ఆర్ఎక్స్ 100, బేబి సినిమాల్లా రాజు వెడ్స్ రాంబాయి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. నిర్మాత వేణు ఊడుగుల కామెంట్స్

తెలుగులో వస్తున్న విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి. అఖిల్, తేజస్విని జంటగా నటించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిర్మాత వేణు ఊడుగుల, బన్నీ వాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Oct 30, 2025 6:21 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు.

ఆర్ఎక్స్ 100, బేబి సినిమాల్లా రాజు వెడ్స్ రాంబాయి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. నిర్మాత వేణు ఊడుగుల కామెంట్స్
ఆర్ఎక్స్ 100, బేబి సినిమాల్లా రాజు వెడ్స్ రాంబాయి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. నిర్మాత వేణు ఊడుగుల కామెంట్స్

నవంబర్ 21న రిలీజ్

"రాజు వెడ్స్ రాంబాయి" సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. నవంబర్ 21న "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ డేట్ ప్రకటించారు.

ఈ సందర్భంగా రాజు వెడ్స్ రాంబాయి మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత వేణు ఊడుగుల, తదితరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా

ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ.. "ఖమ్మం, వరంగల్ మధ్య జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్ర కథను దర్శకుడు సాయిలు రాసుకున్నాడు. ప్రేమతో కూడిన విషాధభరితమైన ఈ సంఘటన ఆ ఊర్లోనే జరిగి అక్కడే సమాధి అయ్యింది. దాన్ని బేస్ చేసుకుని సాయిలు ఒక మంచి స్క్రిప్ట్ రాశాడు" అని అన్నారు.

"ఈ కథ విన్నప్పుడే కదిలించింది. ఈ కథను ఎంటర్‌టైనింగ్, మాస్ అప్పీల్ ఉండేలా దర్శకుడు సాయిలు స్క్రిప్ట్ రాశాడు. ఈటీవీ విన్ ఓటీటీ వారి వల్లే నేను ప్రొడ్యూసర్‌ను అయ్యాను. నవంబర్ 21న రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ అవుతుంది" అని నిర్మాత వేణు ఊడుగుల తెలిపారు.

ఆ నాలుగు చిత్రాల్లా

"7జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్ఎక్స్ 100, బేబి లాంటి చిత్రాల్లా తెలుగు ఆడియెన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. నా డైరెక్షన్‌లో యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయబోతున్నా. ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి" అని చెప్పుకొచ్చారు వేణు ఊడుగుల.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. "రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూశాను. ఇది నా మనసుకు హత్తుకుంది. కొందరి లైఫ్‌లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా చేశారు. ఇది కాల్పనిక కథ అయితే మనం ఆ దర్శకుడి ఊహకు ఆశ్చర్యపోయేవాళ్లం. ఇలా ఎలా ఆలోంచించారు అనుకునేవాళ్లం" అని అన్నారు.

ఒక ఎమోషనల్ ఫీల్‌తో

"ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక ఎమోషనల్ ఫీల్‌తో వస్తారు. అఖిల్ రాజు పాత్రలో బాగా నటించాడు. తేజస్విని తెలుగు అమ్మాయి. ఈ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్, పర్ ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది" అని బన్నీ వాస్ తెలిపారు.

"హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతన్య ఒక మంచి రోల్ చేశాడు. అతనికి నటుడిగా మంచి పేరు తెచ్చే మూవీ అవుతుంది. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆయనతో పాటు ఈటీవీ విన్ ఓటీటీ వారికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు ప్రొడ్యూసర్ బన్నీ వాస్.