ఓటీటీలోకి తెలుగులో వచ్చిన ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్- చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది భయపెట్టే హారర్ థ్రిల్లర్ మూవీ జరణ్. 7 రేటింగ్ ఉన్న మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీలో ఓ కుటుంబం చేతబడుతలో కొట్టుమిట్టాడుతుంటుంది. ట్విస్టులతో మతిపోగొట్టే ఈ హారర్ థ్రిల్లర్ జరణ్ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 8, 2025, 13:18:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ ఆడియెన్స్‌కు ఎక్కువగా ఇష్టమైన జోనర్లలో ముందు వరుసలో ఉంంటుంది హారర్ థ్రిల్లర్. ఈ జోనర్స్‌కు విభిన్న ఎలిమెంట్స్ యాడ్ చేసి మరి డిఫరెంట్‌గా సినిమాలను రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. అలా ఇటీవల వచ్చి మంచి హిట్ అందుకున్న ఓటీటీ హారర్ థ్రిల్లర్ మూవీనే జరణ్.

ఓటీటీలోకి తెలుగులో వచ్చిన ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్- చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి తెలుగులో వచ్చిన ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్- చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ- ఇక్కడ చూసేయండి!

సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ కథాంశంతో మతిపోగొట్టే ట్విస్టులతో జరణ్ సినిమాను తెరకెక్కించారు. మరాఠీలో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జరణ్ జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న జరణ్ ఆగస్ట్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ ట్రెండింగ్‌లో

అయితే, కేవలం మరాఠీ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మాత్రమే జరణ్ ఓటీటీ రిలీజ్ అయింది. అయినా కూడా ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్‌లో దూసుకుపోయింది జరణ్ సినిమా. అలా ట్రెండింగ్‌లో ఉంటూ ఓటీటీలో సూపర్ హిట్ అయిన జరణ్ ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు భాషలో జరణ్ ఓటీటీ రిలీజ్ అయింది.

జరణ్ ఓటీటీ స్ట్రీమింగ్

నవంబర్ 7 నుంచి అంటే నిన్నటి నుంచి తెలుగులో జరణ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో జరణ్ ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతం జీ5లో తెలుగు, మరాఠీ భాషల్లో జరణ్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. ఈ విషయాన్ని తాజాగా జీ5 అధికారికంగా ప్రకటించింది.

కిష్కింధపురి ఓటీటీ తర్వాత

ఇటీవల అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి వంటి హారర్ థ్రిల్లర్‌తో వినోదం పంచిన జీ5 ఇప్పుడు జరణ్‌తో మరోసారి ఎంటర్‌టైన్ చేయనుంది. ఇకపోతే జరణ్ సినిమాకు హృషికేష్ గుప్త కథ, దర్శకత్వం అందించారు.

జరణ్ నటీనటులు

అనీజ్ బాజ్మి ప్రొడ‌క్ష‌న్స్, ఎ అండ్ ఎన్ సినిమాస్ ఎల్‌ఎల్పీ, ఏ3 ఈవెంట్స్ అండ్ మీడియా స‌ర్వీసెస్ ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాలో పాపులర్ నటి అమృతా సుభాష్‌, అనితా డేట్ కెల్క‌ర్‌, కిశోర్ ఖ‌డ‌మ్‌, జ్యోతి మ‌ల్షే, అయానీ జోష్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

జరణ్ మూవీ కథ

జరణ్ కథలోకి వెళితే.. రాధ (అమృత సుభాష్‌), త‌న కుమార్తె సయీ (అవ‌నీ జోషి)తో క‌లిసి త‌న పూర్వీకుల ఇంటికి వెళ్తుంది. ఓ పాత బొమ్మ దొరికిన త‌ర్వాత త‌న‌కు చిన్నతనంలో ఎదురైన వింత అనుభ‌వాల‌ను గుర్తు చేసుకుంటుంది.

రాధలో వింత మార్పు

ఆ తర్వాత అక్కడ పరిస్థితి అంతా మారిపోతుంది. ఆ త‌ర్వాత ఏమైంది? అనే సంఘ‌ట‌న‌లను వెన్నులో వ‌ణుకు పుట్టించే మిస్ట‌రీతో జరణ్ సినిమాను తెర‌కెక్కించారు డైర‌క్ట‌ర్‌. రాధలో నిగూఢంగా దాగి ఉన్న భ‌యాల‌న్నీ ఒక్క‌సారిగా పురివిప్ప‌డం, ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో వింత మార్పు క‌నిపించ‌డం వంటివి జరుగుతాయి.

జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్

వాస్త‌వానికి, ఇల్యూజ‌న్‌కి మ‌ధ్య ఉన్న గీత చెరిగిపోవ‌డం, అప్ప‌టి నుంచి ట్రామా, మెమ‌రీ, సూప‌ర్‌నేచుర‌ల్ ఇంట‌ర్వైన్ క‌ల‌గ‌లిపి క‌నిపించే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌తి క్ష‌ణం థ్రిల్‌ని పంచుతాయని జరణ్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ జీ5 చెబుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More