ఓటీటీలోకి 3 రోజుల్లో 4 కొత్త సినిమాలు- ఒకేరోజు ఒకేదాంట్లో 3- అన్నీ తెలుగులోనే- సిద్ధు రొమాంటిక్ టు రష్మిక హారర్ కామెడీ!
ఓటీటీలోకి 3 రోజుల గ్యాప్‌లో నాలుగు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అందులో ఒకేరోజు, ఒకేదాంట్లో 3 ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. వీటిలో సిద్ధు జొన్నల గడ్డ రొమాంటిక్ థ్రిల్లర్ తెలుసు కదా నుంచి రష్మిక మందన్నా హారర్ కామెడీ థామా వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవి తెలుగులోనే ఉండనున్నాయి.
ఓటీటీలోకి నాలుగు కొత్త సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. ఈ సినిమాలు 3 రోజుల గ్యాప్‌లో ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నా ఆ లేటెస్ట్ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

తెలుసు కదా ఓటీటీ
సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా చిత్రం తెలుసు కదా. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన దర్శకురాలిగా మారిన సినిమా ఇది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన తెలుసు కదా సినిమా యావరేజ్‌గా ఆడింది. అయితే, సినిమా టేకింగ్ చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి.
ఈ నెలలో వచ్చే వారమే తెలుసు కదా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుసు కదా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఇవాళ (నవంబర్ 9)న తెలుసు కదా ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో తెలుసు కదా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
డ్యూడ్ ఓటీటీ
తమిళ క్రేజీ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన మరో రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం డ్యూడ్. ప్రేమలు బ్యూటీ మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్స్‌గా చేసిన డ్యూడ్ మూవీకి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా తెలుసు కదాతోపాటే అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైంది.
డ్యూడ్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ కొట్టింది. డ్యూడ్ ఓటీటీ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామే సొంతం చేసుకుంది. తెలుసు కదా రోజు నుంచే అంటే నవంబర్ 14 నుంచి తెలుగు, తమిళం ఇతర భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో డ్యూడ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
బైసన్ ఓటీటీ
చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ నటించిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా బైసన్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా రజీషా విజయన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన బైసన్ తమిళంలో సూపర్ హిట్ అయింది.
బైసన్ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. తెలుసు కదా, డ్యూడ్ బాటల్లోనే నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో బైసన్ ఓటీటీ రిలీజ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా బైసన్ ఓటీటీ ప్రీమియర్ అవనుంది.
థామా ఓటీటీ
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బేతాళిగా నటించిన కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా థామా. ఆయుష్మాన్ ఖురానా హీరోగా, నవాజుద్దీన్ సిద్ధిఖి విలన్‌గా చేసిన థామాను ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కించారు. అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైన థామాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక థామా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. నవంబర్ 14 నుంచి ప్రైమ్ వీడియోలో థామా ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. హిందీతోపాటు తెలుగులో కూడా థామా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


