ఓటీటీలో తెలుగులో ఏకంగా 13 సినిమాలు- కచ్చితంగా చూడాల్సినవి 10, ఇంట్రెస్టింగ్‌గా 7- ఒక్కరోజే 6 స్ట్రీమింగ్-ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 13 సినిమాలు తెలుగు భాషలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఒక్కరోజే 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవ్వగా.. ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు, చూసేందుకు చాలా స్పెషల్‌గా 10 ఉన్నాయి. అందులో పవన్ కల్యాణ్ ఓజీ నుంచి బ్యూటిఫుల్ లవ్ మూవీ రిధి వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Published on: Oct 27, 2025, 13:49:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 13 సినిమాలు తెలుగు భాషలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో పవన్ కల్యాణ్ ఓజీ నుంచి తెలుగు లవ్ స్టోరీ సినిమా రిధి వరకు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలో తెలుగులో ఏకంగా 13 సినిమాలు- కచ్చితంగా చూడాల్సినవి 10, ఇంట్రెస్టింగ్‌గా 7- ఒక్కరోజే 6 స్ట్రీమింగ్-ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో తెలుగులో ఏకంగా 13 సినిమాలు- కచ్చితంగా చూడాల్సినవి 10, ఇంట్రెస్టింగ్‌గా 7- ఒక్కరోజే 6 స్ట్రీమింగ్-ఇక్కడ చూసేయండి!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లొరెన్స్ (తెలుగు డబ్బింగ్ ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 22

ఓజీ (తెలుగు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 23

కురుక్షేత్ర పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ మైథలాజికల్ వార్ యాక్షన్ యానిమేషన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 24

ఏ హౌజ్ ఆఫ్ డైనమైట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 24

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

హర్లాన్ కొబెన్స్ లాజరస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 22

అలెన్ ఐవర్సన్ (Allen Iv3rson) (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 23

అర్జున్ చక్రవర్తి (తెలుగు రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఫిల్మ్)- అక్టోబర్ 24

థాంక్యూ డియర్ (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 24

జియో హాట్‌స్టార్ ఓటీటీ

శక్తి తిరుమగన్/భద్రకాళి (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 24

మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ (తెలుగు డబ్బింగ్ హిందీ మైథలాజికల్ వార్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్)- అక్టోబర్ 25

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

నడికర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 24

3 రోజెస్ (తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ మూవీ)- ఆహా ఓటీటీ- అక్టోబర్ 23

రిధి (తెలుగు లవ్ రొమాంటిక్ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 26

ఓటీటీలోకి 13 సినిమాలు

ఇలా ఈ వారం (అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 26) తెలుగు భాషలో 13 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. వీటిలో ఒక్క అక్టోబర్ 24 రోజునే 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక వీటన్నింటిలో పవన్ కల్యాణ్ ఓజీ, భద్రకాళి, మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్, కురుక్షేత్ర పార్ట్ 2, అర్జున్ చక్రవర్తి, రిధి సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు 3 రోజెస్, థ్యాంక్యూ డియర్, ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లొరెన్స్‌, నడికర్‌తో కలిపి 10 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, ఇందులో ఓజీ, భద్రకాళి, మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్, కురుక్షేత్ర పార్ట్ 2, అర్జున్ చక్రవర్తి, రిధి, నడకర్ వంటి 7 సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

ఇంకాస్తా ప్రత్యేకంగా

ఇక ఈ 13 సినిమాల్లో ఓజీ, అర్జున్ చక్రవర్తి, రిధి, థ్యాంక్యూ డియర్, 3 రోజెస్ ఐదు స్ట్రయిట్ తెలుగు సినిమాలు. ఇవి తెలుగు ఓటీటీ ఆడియెన్స్‌కు ఇంకాస్తా ప్రత్యేకమైనవని చెప్పొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More