నా కెరీర్‌లో 2.ఓ ఈటీవీ విన్.. జరగకూడని ఘటన ఇది, డైరెక్టర్‌కు బెదిరింపు కాల్స్ వస్తాయి.. హీరో మంచు మనోజ్ కామెంట్స్

మంచు మనోజ్ హీరోగా, విలన్‌గా అలరిస్తున్నాడు. ఇటీవలే మిరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు మంచు మనోజ్. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమా నుంచి విడుదలైన రాంబాయి నీ మీద నాకు లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా మంచు మనోజ్ హాజరై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Published on: Nov 6, 2025, 14:31:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఇటీవల మిరాయ్ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేసి మెప్పించాడు. హీరోగా, విలన్‌గా మెప్పిస్తున్న మంచు మనోజ్ రీసెంట్‌గా ఓ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు సతీమణి భూమా మౌనికతో కలిసి జంటగా హాజరయ్యాడు.

నా కెరీర్‌లో 2.ఓ ఈటీవీ విన్.. జరగకూడని ఘటన ఇది, డైరెక్టర్‌కు బెదిరింపు కాల్స్ వస్తాయి.. హీరో మంచు మనోజ్ కామెంట్స్
నా కెరీర్‌లో 2.ఓ ఈటీవీ విన్.. జరగకూడని ఘటన ఇది, డైరెక్టర్‌కు బెదిరింపు కాల్స్ వస్తాయి.. హీరో మంచు మనోజ్ కామెంట్స్

ఈటీవీ విన్ ఓటీటీ

ఆ పాటే రాంబాయి నీ మీద నాకు. అఖిల్, తేజస్విని జంటగా నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్న ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు.

మంచు మనోజ్-భూమా మౌనికతో

నవంబర్ 21న రాజు వెడ్స్ రాంబాయి సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రాంబాయి నీ మీద నాకు లిరికల్ సాంగ్‌ను మంచు మనోజ్, భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఉస్తాద్ షోతో

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ.. "నా కెరీర్‌లో 2.ఓ ఈటీవీ విన్ ఓటీటీలో ఉస్తాద్ అనే షోతో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత భైరవం, మిరాయ్ లాంటి హిట్ సినిమాలు దక్కాయి. మంచి కంటెంట్‌తో మూవీస్, షోస్ చేస్తూ ఈటీవీ విన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది" అని అన్నాడు.

పల్లెటూరిలో జరిగిన కథ

"ఈ ప్రాజెక్ట్ గురించి నాకు తెలుసు. రెండేళ్లుగా ఈ టీమ్ రాజు వెడ్స్ రాంబాయి సినిమా కోసం కష్టపడుతున్నారు. ఒక పల్లెటూరిలో జరిగిన యదార్ధ ఘటన ఈ సినిమా. జరగకూడని ఘటన అది" అని మంచు మనోజ్ తెలిపాడు.

అన్ని అవార్డ్స్ ఈ సినిమాకు

"ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే ఎంటర్‌టైనింగ్ మూవీ చేశారు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా కూడా లైట్ మూవ్‌మెంట్స్‌తో వెళ్తూ హెవీ ఎమోషన్‌తో పూర్తవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అన్ని అవార్డ్స్ ఈ సినిమాకు వస్తాయి. రాజు వెడ్స్ రాంబాయి సినిమా సక్సెస్ మీట్‌కు వచ్చి డీటెయిల్డ్‌గా మాట్లాడుతా" అని మంచు మనోజ్ పేర్కొన్నాడు.

మౌనికకు మాటిచ్చా

"జీవితంలో కష్టపడతా, ఎవరినీ మోసం చేయను, బాగా చూసుకుంటా అనే మాటను మౌనికకు ఇచ్చాను. మిమ్మల్ని నమ్మి మీతో వచ్చిన వారి చేయిని జీవితంలో వదిలిపెట్టకండి" అని మంచు మనోజ్ తన భార్య గురించి చెప్పాడు.

నీకు సపోర్ట్‌గా ఉంటా

"ఒక ప్రేమ జంటకు జరిగిన అన్యాయాన్ని ఒక ఊరు ఊరంతా బయటకు రాకుండా తొక్కిపెట్టిందంటే అది ఎంత దారుణమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్టర్ సాయిలుకు బెదిరింపు కాల్స్ వస్తాయి. అప్పుడు నీకు సపోర్ట్‌గా నేనుంటా. ఇలాంటి పాయింట్‌ను డైరెక్టర్ సినిమాగా చేశాడంటే అతనికి హ్యాట్సాఫ్. ఇలాంటి మంచి సినిమాను థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయండి" అని హీరో మంచు మనోజ్ కోరాడు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More