ఎలా పడితే అలా రాడానికి, పోడానికి ఇదేమైనా బస్సా- బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ వార్నింగ్- భయపడిన సింగర్ రాము రాథోడ్
బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన వాళ్లను బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ద్వారా హీరో శివాజీ ప్రశ్నలు అడుగుతాడని తెలిసిన విషయమే. ఈ క్రమంలో బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాము రాథోడ్‌ను తన ప్రశ్నలతో భయపెట్టేశాడు మాజీ కంటెస్టెంట్ శివాజీ.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. తొమ్మిదో వారం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం సాయి శ్రీనివాస్‌తోపాటు ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను బిగ్ బాస్ బజ్ పేరుతో హీరో శివాజీ ఇంటర్వ్యూ చేస్తాడు.

బొంబాయికి రాను పాటకు డ్యాన్స్
ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు 9 బజ్ ఇంటర్వ్యూలో రాము రాథోడ్ పాల్గొన్నాడు. బొంబాయికి రాను పాటతో సింగర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు. రాముతో కలిసి శివాజీ కూడా పాటకు స్టెప్పులేశాడు. "బొంబాయి రాను పాట చేయడానికి ఎన్నాళ్లు పట్టింది" అని శివాజీ అడిగాడు. దానికి "ఐదేళ్లు" అని సింగర్ రాము ఆన్సర్ ఇచ్చాడు.
"ఒక సక్సెస్ రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఐదేళ్లు డే అండ్ నైట్ కష్టపడితే సక్సెస్ వచ్చింది. మరి కప్పు కొట్టడానికి కేవలం 15 వారాల. ఎవరైనా బిగ్ బాస్ హౌజ్ జస్చ్ చూద్దామని వచ్చేవారికి చెబుతున్నా ప్లీజ్ దయచేసి రాకండి. మీ ప్లేసులో ఇంకొకరు వస్తారు. కొన్ని కోట్ల మందికి డ్రీమ్ ఇది బిగ్ బాస్" అని వార్నింగ్ ఇచ్చాడు హీరో శివాజీ.
క్లియర్‌గా ఉంటావా, కన్‌ఫ్యూజ్ అవుతావా
"ఆ డ్రీమ్‌ను జస్ట్ నేను రావాలనుకున్నాను.. నేను పోవాలనుకున్నాను.. ఇదేమైనా బస్సా" అని సీరియస్‌గా అన్నాడు శివాజీ. దానికి రాము కాస్తా భయపడినట్లు కనిపించాడు. తర్వాత "బయట నీ ఆలోచన విధానం, క్లారిటీ ఎలా ఉంటుంది. క్లియర్‌గా ఉంటావా, కన్‌ఫ్యూజ్ అవుతావా" అని శివాజీ అడిగాడు.
"కచ్చితంగా క్లారిటీగా ఉంటాను" అని రాము రాథోడ్ చెప్పాడు. "మరి హౌజ్‌లో సంచాలక్‌గా ఉన్నప్పుడు ఎందుకు అన్నిసార్లు కన్‌ఫ్యూజ్ అయ్యావ్" అని ప్రశ్నించాడు శివాజీ. "ఒక్కొక్కళ్లు ఏదోటి మాట్లాడి మాన్యుపులేట్ చేశారు" అని రాము సమాధానం ఇచ్చాడు.
స్కోప్ లేకపోయినా అక్కడ దూరిపోవాలి
"అలా చేస్తే నువ్వు మార్చుకుంటావా నీ అభిప్రాయాన్ని. మరి బయట కూడా ఇలాగే జరుగుద్ది. లేదా దూరంగా వెళ్లిపోతానంటావ్" అని శివాజీ అన్నాడు. దానికి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు రాము. సంజన ఫొటో స్క్రీన్‌లో చూపిస్తే లక్ కొద్ది బయటపడుతుందని రాము చెప్పినట్లు ఉన్నాడు.
"లక్కీతో లాక్కొస్తుందా అక్కయ్య" అని శివాజీ నవ్వుతూ అన్నాడు. "స్కోప్ లేకపోయినా అక్కడ దూరిపోవాలి" అని రాము అంటే.. "నువ్వు దూరుతావ్ కానీ ఏం మాట్లాడవ్. ఆవిడ దూరి ఏదోటి చేస్తది" అని శివాజీ అన్నాడు. తర్వాత "గౌరవ్ సంజనను కిందకు లాగాడా, గౌరవ్ దిగాక సంజన దిగిందా" అని మరో ప్రశ్న అడిగాడు హీరో శివాజీ.
దొబారా కన్‌ఫ్యూజ్
"ఏమో అన్న చూల్లేదు" అని రాము ఆన్సర్ ఇచ్చాడు. "నువ్వే సంచాలక్ కదా. సామి మళ్లీ కన్‌ఫ్యూజ్ అవుతున్నావ్ రాము.. రాము భాయి దొబారా కన్‌ఫ్యూజ్ హో రహహై ఆప్‌నే" అని శివాజీ నవ్వుతూ వెటకారంగా అన్నాడు. రాము మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


