ఉంటుందని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.
అయితే, కెప్టెన్‌గా ఉన్న ఇమ్మాన్యూయెల్‌ను నామినేషన్స్‌లో ఉంచాలా వద్దా అనేది కంటెస్టెంట్స్ చేతిలో పెట్టి మెలిక పెట్టాడు బిగ్ బాస్. అందుకు సీక్రెట్ ఓటింగ్ నిర్వహించాడు. అప్పుడు కూడా అందరూ ఇమ్ముని నామినేట్ చేయలేదు. ఒక్క భరణి శంకర్ మాత్రమే ఇమ్మాన్యూయెల్‌ను నామినేట్ చేస్తూ ఓట్ వేశాడు.
నామినేషన్స్ నుంచి సేఫ్
కానీ, మెజారిటీ ఎక్కువగా ఇమ్మాన్యూయెల్ ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఉండకూడదని ఓట్లు వచ్చాయి. దాంతో ఒక్క ఇమ్మాన్యూయెల్ బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. ఇలా బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని కూడా పక్కన పెట్టేశారు మిగతా హౌజ్‌మేట్స్.
మొత్తంగా బిగ్ బాస్ 9 తెలుగు పదో వారం నామినేషన్స్‌లో పది మంది నామినేట్ అయ్యారు. వారిలో గౌరవ్ గుప్తా, భరణి శంకర్, దివ్య నికితా, తనూజ పుట్టస్వామి, రీతూ చౌదరి, సంజన గల్రాని, డిమాన్ పవన్, కల్యాణ్ పడాల, సుమన్ శెట్టి, నిఖిల్ నాయర్ పది మంది ఉన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


