ఓటీటీలో ఇవాళ అదరగొడుతున్న న్యూ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్- 7 భాషల్లో టాప్‌లో ట్రెండింగ్- ఈ ఒక్కదాంట్లో చూడొచ్చు!
ఓటీటీలో న్యూ మైథలాజికల్ హిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ స్ట్రీమింగ్ అవుతోంది.అంతేకాకుండా ఓటీటీ రిలీజ్ రోజు నుంచే ఏకంగా 7 భాషల్లో టాప్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. మహాభారతంలోని కురుక్షేత్రం ఆధారంగా తెరకెక్కిన మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ స్ట్రీమింగ్ తెలుసుకుందాం.
ఇండియన్ మైథలాజీ అంశాలపై ఎంతోమందికి ఆసక్తి ఉంటుంది. భారతదేశంలోని ఇతిహాసాలు, పురాణాలు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా, ఆచరించే విధంగా ఉంటాయి. అలాంటి అంశాలపై ఎన్ని సినిమాలు, ఓటీటీ సిరీస్‌లు తెరకెక్కించిన ఎల్లప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి.

ఓటీటీలు సులభంగా
ఇక ఇటీవల కాలంలో మైథలాజికల్ అంశాలపై సినిమాలు, వెబ్ సిరీసులు చాలా ఎక్కువగా రూపొందుతున్నాయి. అలాగే, అందరికి ఓటీటీలు సులభంగా అందుబాటులో ఉండటంతో మరింత ఎక్కువగా సినిమాలు, సిరీస్‌లు రూపుదిద్దుకుంటున్నాయి.
ఇక తాజాగా భారతదేశ ఇతిహాసాలపై తెరకెక్కిన న్యూ మైథలాజికల్ హిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్. రామాయణం, భాగవతం, మహాభారతం హిందూ ప్రజలకు ఎంతో ప్రసిద్ధ గ్రంథాలు. వీటిపై రూపొందే సినిమాలు, సిరీస్‌లు, టీవీ సీరియల్స్ ఎప్పుడు మంచి ఆదరణ పొందుతుంటాయి.
ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ
ఇప్పుడు మనం ఏఐ యుగంలో బతుకుతున్నాం. అన్నింటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకుంటున్నాం. ఫిల్మ్ మేకింగ్‌లో కూడా ఏఐ వాడి క్రిష్టతరమైన పనులు చేయించుకుంటున్నారు. అయితే, మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ సిరీస్ మాత్రం పూర్తిగా ఏఐ వాడకంతో తెరకెక్కింది. అంటే, ఏఐ రూపొందించిన మైథలాజికల్ సిరీసే మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్.
మహాభారతంలో గొప్పగా చెప్పుకునే ఘట్టం కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధం జరగడానికి గల కారణాలు, సంఘటనలు వంటి అంశాలతో తెరకెక్కిందే ఈ సిరీస్. మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్టోబర్ 25 శనివారం నుంచి మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా ఏకంగా ఏడు భాషల్లో మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ ప్రీమియర్ అయింది. హిందీతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, మరాఠీ, బెంగాలీ వంటి 7 భాషల్లోనూ ఈ సిరీస్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
అయితే, ఓటీటీ రిలీజ్ అయిన అక్టోబర్ 25 నుంచే ట్రెండింగ్ మూవీస్ జాబితాలోకి వచ్చేసింది మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్. ఓటీటీ ట్రెండింగ్ టాప్ సినిమాల్లో ఒకటిగా మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ అదరగొడుతోంది. అది కూడా ఏకంగా ఏడు భాషల్లో మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ టాప్‌లో ఓటీటీ ట్రెండ్ అవుతోంది.
ఒక్కో భాషలో ఒక్కోలా ట్రెండింగ్
తెలుగు భాషలో టాప్ 3 ఓటీటీ ట్రెండింగ్ స్థానంలో మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఉంది. హిందీలో టాప్ 2, మలయాళంలో రెండో స్థానం, తమిళంలో అయితే టాప్ 6 స్థానంలో మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. ఇక బెంగాలి, మరాఠీ భాషల్లో టాప్ 1 స్థానంలో దూసుకుపోతూ సత్తా చాటుతోంది మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్.
వీటి తర్వాత కన్నడ లాంగ్వేజ్‌లో టాప్ 2 ప్లేసులో మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. ఇలా ఒక్క తమిళంలో తప్పా మిగతా ఆరు భాషల్లో టాప్ 1, 2, 3 స్థానాల్లోనే చోటు దక్కించుకుంది మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ సిరీస్.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
ఇన్ని భాషల్లో ట్రెండింగ్ అయినప్పటికీ ఒక్క జియో హాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) ఓటీటీలో మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ సిరీస్‌ను ఎంచక్కా వీక్షించవచ్చు. మరి మీరు కూడా ఓ లుక్కేయండి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


