బిగ్ బాస్ ఓటింగ్‌లో తారుమారైన స్థానాలు- ఏకంగా ముగ్గురికి ఎలిమినేషన్ గండం- ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ దెయ్యాలు, అరుపులు, టాస్క్‌లతో జోరుగా సాగుతోంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం మిడ్ వీక్‌కు వచ్చేసింది. అయితే, ఈ మిడ్ వీక్‌ బిగ్ బాస్ ఓటింగ్‌లో స్థానాలు తారుమారు అయిపోయాయి. ముగ్గురికి ఎలిమినేషన్ గండం ఉండనుంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 6, 2025, 13:51:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ తొమ్మిదో వారం మధ్యలోకి వచ్చేసింది. హౌజ్‌లో దెయ్యాలు, బిగ్ బాస్ టాస్క్‌లు, ఫోన్ కాల్స్‌తో ఆడుకోవడాలు, అరుపులు, వాగ్వాదాలతో జోరుగా సాగుతోంది ఈ సీజన్. అయితే, బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారం మిడ్ వీక్‌ రానే వచ్చింది. ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

బిగ్ బాస్ ఓటింగ్‌లో తారుమారైన స్థానాలు- ఏకంగా ముగ్గురికి ఎలిమినేషన్ గండం- ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
బిగ్ బాస్ ఓటింగ్‌లో తారుమారైన స్థానాలు- ఏకంగా ముగ్గురికి ఎలిమినేషన్ గండం- ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

8 మంది ఎలిమినేట్

ఇప్పటికే 8 మంది వరకు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయారు. వారిలో శ్రేష్టి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము, రమ్య మోక్ష, దివ్వెల మాధురి ఉన్నారు. ఎలిమినేట్ అయిన భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చి పర్మనెంట్ హౌజ్‌మేట్‌గా మారిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారికి బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం నామినేషన్స్ నిర్వహించారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

నామినేషన్స్‌లో ఏడుగురు

భరణి శంకర్, సాయి శ్రీనివాస్, తనూజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సుమన్ శెట్టి, రాము రాథోడ్, సంజన గల్రాని 7 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీరికి నామినేషన్స్ అనంతరం బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ మొదలైపోయాయి. ఈ బిగ్ బాస్ ఓటింగ్‌లో స్థానాలు తారు మారు అయ్యాయి.

ఎప్పుడు బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్ 1లో వచ్చే సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి ఈ వారం మాత్రం రెండో ప్లేసులోకి వెళ్లిపోయింది. టాప్ 1లోకి కల్యాణ్ పడాల వచ్చేశాడు. అతను బిగ్ బాస్ ఈ వారం ఓటింగ్‌లో 27.26 శాతం ఓటింగ్, 15,637 ఓట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

బిగ్ బాస్ ఓటింగ్

ఇక తనూజ గౌడ రెండో స్థానంలో 20.7 శాతం ఓటింగ్, 7,300 ఓట్లతో నిలిచింది. అలాగే, మూడో ప్లేసులో 12.73 శాతం ఓటింగ్ (7,300 ఓట్లు)తో సీనియర్ హీరోయిన్ సంజన గల్రాని, 12.64 శాతం ఓటింగ్ (7,252 ఓట్లు)తో నాలుగో స్థానంలో సీరియల్ విలన్ భరణి శంకర్, 10.61 శాతం ఓటింగ్ (6,086 ఓట్లు)తో నటుడు సాయి శ్రీనివాస్ ఐదో ప్లేసులో ఉన్నారు.

చివరివి అయిన టాప్ 6, 7 స్థానాల్లో వరుసగా తెలుగు కమెడియన్ సుమన్ శెట్టి (10.53 శాతం ఓటింగ్, 6,037 ఓట్లు), ఫోక్ సింగర్ రాము రాథోడ్ (5.52 శాతం ఓటింగ్, 3,164

ఓట్లు) ఉన్నారు. వీరిలో చివరి మూడు స్థానాల్లో ఉన్న సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి, రాము రాథోడ్‌కు ఎలిమినేషన్ గండం ఉంది. ఈ ముగ్గురిలో ఎవరైనా ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

ఆ ఇద్దరికే డేంజర్

అయితే, చివరి రెండు స్థానాల్లో ఉన్న వారికి ఎక్కువగా ఎలిమినేషన్ రిస్క్ ఉంటుంది. అలా, ఫోక్ సింగర్ రాము రాథోడ్‌కు ఎలిమినేషన్ గండం ఎక్కువగా ఉంది. కానీ, తన తర్వాతి స్థానంలో ఉన్న సుమన్ శెట్టికి అంత పెద్ద రిస్క్ లేదు. ఎందుకంటే కమెడియన్‌గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న సుమన్ శెట్టికి ఓటు బ్యాంక్ విపరీతంగా ఉందని సమాచారం.

కాబట్టి వీకెండ్ వచ్చేసరికి సుమన్ శెట్టి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గేమ్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్న నటుడు సాయి శ్రీనివాస్‌ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఇద్దరికి ఎక్కువగా ఈ వారం బిగ్ బాస్‌లో ఎలిమినేషన్ గండం ఉందని చెప్పొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More