ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హీరోయిన్ రాశి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ- మనసుకు హత్తుకునే సీన్లతో తాత, మనవడు, తల్లి కథ- ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం విజయ్ కేరాఫ్ రామారావు స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమాలో సినియర్ హీరోయిన్ రాశి ముఖ్య పాత్ర పోషించారు. మనసుకు హత్తుకునే సీన్లతో తాత, తల్లి, మనవడు పాత్రలతో హృద్యంగా తెరకెక్కించారు. మరి విజయ్ కేరాఫ్ రామారావు ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉంటాయి. వచ్చే వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ వారం ఓటీటీల్లో చాలా వరకు మూవీస్ డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఎక్కువగా ఫ్రైడే రోజున ఓటీటీ రిలీజెస్ అయ్యాయి.
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హీరోయిన్ రాశి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ- మనసుకు హత్తుకునే సీన్లతో తాత, మనవడు, తల్లి కథ- ఇక్కడ చూడండి!
తెలుగు సినిమా
ఇదిలా ఉంటే, ప్రతి ఆదివారం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే తెలుగు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ వారం అంటే ఇవాళ (నవంబర్ 9) కూడా స్వచ్ఛమైన తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ అయింది. ఆ మూవీనే విజయ్ కేరాఫ్ రామారావు.
సీనియర్ హీరోయిన్ రాశి
ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాశి ముఖ్య పాత్ర పోషించింది. విజయ్ కేరాఫ్ రామారావులో రాశి తల్లిగా, కూతురిగా, భార్యగా యాక్ట్ చేసింది. ఈ మూవీలో రాశితోపాటు శంకర్ మహంతి, మహేంద్ర గణచారి, మేఘన, పీవీఎన్ కార్తికేయ కీలక పాత్రలు పోషించారు.
నటనతోపాటు దర్శకత్వం
ఉదయ్ కుమార్ సద్దాల నిర్మాతగా వ్యవహరించి నిర్మించిన విజయ్ కేరాఫ్ రామారావు సినిమాకు పీవీఎన్ కార్తికేయ కథ, దర్శకత్వం వహించారు. అలాగే నటుడిగా చేశారు. సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా శివ గెడ్డం వ్యవహరించగా చరణ్ మేసల్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఈశ్వర్ చంద్ మ్యూజిక్ అందించారు.
80 ఏళ్ల వ్యక్తి కథ
శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్‌గా వర్క్ చేసిన విజయ్ కేరాఫ్ రామారావు సినిమా తాత, మనవడు, తల్లి పాత్రల చుట్టూనే ప్రధానంగా తిరుగుతుంది. 80 ఏళ్ల వ్యక్తి ఇండిపెండెంట్‌గా తన సొంత మార్గాల్లో స్థిరపడి జీవిస్తుంటాడు. కూతురు, అల్లుడు, మనవడితో కలిసి జీవించే పరిస్థితి వస్తుంది.
లోలోపల ఉన్న అనురాగాలను
అప్పుడు తండ్రి వల్ల కూతురు ఇంట్లో జరిగిన పరిణామాలతో తెరకెక్కిన సినిమానే విజయ్ కేరాఫ్ రామారావు. మూడు జెనరేషన్స్‌లో ఉన్న గ్యాప్‌ను సినిమాలో చూపించారు. తాత వల్ల కూతురు, మనవడు ఎలా నలిగిపోయారో చూపిస్తూ లోలోపల ఉన్న అనురాగాలను మనసుకు హత్తుకునే సీన్లతో తెరకెక్కించారు.
విజయ్ కేరాఫ్ రామారావు ఓటీటీ
ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన విజయ్ కేరాఫ్ రామారావు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఇవాళ విజయ్ కేరాఫ్ రామారావు ఓటీటీ రిలీజ్ అయింది.
38 నిమిషాల 26 సెకన్ల రన్‌టైమ్
సుమారుగా 38 నిమిషాల 26 సెకన్ల రన్‌టైమ్ ఉన్న తెలుగు ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా విజయ్ కెరాఫ్ రామారావును ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు. ఇదిలా ఉంటే, ఈటీవీ విన్ ఓటీటీ సంస్థ ప్రతి వారం సరికొత్త చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈటీవీ విన్ కథా సుధా వీక్లీ సిరీస్
అతి తక్కువ రన్‌టైమ్‌తో ఈటీవీ విన్‌లో కథా సుధా వీక్లీ సిరీస్ అనే టైటిల్‌తో అచ్చ తెలుగు ఓటీటీ సినిమాలు ప్రతి ఆదివారం డిజిటల్ ప్రీమియ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాత, మనవడు, తల్లి మూడు జెనరేషన్స్‌ల కథగా నేటి నుంచి ఈటీవీ విన్‌లో విజయ్ కేరాఫ్ రామారావు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
News/Entertainment/ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హీరోయిన్ రాశి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ- మనసుకు హత్తుకునే సీన్లతో తాత, మనవడు, తల్లి కథ- ఇక్కడ చూడండి!
News/Entertainment/ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హీరోయిన్ రాశి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ- మనసుకు హత్తుకునే సీన్లతో తాత, మనవడు, తల్లి కథ- ఇక్కడ చూడండి!