నలుగురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో సరికొత్త సినిమా దండోరా- అదిరిపోయిన శివాజీ, బిందు మాధవి పోస్టర్స్- రిలీజ్ ఎప్పుడంటే?

బిగ్ బాస్ శివాజీ, బిందు మాధవి, నవదీప్, రవి కృష్ణ, నందు ప్రధాన పాత్రలతో నటిస్తున్న లేటెస్ట్ సినిమా దండోరా. కుల విచక్షణ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాకు మురళీకాత్ దర్శకత్వం వహించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తోన్న దండోరా రిలీజ్ డేట్‌ను పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు మేకర్స్.

Published on: Nov 10, 2025, 13:35:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న సినిమా ‘క‌ల‌ర్ ఫోటో’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ ‘బెదురులంక 2012’. ఈ రెండు చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘దండోరా’.

నలుగురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో సరికొత్త సినిమా దండోరా- అదిరిపోయిన శివాజీ, బిందు మాధవి పోస్టర్స్- రిలీజ్ ఎప్పుడంటే?
నలుగురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో సరికొత్త సినిమా దండోరా- అదిరిపోయిన శివాజీ, బిందు మాధవి పోస్టర్స్- రిలీజ్ ఎప్పుడంటే?

క్రిస్మస్ సందర్భంగా

ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తాజాగా ఈ దండోరా సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న పోస్ట‌ర్‌ను తాజాగా ఇవాళ (నవంబర్ 10) విడుదల చేశారు.

డ్రామాటిక్‌గా ముగింపు

దండోరా రిలీజ్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఓ ఖాళీ ప్రాంతంలో త‌వ్విన గొయ్యి కనిపిస్తోంది. అందులో ఈ ఏడాదికి డ్రామాటిక్‌గా ముగింపునిస్తున్నాం అనే క్యాప్ష‌న్‌తో రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే వెర్స‌టైల్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఎక్స్‌‌పెక్టేష‌న్స్ పెంచుకుంటోన్న దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది.

దౌర్జన్యకాండ జరుగుతుందనే

అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దండోరా ఫస్ట్ బీట్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది.

వ్యంగ్యం, హాస్యంతో

తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అలాగే, ఇటీవల రిలీజ్ చేసిన శివాజీ, బిందు మాధవి పోస్టర్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి.

దండోరా నటీనటులు

ఇకపోతే దండోరా సినిమాలో విల‌క్ష‌ణ న‌టుడు శివాజీతో పాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ, మణిక చిక్కాల, మౌనిక రెడ్డి, అనూష, రాధ్య‌, అదితి భావరాజు తదితరులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. అయితే, వీరిలో శివాజీ, బిందు మాధవి, నవదీప్, రవి కృష్ణ నలుగురు బిగ్ బాస్‌లో వివిధ సీజన్లలో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో

ఎక్కువగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నటించిన దండోరా సినిమాకు ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు మార్క్ కె.రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్ర‌ఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్‌ పనులు చేపడుతున్నారు.

ఓవర్సీస్‌లో కూడా రిలీజ్

అలాగే, క్రాంతి ప్రియ‌మ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌‌గా, రేఖ బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌, ఎడ్వర్డ్ పేరజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, అనీష్ మ‌రిశెట్టి కో ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ దండోరా సినిమాలోని పాటలు టీ సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ దండోరా మూవీని ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More