మరో ఓటీటీలోకి నిన్న వచ్చిన తెలుగు స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా- 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్- 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్
మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా అర్జున్ చక్రవర్తి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 8.2 రేటింగ్ ఉంది. మరి అర్జున్ చక్రవర్తి ఓటీటీ స్ట్రీమింగ్ మరో ప్లాట్‌పామ్ ఏంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వాటిలో నిన్న ఒక్కరోజే సుమారుగా 20 వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో తెలుగులో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ సైతం ఓటీటీ ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఒకటి స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా చిత్రం.

అలాంటివి చాలా తక్కువ
తెలుగులో అన్ని రకాల జోనర్ సినిమాలు చాలానే వస్తున్నాయి. కానీ, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో బయోగ్రాఫికల్‌గా వచ్చే సినిమాలు చాలా తక్కువ. అలా రీసెంట్‌గా థియేటర్లలో విడుదలైన సినిమానే అర్జున్ చక్రవర్తి. నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్య జీవిత కథ ఆధారంగా అర్జున్ చక్రవర్తి సినిమాను రూపొందించినట్లు ప్రమోషన్స్‌లలో మేకర్స్ తెలిపారు.
టైటిల్ రోల్‌లో విజయ రామరాజు
తెలుగు బయోపిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన అర్జున్ చక్రవర్తి సినిమాలో హీరోగా విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించాడు. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించారు. శ్రీని గుబ్బల అర్జున్ చక్రవర్తి సినిమాను నిర్మించారు. అర్జున్ చక్రవర్తి సినిమా థియేటర్లలో ఆగస్ట్ 29న రిలీజ్ అయింది.
46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్
అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు ముందే అర్జున్ చక్రవర్తి సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ వేడుకల్లో ప్రదర్శించబడి సుమారుగా 46 అవార్డ్స్ అందుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అలాంటి సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించుకుంది. కబడ్డీ ఆట, విజయం, లవ్ ట్రాక్, ఛాలెంజ్ వంటి అంశాలతో అర్జున్ చక్రవర్తి సినిమాను మలిచారు.
2 నెలలకు ఓటీటీలో
అర్జున్ చక్రవర్తి సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8.2 రేటింగ్ ఉంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత రెండు నెలలకు అర్జున్ చక్రవర్తి ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 25 నుంచి అర్జున్ చక్రవర్తి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలో తెలుగు భాషలోనే అర్జున్ చక్రవర్తి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
అర్జున్ చక్రవర్తి ఓటీటీ రిలీజ్
అయితే, తాజాగా మరో ఓటీటీలోకి అర్జున్ చక్రవర్తి సినిమా ఎంట్రీ ఇచ్చింది. లయన్స్ గేట్ ప్లేలో నిన్న (నవంబర్ 7) అర్జున్ చక్రవర్తి ఓటీటీ రిలీజ్ అయింది. అంటే మరో ఓటీటీలో నిన్నటి నుంచి అర్జున్ చక్రవర్తి స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తానికి రెండు, మూడు నెలల గ్యాప్‌తో 2 ఓటీటీల్లో అర్జున్ చక్రవర్తి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
అర్జున్ చక్రవర్తి నటీనటులు
ఇదిలా ఉంటే, అర్జున్ చక్రవర్తి సినిమాలో విజయ రామరాజు హీరోగా చేస్తే సిజా రోజ్ హీరోయిన్‌గా చేసింది. దయానంద్ రెడ్డి, హర్ష్ రోషన్, అజయ్ ఘోష్, అజయ్, దుర్గేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
2 ఓటీటీల్లో స్ట్రీమింగ్
మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా చూడాలనుకునేవారు అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న అర్జున్ చక్రవర్తి సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


