బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్- ఫోక్ సింగర్ రాము రాథోడ్, నటుడు సాయి శ్రీనివాస రెమ్యూనరేషన్ ఎంత? ఎవరికి ఎక్కువ?

బిగ్ బాస్ 9 తెలుగు నుంచి తొమ్మిదో వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్‌గా ఎవిక్ట్ అయితే.. సినిమా నటుడు సాయి శ్రీనివాస ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్‌కు గురయ్యాడు. కంటెస్టెంట్‌గా వచ్చిన రాము రాథోడ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస బిగ్ బార్ రెమ్యూనరేషన్ ఎంతో చూద్దాం.

Published on: Nov 10, 2025, 09:02:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వారం ఒకరి ఎలిమినేట్ అవుతారని తెలిసిన విషయమే. అయితే, కొన్ని సార్లు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. అది కూడా పెద్ద ట్విస్ట్ ఏం కాదు. కానీ, సెల్ఫ్‌గా ఎలిమినేట్ అవడం అనేది ఊహించని పరిణామం.

బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్- ఫోక్ సింగర్ రాము రాథోడ్, నటుడు సాయి శ్రీనివాస రెమ్యూనరేషన్ ఎంత? ఎవరికి ఎక్కువ?
బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్- ఫోక్ సింగర్ రాము రాథోడ్, నటుడు సాయి శ్రీనివాస రెమ్యూనరేషన్ ఎంత? ఎవరికి ఎక్కువ?

రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్

అలాంటి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో తొమ్మిదో వారం చోటు చేసుకుంది. బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. దాంతో హౌజ్ మొత్తం భావోద్వేగానికి గురైంది. బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం నామినేషన్స్‌లో రాము రాథోడ్ (Ramu Rathod) ఉన్నప్పటికీ అతనికి మంచి ఓటు బ్యాంక్ ఉంది.

కానీ, ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని, వాళ్లను వదిలి ఉండలేకపోతున్నాను కన్నీటి పర్యంతం అయిన రాము రాథోడ్ సొంతంగా ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడాడు. రాను రాను బొంబాయికి పాటతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఫోక్ సింగర్ రాము రాథోడ్ బిగ్ బాస్ తెలుగు 9లోకి సెప్టెంబర్ 7న కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు.

వారానికి రెండు లక్షలు

బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారంలో రాము రాథోడ్ స్వయంగా ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు కాబట్టి హౌజ్‌లో 9 వారాలు ఉన్నాడు. రాము రాథోడ్‌కు బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు వారానికి రూ. 2 లక్షల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన 9 వారాలు ఉన్న రాము రాథోడ్ బిగ్ బాస్ ద్వారా రూ. 18 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.

ఇక అక్టోబర్ 12న ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగు 2.O గ్రాండ్ లాంచ్ జరిగింది. ఈ లాంచ్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఎంట్రీ ఇచ్చారు. వారిలో సినిమా నటుడు సాయి శ్రీనివాస (Sreenivasa Sayee) కూడా ఉన్నాడు.

సాయి శ్రీనివాస సినిమాలు

గోల్కొండ హైస్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాపులర్ అయిన శ్రీనివాస సాయి నాతో నేను, మథనం, శుభలేఖలు, వినర సోదర వీర కుమార వంటి సినిమాలు చేశాడు. గ్రాండ్ లాంచ్ రోజున వైల్డ్ కార్డ్ లేదా రాయల్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస హౌజ్‌లో ఆట పరంగా పెద్దగా ప్రభావం చూపించలేదు.

బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం నామినేషనేట్ అయిన ఏడుగురిలో సాయి శ్రీనివాస కూడా ఉన్నాడు. అతని తొలి రోజు నుంచే అతి తక్కువగా ఓటింగ్ నమోదు అవుతూ వచ్చింది. వీకెండ్ వచ్చేసరికి కూడా సాయి శ్రీనివాస బిగ్ బాస్ ఓటింగ్‌లో పెద్దగా మార్పు లేకుండా పోయింది.

10 లక్షలు ఎక్కువ

దాంతో అతి తక్కువ ఓటింగ్ వల్ల బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం సాయి శ్రీనివాస ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. అక్టోబర్ 12న హౌజ్‌లోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస 4 వారాల పాటు ఉన్నాడు. నటుడు, హీరో అయిన సాయి శ్రీనివాసకు బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు వారానికి రూ. 2 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్.

ఈ లెక్క బిగ్ బాస్ హౌజ్‌లో నాలుగు వారాలు ఉన్న సాయి శ్రీనివాస మొత్తంగా రూ. 8 లక్షలు సంపాంచినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఫోక్ సింగర్ రాము రాథోడ్, నటుడు సాయి శ్రీనివాస ఇద్దరికి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఒకేలా ఉంది.

కానీ, సాయి శ్రీనివాస వైల్డ్ కార్డ్‌గా రావడంతో తక్కువ వారాలు ఉన్నాడు. దాని వల్ల సాయి శ్రీనివాస కంటే రాము రాథోడ్ దాదాపుగా రూ. 10 లక్షలు ఎక్కువ సంపాదించినట్లు తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More